ఆర్థిక మంత్రిత్వ శాఖ
తరచుగా అడిగే ప్రశ్నలు : టర్మ్ లోన్లపై తాత్కాలిక మారటోరియం విధించడానికి ఆర్.బి.ఐ, బ్యాంకులను అనుమతించింది
Posted On:
01 APR 2020 12:35PM by PIB Hyderabad
గతవారం, భారతీయ రిజర్వు బ్యాంక్ 2020 మార్చి 1 నాటికి ఉన్న అన్ని టర్మ్ రుణాల చెల్లింపులపై, అదే విధంగా వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాలపై మూడు నెలల మారటోరియంను ప్రకటించేందుకు బ్యాంకులను అనుమతించింది.
తాత్కాలిక నిషేధం యొక్క సాంకేతిక అంశాల గురించి తరచూ అడిగే ప్రశ్నల జాబితాకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సమాధానం ఇచ్చింది.
ప్రశ్న 1 – భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటన ఏమిటి, ఎప్పుడు వచ్చింది?
సమాధానం - గత వారం, భారతీయ రిజర్వు బ్యాంకు 2020 మార్చి 1 నాటికి బకాయి ఉన్న అన్ని టర్మ్ రుణాలపై, అలాగే వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాలపై మూడు నెలల మారటోరియంను ప్రకటించింది.
ప్రశ్న 2 – భారతీయ రిజర్వు బ్యాంకు రిలీఫ్ ప్యాకేజ్ ను ఎందుకు ప్రకటించింది?
సమాధానం – కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అంతరాయాల వల్ల కలిగే రుణ సేవల భారాన్ని తగ్గించడానికి మరియు ఆచరణీయ వ్యాపారాల కొనసాగింపును నిర్థారించడానికి భారతీయ రిజర్వు బ్యాంకు కొన్ని నియంత్రణ చర్యలను ప్రకటించింది. నగదు ప్రవాహంలో అంతరాయాలు ఏర్పడడానికి ఆస్కారం ఉందని, కొన్ని సందర్భాల్లో వ్యాపారాలు లేదా వ్యక్తులు ఆదాయం కోల్పోవడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతో ఆయా వ్యక్తులు లేదా వ్యాపారాలకు ఈ మారటోరియం ఉపశమనం కలిగించవచ్చనే భావనతో ఈ ప్రకటన చేయడం జరిగింది.
ప్రశ్న 3 – ఆర్బీఐ కోవిడ్ -19 రెగ్యులేటరీ ప్యాకేజీ కింద ప్రయోజనాలు పొందడానికి అర్హత ఉన్న సదుపాయాలు ఏమిటి. రుణగ్రహీతలందరికీ ఈ సదుపాయాన్ని బోర్డు అంతటా విస్తరించారా?
సమాధానం – అన్ని రకాల టర్మ్ రుణాలు (వ్యవసాయ టర్మ్ రుణాలు, రిటైల్, పంట రుణాలు మరియు పూల్ కొనుగోళ్ల కింద తీసుకున్న రుణాలు సహా )మరియు క్యాష్ క్రెడిట్ / ఓవర్‌డ్రాఫ్ట్ ప్యాకేజీ కింద ప్రయోజనాలు పొందడానికి అర్హత పొంది ఉన్నాయి. 2020 మార్చి 1 నాటికి ప్రామాణిక ఆస్తులు అయిన అన్ని ఖాతాలకు ఇది అందుబాటులో ఉంది. అంతే కాకుండా, అనవసరమైన రాత పనిని నివారించడానికి టర్మ్ లోన్ వాయిదాలను (వడ్డీ కలిగి ఉంటుంది) తిరిగి చెల్లించడాన్ని 90 రోజుల వరకూ పొడగించడం ద్వారా రుణగ్రహీతలందరికీ ఈ సౌకర్యం బోర్డు అంతటా విస్తరించబడింది. టర్మ్ లోన్స్ విషయంలో అసలును తిరిగి చెల్లించే కాలాన్ని 90 రోజులు పొడిగించడం జరుగుతుంది. ఉదాహరణకు2025 మార్చి 1కి 60 వాయిదాల్లో చెల్లించాల్సిన రుణం 2025 జూన్ 1కి చెల్లిస్తే సరిపోతుంది.
ప్రశ్న 4 – అన్ని రకాల టర్మ్ లోన్లకు చెల్లింపుల రీషెడ్యూలింగ్ వర్తిస్తుందా?
సమాధానం – సెగ్మెంట్ మరియు టర్మ్ లోన్స్ క్రమంతో సంబంధం లేకుండా అన్ని విభాగాల్లోని అన్ని టర్మ్ లోన్ లకు ఇది వర్తిస్తుంది.
