పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలకు మందులు సరఫఱా చేసిన కార్గో విమానాలు కీలక సరఫరా కార్యకలాపాలలో పాలుపంచుకున్న ప్రైవేటు విమానయాన సంస్థలు
Posted On:
31 MAR 2020 10:50AM by PIB Hyderabad
దేశంలోని దక్షిణాది, తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు మందుల సరఫరాకు మార్చి 30,2020న కార్గో విమాన సర్వీసులను నడపడం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
లైఫ్‌లైన్ -1 ఎయిర్ ఇండియా విమాన సర్వీసు ఎ 320, ముంబాయి- న్యూఢిల్లీ- బెంగళూరు- ముంబాయి మార్గంలో 6593 కేజీల హెచ్ ఎల్ ఎల్ సరకును, నాగాలాండ్ వెంటిలేటర్ మాస్క్‌లను, కేరళ, కర్ణాటక సరకులను మేఘాలయ బైపాప్స్, కోయంబత్తూర్‌కు టెక్స్‌టైల్‌మంత్రిత్వ శాఖ సరకును రవాణా చేసింది.
లైఫ్ లైన్ -2: హిండన్ -దిమాపూర్- ఇంఫాల్- గువాహటి ఐఎఎఫ్ విమానం హెచ్ ఎల్ ఎల్ సరకును, ఐసిఎం ఆర్ కిట్స్‌ను షిల్లాంగ్‌కు రవాణా చేసింది.
ఇండిగో, స్పైస్ జెట్, బ్లూడార్ట్ విమానాలు కూడా వాణిజ్యప్రాతిపదికన ప్రైవేటు విమానాలు నడుపుతున్నాయి.
ప్రధాన భాగస్వామ్య పక్షాలతో ఎం.ఒ.సి.ఎ గ్రూప్ ఏర్పాటు చేసింది. హబ్, స్పోక్ లైఫ్ లైన్ సర్వీసులు ప్రారంభించారు. కార్గో హబ్‌లను ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా లలో ఏర్పాటు చేశారు. గౌహతి, దిబ్రూఘడ్, అగర్తల,ఐజ్వాల్, ఇంపాల్, కోయంబత్తూర్, తిరువనంతపురంలలో ని కేంద్రాలకు ఈ హబ్‌లు సరకు అందిస్తాయి.
మొత్తం కార్గో లోడ్‌ను మార్చి 26 నుంచి మార్చి 29 ,2020 వరకు పది టన్నులు చేరవేశారు. ఈ కార్గోలో కోవిడ్ -19 సంబంధిత రీజెంట్స్, ఎంజైమ్‌లు, వైద్య పరికరాలు, పరీక్షా పరికరాలు, పిపిఎఫ్, మాస్క్‌లు, గ్లోవ్‌లు, హెచ్ ఎల్ ఎల్ యాక్ససరీలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోరిన సరకులు ఉన్నాయి.
మెడికల్ ఎయిర్ కార్గోకు సంబంధించి ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసి ఆచరణలోకి తెచ్చారు.
ఈ వెబ్ సైట్ పూర్తిగా 1 ఏప్రిల్ 2020 నుంచి పనిచేస్తుంది. ఇందుకు సంబంధించిన లింక్ ఎం.ఒ.సి.ఎ వెబ్ సైట్ (www.civilaviation.gov.in).
కోవిడ్ -19 పై పోరాటానికి సంబంధించి చర్యలు ముమ్మరం చేయడంలో భాగంగా సమాచార మార్పిడి, ప్రశ్నలకు సమాధానాలు, క్షేత్రాస్థాయిలో కార్యకలాపాల నిర్వహణ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అలాగే సంబంధిత గమ్యస్థానాలకు సకాలంలో సరకులు చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు
(Release ID: 1609631)
Visitor Counter : 130