శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సార్స్ –కోవ్ -2 కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కులు : ఇంటిలో మాస్కుల తయారీకి కరదీపిక (మాన్యువల్) విడుదల చేసిన ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

డి ఎస్ టి , డి బి టి, సి ఎస్ ఐ ఆర్, డి ఏ ఇ, డి ఆర్ డి ఓ మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ ఐ ఎస్సి) పరిధిలోని సంస్థలు ప్రామాణిక, కఠిన పద్దతులను పాటించి స్వయం అంచనా మరియు తమ ప్రయోగశాలలను సిద్ధం చేయడం ద్వారా పరిశోధన, పరీక్షలు జరిపేందుకు అనుమతిస్తూ కార్యాలయ పత్రంలో పెర్కొనడమైనది
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు భారత వైద్య పరిదోధనా మండలి (ఐ సి ఎం ఆర్) నిర్దేశించిన ప్రాధాన్యతల ప్రకారం పరీక్షలను వర్గీకరించడం జరుగుతుంది

ఫలితాల ప్రాతిపదికన స్వల్పకాలిక, మధ్యకాలిక పరిశోధనలుగా వర్గీకరణ

Posted On: 31 MAR 2020 11:09AM by PIB Hyderabad

ఇంటిలో మాస్కుల తయారీకి ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం కరదీపిక విడుదల చేసింది.  దాని పేరు  “సార్స్ –కోవ్ -2 కరోనా వైరస్ వ్యాప్తి  నివారణకు మాస్కులు”.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన సందేశాన్ని ఉటంకిస్తూ,  “ఆల్కొహాల్ ఆధార శానిటైజర్ లేక సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడుక్కోవడంతో పాటు ధరించినప్పుడే మాస్కు ప్రభావశీలిగా ఉంటుంది.  మాస్కు ధరించినప్పుడు దానిని ఎలా ఉపయోగించాలో మరియు దానిని పారవేయడం ఎలాగో తెలిసి ఉండాలి”.  

 

జనాభాలో సగం మంది మాత్రమే మాస్కులు ధరించినట్లయితే,  కేవలం 50% మందికి మాత్రమే వైరస్ సోకుతుంది.  జనాభాలో 80% మంది మాస్కు ధరించినట్లయితే వైరస్ వ్యాప్తి తక్షణం  నిలిచిపోతుందని విశ్లేషణ వల్ల తెలిసింది. 

అయితే మాస్కు ఎందుకు ధరించాలి? “ఒకరి నుంచి మరొకరికి కోవిడ్ -19 వైరస్ సులభంగా వ్యాపిస్తుంది.  వైరస్ మోసుకెళ్ళే సూక్ష్మ బిందువులు / చిన్న చుక్కలు వెంటనే తడి ఆరిపోయి పరమాణువుల రూపంలో గాలిలో తేలుతూ వివిధ ఉపరితలాలపై పడుతాయి.  కోవిడ్ -19 వ్యాధికి మూలమైన సార్స్ –కోవ్ -2 వైరస్ గాలితుంపరలో దాదాపు మూడు గంటల వరకు ఉంటుందని కనుగొన్నారు.  ప్లాస్టిక్ మరియు స్టీలు పాత్రలపై దాదాపు మూడు రోజుల వరకు ఉంటుంది.

వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా గాలిలో వ్యాపించే తుంపర ద్వారా ఇతరుల శ్వాసకోశంలోకి వ్యాపించే అవకాశాలను మాస్కులు తగ్గిస్తాయని కరదీపిక తెలిపింది.  నిర్ధారిత ఉష్ణోగ్రతలో , అతినీలలోహిత కిరణాలు, నీరు, సబ్బు మరియు ఆల్కొహాల్ వంటి సాధనాలను ఉపయోగించి శుభ్రం చేసిన మాస్కులు ధరించిన వారు వైరస్ ను పీల్చే అవకాశాలు తక్కువ అని కరదీపికలో పేర్కొన్నారు. ఆ విధంగా మాస్కుల ధారణ వైరస్ వ్యాప్తిని ఆపడంలో కీలకం.

స్వచ్చంద సంస్థలు (ఎన్జీవోలు) మరియు వ్యక్తులు సొంతంగా మాస్కులు తయారు చేసి ఉపయోగించడాన్ని ప్రోత్సహించడంలో ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా మాస్కుల ఆచరణను త్వరితం చేయడం.  మాస్కుల తయారీకి ప్రతిపాదిత డిజైన్లు సులభంగా ఇంటి వద్ద లభించే పదార్ధాలతో తయారు చేయడానికి,  సులభంగా మళ్ళీ మళ్ళీ వాడటానికి అనువుగా ఉంటాయి. దేశవ్యాప్తంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నివసించే వారు తప్పనిసరిగా మాస్కులు వాడాలని ప్రత్యేకంగా సిఫార్సుచేయడమైనది.

అంతకు ముందు ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన శాస్త్ర మరియు సాంకేతిక సాధికారిక కమిటీ  శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనేందుకు శీఘ్రగతిన చర్యలు తీసుకోనని తెలిపారు. కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు సౌకర్యాలను పెంచే లక్ష్యంతో  ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రయోగశాలల్లో ప్రామాణిక, కఠిన పద్దతులను పాటించి పరిశోధన, పరీక్షలు జరిపేందుకు అనుమతిస్తూ ప్రకటన విడుదల చేశారు. డి ఎస్ టి , డి బి టి, సి ఎస్ ఐ ఆర్, డి ఏ ఇ, డి ఆర్ డి ఓ మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ ఐ ఎస్సి) పరిధిలోని ప్రయోగశాలలను ఇందుకు సిద్ధం చేస్తారు.   కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు భారత వైద్య పరిదోధనా మండలి (ఐ సి ఎం ఆర్) నిర్దేశించిన ప్రాధాన్యతల ప్రకారం పరీక్షలను వర్గీకరిస్తారు. అదేవిధంగా పరిశోధనలను  ఫలితాల ప్రాతిపదికన స్వల్పకాలిక, మధ్యకాలిక పరిశోధనలుగా వర్గీకరిస్తారు.

శాస్త్ర మరియు సాంకేతిక సాధికారిక కమిటీని 19 మార్చి, 2020న ఏర్పాటు చేశారు. కమిటీకి నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ వినోద్ పాల్ అధ్యక్షత వహించే ఈ కమిటీలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె. విజయ రాఘవన్ కూడా ఉంటారు. కోవిడ్ -19 వ్యాధిని అరికట్టేందుకు వివిధ శాస్త్రీయ సంస్థలు, శాస్త్రజ్ఞులు, పరిశ్రమలు మరియు నియంత్రణ సంస్థల మధ్య సమన్వయంతో పాటు వైరస్ కు సంబంధించిన పరిశోధన గురించి కమిటీ సత్వర నిర్ణయాలు తీసుకుంటుంది.

ఇళ్ళలో తయారు చేసిన మాస్కుల వినియోగంపై సవివరమైన కరదీపిక (ఇంతకు ముందు విడుదల చేసిన కరదీపిక స్థానంలో):  

 

 


(Release ID: 1609629) Visitor Counter : 187