రైల్వే మంత్రిత్వ శాఖ

దేశంలో కోవిడ్-19 లాక్డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలోనూ

పూర్తిస్థాయిలో భార‌తీయ‌ రైల్వే స‌రుకు ర‌వాణా కార్య‌క‌లాపాలు
- అత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌తో పాటు విద్యుత్తు, మౌలిక రంగాల‌కు కావాల్సిన‌ స‌రుకు ర‌వాణా
- మూడు రోజుల్లో 7195 వ్యాగ‌న్ల ఆహార ధాన్యాలు, 64567 వ్యాగ‌న్ల బొగ్గు, 3314 వ్యాగ‌న్ల ఉక్కు, 3838 వ్యాగ‌న్ల పెట్రోలియం ర‌వాణా
- స‌వాళ్లు ఎదుర‌వుతున్నా మొత్తంగా అన్ని కారిడార్ల‌లో క‌లుపుకొని 143458 వ్యాగ‌న్ల స‌రుకు ర‌వాణా

Posted On: 02 APR 2020 1:43PM by PIB Hyderabad

 

కోవిడ్‌-19 కార‌ణంగా లాక్డౌన్ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ దేశ వ్యాప్తంగా నిత్య‌వ‌స‌ర వస్తువులు అందుబాటులో ఉంచే ప్ర‌య‌త్నంలో భాగంగా భారతీయ రైల్వే శాఖ తన సరుకు రవాణా సేవ‌ల‌ను పూర్తిస్థాయిలో కొనసాగిస్తోంది. దేశంలో అసాధార‌ణ ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ.. పౌరుల‌తో పాటు ఇత‌ర మౌలిక స‌దుపాయాల రంగానికి అవ‌స‌ర‌మైన అత్య‌వ‌స‌ర వ‌స్తువులను సకాలంలో అందజేస్తూ వారి అవ‌స‌రాలను తీర్చేందుకు భారతీయ రైల్వేశాఖ‌ తన సరుకు రవాణాను అన్నికారిడార్లలో పున‌రుద్ధ‌రిస్తూ వ‌స్తోంది. ఎదుర‌వుతున్న ప‌లు సవాళ్ల‌ను ఎదుర్కొంటూనే గ‌డిచిన మూడు రోజుల్లో రైల్వే శాఖ 7195 వ్యాగన్ల ఆహార ధాన్యాలు, 64567 వ్యాగన్ల బొగ్గు, 3314 వ్యాగన్ల ఉక్కు, 3838 వ్యాగన్ల పెట్రోలియం ఉత్ప‌త్తుల పంపిణీ చేసింది. ఇదే స‌మ‌యంలో రైల్వే శాఖ మొత్తం 143458 వ్యాగన్ల సరుకును ర‌వాణా నిమిత్తం లోడ్ చేసింది. బుధ‌వారం (ఏప్రిల్ 1న‌) మొత్తం 545 ర్యాకులు / 54177 వ్యాగన్లు లోడ్ చేయబడ్డా యి, వీటిలో 328 ర్యాకులు/ 17805 వ్యాగన్ల‌లో పౌరుల‌కు అవసరమైన నిత్య‌వ‌స‌ర వస్తువులు లోడ్ చేయబడ్డాయ‌ని రైల్వే శాఖ తెలిపింది. 54 ర్యాక్‌లు / 2343 వ్యాగన్ల‌లో ఆహార ధాన్యాలు, 5 ర్యాక్‌లు / 210 వ్యాగన్ల‌లో చక్కెర, 1 ర్యాక్‌ / 42 వ్యాగన్లలో పండ్లు & కూరగాయలు, 244 ర్యాక్‌లు / 14078 వ్యాగ‌న్ల‌లో బొగ్గు, మరియు 24 ర్యాక్‌లు / 1132 వ్యాగన్ల‌లో పెట్రోలియం ఉత్పత్తులు ర‌వాణా నిమిత్తం లోడ్ చేయ‌బ‌డ్డ‌ట్టుగా రైల్వే శాఖ తెలిపింది. 17 ర్యాకుల‌/ 761 వ్యాగన‌ల్లో ఎరువులు లోడ్ చేయ‌బ‌డిన‌ట్టు రైల్వే శాఖ తెలిపింది. స‌రుకు ర‌వాణాలో భాగంగా లోడింగ్, అన్‌లోడ్ కార్య‌క‌లాపాల్లో రైల్వే అనేక టెర్మినల్ పాయింట్ల వద్ద గతంలో ఎదురైన స‌వాళ్ల‌ను సమర్థవంతంగా పరిష్కరించుకొంటూ ముందుకు సాగుతున్న‌ట్టుగా భార‌తీయ రైల్వే శాఖ తెలిపింది. స‌ర‌కు ర‌వాణా నిరాటంకంగా జ‌రిపేందుకు గాను హోమ్‌ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జ‌రిపి ర‌వాణాలో ఎదుర‌వుతున్న సమస్యల‌ను పూర్తిస్థాయిలో పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్న‌ట్టుగా భార‌తీయ రైల్వే శాఖ తెలిపింది.



(Release ID: 1610370) Visitor Counter : 180