ప్రశ్న 5 – టర్మ్ లోన్ల రీ షెడ్యూల్ అసలు మొత్తానికి మాత్రమేనా అది వడ్డీని కూడా కలిగి ఉంటుందా?
సమాధానం – 2020 మార్చి 1 నుంచి 2020 మే 31 మధ్య మూడు నెలల కాలానికి అసలును రీ షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు 2020 మార్చి 1న టర్మ్ లోన్ చివరి విడత చెల్లింపు చేయవలసి ఉంటే, అది 2020 జూన్ 1న చెల్లించవచ్చు.
ఈఎంఐ ఆధారిత టర్మ్ లోన్స్ కోసం ఇది 2020 మార్చి 1 మరియు 2020 మే 31 మధ్య చెల్లించే మూడు ఈఎంఐలు అవుతుంది. మరియు దీని క్రమం మూడు నెలలు పొడగించబడుతుంది. (2)లో చెప్పిన విధంగా పొడిగించిన కాలంలో తిరిగి చెల్లించాలి.
ఇతర టర్మ్ లోన్స్ విషయంలో, చెల్లింపు క్రమంతో సంబంధం లేకుండా అంటే నెలవారీ, త్రైమాసిక, అర్థ వార్షిక, ఏటా, బుల్లెట్ చెల్లింపు మొదలైన వాటితో సంబంధం లేకుండా చెల్లించాల్సిన అన్ని వాయిదాలు మరియు వడ్డీ ఉంటుంది. టర్మ్ లోన్స్ విషయంలో తిరిగి చెల్లించడం ప్రారంభించని సందర్భంలో మూడు నెలల వడ్డీ భాగాన్ని మాత్రమే లెక్కించాలి.
ప్రశ్న 6 – టర్మ్ లోన్ యొక్క పొగిడించిన వ్యవధి ఒక వస్తువుకు నిర్దేశించిన గరిష్ట కాలానికి మించి లేదా పాలసీలో నిర్దేశించిన కాలానికి మించితే ఏం జరుగుతుంది ?
సమాధానం – ఉల్లంఘనలు లేదా ఆమోదాలు కోరే అవసరం లేకుండా ఇటువంటి టర్మ్ లోన్లు అన్నింటికీ ఇది పొడిగించబడుతుంది.
ప్రశ్న 7 – వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాల మీద వడ్డీ విచారణ (ట్రీట్ మెంట్) ఎలా ఉంటుంది?
సమాధానం – నగదు క్రెడిట్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ కు 2020 మార్చి 31, ఏప్రిల్ 30 మరియు మే 31న వర్తించే వడ్డీ రికవరీ వాయిదా వేయబడింది. ఏదేమైనా మొత్తం వడ్డీని 2020 జూన్ 30 వర్తించే వడ్డీతో పాటు తర్వాతి వడ్డీ తేదీతో పాటు నెలవారి వడ్డీ వర్తించని సందర్భాల్లో తిరిగి పొందాలి.
ప్రశ్న 8 – డీఫాల్ట్ రిపోర్టింగ్ విషయానికి వస్తే, రుణగ్రహీతలందరిపై ఆర్బీఐ ఇచ్చిన ఈ ఉపశమనం ప్రభావం ఏ విధంగా ఉంటుంది ?
సమాధానం – చెల్లంపులో ఏదైనా ఆలస్యం జరిగితే అది డీఫాల్ట్ కు దారి తీయడంతో పాటు క్రెడిట్ బ్యూరోలకు నివేదించబడుతుంది. వ్యాపార రుణాలకు రూ.5 కోట్లు మరుయు అంతకు మించి బ్యాంకులు దాటిన స్థితిని సి.ఆర్.ఐ.ఎల్.సి ద్వారా కూడా ఆర్బీఐకి నివేదిస్తాయి. ఈ ఉపశమన ప్యాకేజీ ఫలితంగా 2020 మార్చి 1 తర్వాత మీరిన చెల్లింపులు క్రెడిట్ బ్యూరోలు లేదా సి.ఆర్.ఐ.ఎల్.సి.కి మూడు నెలలు నివేదించబడవు. జరిమానా వడ్డీ లేదా ఛార్జీలు బ్యాంకులకు చెల్లించబడవు. అదే విధంగా కోవిడ్ -19 కారణంగా ఉత్పన్నమయ్య లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా క్రెడిట్ రేటింగ్ ఏజన్సీలు (సి.ఆర్.ఏ.లు) ఆలస్యాన్ని లిస్టెడ్ కంపెనీలు డీఫాల్ట్ గా పరిగణించకుండా సెబీ అనుమతించింది.
ప్రశ్న 9 – అంటే వ్యాపారాలు లేదా వ్యక్తులు తప్పనిసరిగా ఈ ప్రయోజనం పొందాలా?
సమాధానం – మీ నగదు ప్రవాహంలో అంతరాయ లేదా ఆదాయ నష్టం ఉంటే మీరు ఈ ప్యాకేజీ కింద ప్రయోజనాలు పొందవచ్చు. ఏదేమైనా రుణాలపై వడ్డీ తప్పనిసరిగా వెంటనే చెల్లించకపోయినా మరియు 3 నెలలు వాయిదా పడినప్పటికీ, మీ ఖాతాలో చేరడం కొనసాగడంతో పాటు అధిక వ్యయానికి దారి తీస్తుందనే అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది.
మీకు సులభంగా అర్థం కావాలంటే, మీ రుణం బకాయి 1,00,000 రూపాయలు ఉందనుకుంటే, మీ రుణాలపై మీకు 12 శాంత వడ్డీరేటు వసూలు చేయబడుతుందని అనుకుంటే, అప్పుడు ప్రతినెలా మీరు రూ.1000 వడ్డీగా చెల్లించవలసి ఉంటుంది. ఒక వేళ మీరు ప్రతినెలా వడ్డీ కట్టకపోతే ఏడాదికి 12 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అంటే 3వ నెల చివరికి మీరు రూ. 3,030 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా 10 శాతం వడ్డీ ఉంటే, మీరు నెలకు రూ.833 లేదా మూడు నెలలకు రూ. 2,521 చెల్లించవలసి ఉంటుంది.
ప్రశ్న 10 – తిరిగి చెల్లించేందుకు ఏదైనా బ్యాంక్ సిబ్బంది లేదా దాని రికవరీ ఏజెంట్ నన్ను సంప్రదించినట్లయితే నేను భయపడాలా ?
సమాధానం – భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రెగ్యులేటరీ ప్యాకేజీ కింద విస్తరించబడతున్న ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నట్లు బ్యాంక్ సిబ్బంది లేదా రికవరీ ఏజెంట్ కు తెలియజేయాలి.
ప్రశ్న 11 – నా క్రెడిట్ కార్డ్ బకాయిల పరిస్థితి ఏమిటి ?
సమాధానం – క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు కూడా ఉపశమనం లభిస్తుంది. క్రెడిట్ కార్డ్ బకాయిల విషయంలో కనీస మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంది. అది కూడా చెల్లించకపోతే అదే క్రెడిట్ బ్యూరోలకు నివేదించబడుతుంది. ఆర్బీఐ సర్క్యులర్ ను దృష్టిలో ఉంచుకుని, క్రెడిట్ కార్డ్ ఖాతాలోని బకాయిలు మిగిలిన మూడు నెలల కాలానికి క్రెడిట్ బ్యూరోలకు నివేదించబడవు.
అయితే, క్రెడిట్ కార్డు జారీ చేసే వారు చెల్లించని మొత్తానికి వడ్డీ వసూలు చేస్తారు. చెల్లించవలసిన వడ్డీని తెలుసుకోవడానికి మీరు మీ క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ ను సంప్రదించాలి. ఈ కాలంలో ఎటువంటి జరిమానా వడ్డీ వసూలు చేయబడనప్పటికీ, సాధారణ బ్యాంక్ క్రెడిట్ తో పోలిస్తే క్రెడిట్ కార్డ్ బకాయిలపై వడ్డీరేటు సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. మీరు దాని ప్రకారమే నిర్ణయం తీసుకోవాలి.
ప్రశ్న 12 – నాన్ ఫండ్ బేస్డ్ నుంచి ఫండ్ బేస్డ్ వరకూ లేదా వ్యాపారాల కోసం ఫండ్ బేస్డ్ మొదలుకుని నాన్ ఫండ్ బేస్డ్ వరకూ ఇంటర్ ఛేంజ్ బిలిటీని అనుమతించే విషయం ఏమిటి?
సమాధానం – 2020 మార్చి 1 నుంచి మే 31 వరకూ పేర్కొన్న వ్యవధిలో పొందిన పరస్పర మార్పిడి యొక్క ఫండ్ ఆధారిత భాగానికి వర్తించే వడ్డీ మారటోరియానికి అర్హత ఉంటుంది. మార్చి 1 నుంచి ఇవ్వబడిన మరియు ఆ కాలంలో పొందిన కొత్త ఆంక్షలకు సంబంధించి, ఫండ్ ఆధారిత భాగానికి వర్తించే వడ్డీ అర్హత పొందుతుంది.
ప్రశ్న 13 – ఇతర మార్గాల్లో, వ్యాపారాలకు ఉపశమనం ఇవ్వబడిందా ?
