పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యటక శాఖ నుంచి స్ర్టాన్‌డెడ్ ఇన్ ఇండియా పోర్టల్
భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీ పర్యటకులకు దన్నుగా నిలవటమే లక్ష్యం
Posted On:
31 MAR 2020 1:09PM by PIB Hyderabad
కోవిడ్-19 వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య పరిస్థితులు నెలకొని మన దేశంలో చిక్కుకుపోయిన విదేశీ టూరిస్టులకు బాసటగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిర్మాణాత్మక చర్యలను చేపట్టింది. లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన విదేశీ పర్యటకుల కోసం కేంద్ర పర్యటక మంత్రుత్వ శాఖ ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. స్ర్టాన్‌డెడ్ ఇన్ ఇండియా అనే పేరుతో ఈ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. మాతృ దేశానికి దూరంగా వచ్చి ఇక్కడ చిక్కుకుపోయినప్పటికీ విదేశీ పర్యటకులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను భారత సర్కారు వారికి అందిస్తోన్న వివిధ రకాల సేవలను ఇందులో పొందుపరిచారు. విదేశీ పర్యటకులకు సహాయక నెట్‌వర్క్‌గా నిలవాలనే లక్ష్యంతో దీనిని అందుబాటులోకి తెచ్చినట్టుగా అధికారులు తెలిపారు. ఈ పోర్టల్‌లో విదేశీ పర్యటకుల సహాయార్థం కోవిడ్- 19 హెల్ప్ లైన్ నంబర్లు, కాల్ సెంటర్ నంబర్లను అందుబాటులో ఉంచారు. దీనికి తోడు రాష్ర్టాల వారీగా అందుబాటులో ఉన్న టూరిజం సహాయక మౌలిక వసతుల సమాచారాన్నీ ఈ పోర్టల్‌లో పొందుపరిచారు. విదేశీ పర్యటకులు సంబంధిత రాయబార కార్యాలయాల అధికారులు, అథారిటీలతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా హెల్ప్ సపోర్ట్ సెక్షన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీ పర్యటకులు మరింత సహాయం కోసం strandedinindia.com or incredibleindia.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సర్కారు సూచించింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో విదేశీ పర్యటకుల విషయై పర్యటక మంత్రిత్వశాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, అసవరమైన వారికి సహాయపడేందుకు గాను అన్ని రకాల కార్యక్రమాలను చేపడుతూ వస్తున్న సంగతి విదితమే.
(Release ID: 1609620)
Visitor Counter : 295
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam