పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 ప్రభావం వల్ల ఏదైనా విపత్తు సంభవిస్తే వంటగ్యాస్ సరఫరా పనిచేసే డెలివరీ బాయ్స్ మరియు ఇతరులను ఆదుకోవడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించాయి.
ఈ చర్యను పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు
प्रविष्टि तिथि:
30 MAR 2020 5:25PM by PIB Hyderabad
కోవిడ్ -19 వైరస్ వ్యాధి సోకడం వల్ల, దాని ప్రభావం వల్ల వంటగ్యాస్ (ఎల్ పి జి) సిలిండర్ల సరఫరా శృంఖలలో విధులు నిర్వహిస్తున్న షో రూమ్ సిబ్బంది, గోదాం కీపర్లు, మెకానిక్కులు మరియు డెలివరీ బాయ్స్ ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణించిన కేసుల్లో ఒకసారి ఏకమొత్తం ప్రత్యేక సహాయం కింద రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐ వో సి ఎల్, బి పి సి ఎల్, హెచ్ పి సి ఎల్ సోమవారం ప్రకటించాయి.
వంట గ్యాస్ నిత్యావసర వస్తువు. అందువల్ల దీనిని లాక్ డౌన్ నుంచి మినహాయించినందువల్ల దేశవ్యాప్తంగా వినియోగదారులందరికీ నిరంతరాయంగా వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడానికి ఈ సంక్షోభ సమయంలో కూడా సిబ్బంది పనిచేయవలసి ఉంటుంది.
చమురు మార్కెటింగ్ కంపెనీలు చొరవతో తీసుకున్న ఈ చర్యను పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు “మానవతతో ఇండియన్ ఆయిల్, బి పి సి ఎల్ మరియు హెచ్ పి సి ఎల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. “సుహృద్భావ పూర్వకంగా కంపెనీలు తీసుకున్న ఈ చర్య దుష్కరమైన ఇలాంటి సమయంలో మన సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించడమే. మన శ్రామికవర్గ శ్రేయస్సు మనకు అన్నింటికన్నా ముఖ్యమైనది. కరుణతో తీసుకున్న ఈ చర్య మన కార్మికశక్తి భద్రతను మరింత పటిష్టం చేసి కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతావని చేస్తున్న పోరాటానికి తోడ్పడుతుంది.” అని మంత్రి ట్వీట్ చేశారు.
*****
(रिलीज़ आईडी: 1609348)
आगंतुक पटल : 167