సమాధానం – వ్యాపారాలకు సంబంధించి తమ నగదు ప్రవాహానికి అంతరాయ కలగడం లేదా వర్కింగ్ క్యాపిటర్ చక్రం యొక్క పొడిగింపు కారణంగా వారి పని మూలధన అవసరాలను తిరిగి అంచనా వేయమని బ్యాంకును అభ్యర్థించవచ్చు. ఎం.ఎఫ్.బి. సదుపాయాలపై (ఎల్.సి.లు లేదా బి.జి.లు మొదలైనవి) మార్జిన్ తగ్గించాలని లేదా సెక్యూరిటీలో ఉపశమనం పొందేందుకు కూడా వారు అభ్యర్థించవచ్చు. ఈ అభ్యర్థనల యొక్క యథార్థత ఆధారంగా ఒక్కో కేసులను పరిశీలించి బ్యాంక్ శాఖలు నిర్ణయం తీసుకుంటాయి.
ప్రశ్న 14 – NBFC లు / MFI లు / HFC లకు వర్కింగ్ క్యాపిటర్ ఫైనాన్సింగ్ సడలింపు కింద అర్హత పొందగలవా?
సమాధానం – ప్రస్తుతం వాటిని ఈ పథకం కింద పరిగణించడం లేదు. ఏదేమైనా, ఇటీవల ప్రవేశపెట్టిన టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రీ ఫైనాన్సింగ్ ఆపరేషన్స్ అనగా టి.ఎల్.టి.ఆర్.ఓ. కింద ఈ ఆర్థిక మధ్యవర్తులకు తగిన ద్రవ్య మద్ధతు కోసం ఆర్బీఐ సదుపాయం కల్పించింది. 2020 మార్చి 27 నాటికి ఈ బాండ్లలో పెట్టుబడులు అత్యుత్తమ స్థాయికి మించి, ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్ మరియు నాన్ - కన్వర్టిబుల్ డిబెంచర్లలో బ్యాంకులు పొందే లిక్విడిటీకి సంబంధించి వ్యూహం ఏర్పరచాలి..
ప్రాథమిక మార్కెట్ జారీల నుంచి అర్హత సాధనాల పెరుగుతున్న హోల్డింగ్స్ లో 50శాతం వరకూ మరియు మ్యూచవల్ ఫండ్స్ మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా సెకండరీ మార్కెట్ నుంచి మిగిలిన 50 శాతం వరకూ బ్యాంకులు పొందవలసి ఉంటుంది. ఈ సదుపాయం కింద బ్యాంకులు పెట్టిన పెట్టుబడులు హెచ్.టి.ఎం. ఫోర్ట్ ఫోలియోలో చేర్చడానికి అనుమతించబడిన మొత్తం పెట్టుబడిలో 25 శాతానికి మించి మెచ్యూరిటీ (హెచ్.టి.ఎం)కు వర్గీకరించబడతాయి. ఈ సదుపాయం కింద ఎక్స్ పోజర్ లు కూడా లార్డ్ ఎక్స్ పోజర్ ఫ్రేమ్ వర్క్ కింద లెక్కించబడవు. ఈ విండో కింద బ్యాంకులు ఎన్.బి.ఎఫ్.సిలు / ఎం.ఎఫ్.ఐలు / హెచ్.ఎఫ్.సి.లు మొదలైన వాటికి మద్దతు ఇవ్వవచ్చు. ఈ ఆర్థిక మధ్యవర్తుల కోసం లిక్విడిటీ స్క్వీజ్ ను సహించడం జరగదు.
ప్రశ్న 15 – ఆర్బీఐ తీసుకున్న ఈ చర్యలన్నీ పునర్నిర్మాణంగా పరిగణించబడుతుందా. ఈ విషయంలో వర్తించే నిబంధనలు ఏమిటి ?
సమాధానం – కోవిడ్ – 19 రెగ్యులేటరీ ప్యాకేజీపై మార్చి 27, 2020 సర్క్యులర్ కింద ఆర్.బి.ఐ. నిర్దేశించిన చర్యలు పునర్నిర్మాణంగా పరిగణించబడవు. అందువల్ల ఆస్తి వర్గీ కరణ మరియు డౌన్ గ్రేడ్ జరగదు. దీని ప్రకారం, పునర్నిర్మించిన ఖాతాల కోసం మెరుగుపరిచిన నిబంధనలు వర్తించవు.
ప్రశ్న 16 – ఎస్.ఐ / ఈ.సి.ఎస్ / ఎన్.ఏ.సి.హెచ్ ద్వారా వాయిదాలు/ ఈ.ఎం.ఐ.లు తిరిగి పొందడం సంగతేంటి ? రుణ గ్రహీతలు కోరితే, వాయిదాలు/ ఈ.ఎం.ఐ.లను తిరిగి చెల్లించే విధానం ఏమిటి.
సమాధానం - దయచేసి సవరించిన ఆదేశాల కోసం మీ బ్యాంకును సంప్రదించండి.
(Release ID: 1609937)
Visitor Counter : 714
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam