గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం వేత‌నాల పెంపు

Posted On: 31 MAR 2020 11:02AM by PIB Hyderabad

కోవిడ్ 19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప‌లు ముఖ్య‌మైన నిర్ఱ‌యాలు తీసుకుంది. ఏప్రిల్ 1నుంచి మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం వేత‌నాల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించారు. జాతీయ‌స్థాయిలో స‌రాస‌రి చూసిన‌ప్పుడు రూ. 20 పెంచారు. ఈ పెంపుతో ఈ ప‌థ‌కంద్వారా ప‌నులను పొందుతున్న ఎస్సీ ఎస్టీ , బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన కూలీలు ల‌బ్ధి పొందుతారు. అంతే కాదు స‌న్న‌కారు రైతుల‌కు కూడా మేలు జ‌రుగుతుంది. లాక్ డౌన్ ద్వారా విధించిన నియమ నిబంధ‌న‌ల్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉల్లంఘించ‌కుండా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతూనే ఈ ప‌నుల‌ను చేప‌డ‌తారు. 
వేత‌నాలు మ‌రియు వ‌స్తువుల‌కు సంబంధించిన బ‌కాయిల‌ను చెల్లించ‌డానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాధాన్య‌త‌నిచ్చింది. ఈ వారంలో ఆయా రాష్ట్రాల‌కు,కేంద్ర పాలిత ప్రాంతాల‌కు రూ. 4, 431 కోట్లను విడుద‌ల చేసింది. ఈ బ‌కాయిల‌కు సంబంధించి ఇంకా మిగిలిపోయిన మొత్తాల‌ను 2020-21 సంవ‌త్స‌రానికి సంబంధించిన మొద‌టి విడ‌త నిధుల‌తో క‌లిపి ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఏప్రిల్ 15, 2020లోపు విడుద‌ల చేస్తారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి రూ. 721 కోట్లు విడుద‌ల చేయ‌డం జ‌రిగింది.  
 ****


(Release ID: 1609754) Visitor Counter : 235