ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సామాజిక దూరం పాటించడమే అత్యంత సమర్ధవంతమైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు : దేశ ప్రజలు తమనీ, తమ కుటుంబాలనీ రక్షించుకోవాలని కోరారు

మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తమ భావాలను పంచుకుంటూ - కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో భారతదేశం విజయం సాధిస్తుందని నరేంద్రమోదీ నొక్కి చెప్పారు.

ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందనీ, కరోనా వైరస్ ను అరికట్టడానికి అంతర్జాతీయ సమాజం చేతులు కలపాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్నవారితోనూ, వైద్యులతోనూ ప్రధానమంత్రి మాట్లాడారు; వారి కృషినీ, సంకల్పాన్నీ ప్రశంసించారు.

ఐసోలేషన్ లోనూ, స్వీయ నిర్బంధంలోనూ ఉన్న వారికి సానుభూతి, సహకారం చూపించవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి సూచించారు.

Posted On: 29 MAR 2020 4:02PM by PIB Hyderabad

 

" కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న చాలా మంది సైనికులు కేవలం తమ ఇళ్లకే పరిమితం కాకుండా, తమ్ ఇళ్ల నుండి బయటకు వచ్చి సేవలందిస్తున్నారు. వీరు ముందు వరుసలో ఉన్న సైనికులు.  ముఖ్యంగా, నర్సులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది గా సేవలందిస్తున్న మన సోదర సోదరీమణులు. వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేసి, వారిలో ఉత్సాహాన్ని పెంపొందించడం కోసం వారిలో కొంత మందితో నేను మాట్లాడాను. వారి  చిత్తశుద్ధి, నిబద్ధత, నాలో ఉత్సాహాన్ని పెంపొందించుకోడానికి కూడా సహాయపడింది. "

కోవిడ్-19 కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సామాజిక దూరం పాటించడమే అత్యంత సమర్ధవంతమైన మార్గమనీ, లాక్ డౌన్ పాటించడం ద్వారా ప్రజలు తమని తాము రక్షించుకోవచ్చుననీ,  ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు మన్ కీ బాత్ 2.0 పదవ సంచిక ద్వారా తమ భావాలను పంచుకుంటూ -  " ప్రజలు తమనీతమ కుటుంబాన్నీ కాపాడుకోవడం కోసంముందు ముందు చాలా రోజులు లక్షణ రేఖకు కట్టుబడి ఉండాలి.  ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో,  ప్రతి భారతీయుని సంకల్పం, సంయమనం సహాయపడతాయి." అని చెప్పారు. 

మానవజాతిని నిర్మూలించడానికి  ముప్పుగా పరిణమించిన ఈ వైరస్ ను నిర్మూలించే ప్రక్రియలో చేతులు కలపాలని నరేంద్రమోదీ అంతర్జాతీయ సమాజానికి పిలుపు నిచ్చారు. 

"కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించింది.  జ్ఞానులు, శాస్త్రవేత్తలుధనవంతులుపేద ప్రజలుశక్తి వంతులు, బలహీనులు అనే తేడా లేకుండా అందరికీ ఇది ఒక ఒక సవాలుగా ఉంది.   ఇది  దేశాల సరిహద్దులకు గానీఒక ప్రాంతం లేదా ఒక సీజన్ కు గానీ కట్టుబడి లేదు.  ఈ వైరస్ ఒక విధంగా, మానవ జాతిని నిర్మూలించడానికి కంకణం కట్టుకుంది. అందువల్ల, దానిని నిర్మూలించాలనే సంకల్పంతో మానవజాతి ఐక్యంగా ముందుకు రావాలి." అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. 

130 కోట్ల మంది ప్రజలతో ఉన్న దేశంలో కరోనా వైరస్ తో పోరాడాలంటే, లాక్ డౌన్ ప్రకటించడం కంటే వేరే ప్రత్యమ్నాయం లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.   కరోనా వైరస్ తో పోరాటం అంటే జీవన్మరణ సమస్య అనీ, అందుకే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందనీ, ఆయన ఉద్ఘాటించారు.   ప్రస్తుతం,  ప్రపంచం అనుసరిస్తున్న మార్గాన్ని గమనించినట్లైతే, ఈ ఒక్క మార్గమే శరణ్యమని, నరేంద్రమోదీ వివరించారు.  ప్రజల భద్రత ను కాపాడాలని, ఆయన అన్నారు. 

కోవిడ్ -19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను నియమాలను ఉల్లంఘించే వారు, తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లేనని నరేంద్రమోదీ హెచ్చరించారు.   ఎవరైతే లాక్ డౌన్ నియమాలను పాటించరో, వారు తమ ప్రాణాలను ఈ కరోనా వైరస్ మహమ్మారి నుండి కాపాడుకోవడం చాలా కష్టం అని ఆయన స్పష్టం చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు.  ఇప్పుడు వారందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.   కరోనా పై పోరు ఊహించని రీతిలో, ఒక సవాలుగా మారడంతో, ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు గతంలో ప్రపంచంలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్నాయి." అని ప్రధానమంత్రి తెలియజేశారు. 

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి భారతీయులు చేపట్టిన చర్యలు, చేస్తున్న కృషి, భారతదేశం ఈ మహమ్మారిని జయించేలా దారితీస్తాయని, ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. 

"పేదల పట్ల మనం చూపే సానుభూతి కూడా చాలా గొప్పది.   సంక్షోభ సమయంలో మనం ఎవరైనా ఒక పేద వ్యక్తిని కానీ లేదా ఒక ఆకలి గొన్న వ్యక్తిని కానీ చూస్తే, ముందుగా మనం వారికి ఆహారం అందించడానికి ప్రయత్నిస్తాము. అది మన మానవత్వం. " అని నరేంద్రమోదీ చెప్పారు.  

వారి అవసరాల గురించి మనం ఆలోచించాలి,  తనకున్న  విలువలు, సంస్కృతిలో భాగంగా భారతదేశం ఆ పని చేయగలదని, ఆయన చెప్పారు.    అనారోగ్యాన్నీ, దాని లక్షణాలనూ మొగ్గలోనే తుంచివేయాలనే అర్ధంతో -  ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఒక సామెత ను ఉదహరించారు.   అయితే, దాన్ని వెంటనే నయం చేయలేనప్పుడు, దాని చికిత్స చాలా కష్టమౌతుందనీ, ఇప్పుడు, ప్రతి భారతీయుడు అదే చేస్తున్నాడనీ, ఆయన చెప్పారు. 

కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించింది. జ్ఞానులు, శాస్త్రవేత్తలుధనవంతులుపేద ప్రజలుశక్తి వంతులు, బలహీనులు అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఇది ఒక ఒక సవాలుగా మారిందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. అందువల్లే, తాను ఈ రోజు మన్ కీ బాత్  కార్యక్రమంలో  ఈ  సమస్యకే పరిమితమయ్యానని తెలిపారు.  

తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నరేంద్రమోదీ దేశప్రజలందరికీ  హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేసారు.    ముఖ్యంగా పేద ప్రజలు గురించి ప్రస్తావిస్తూ, వారి కష్టాలను  తను పూర్తిగా అర్ధం చేసుకున్నానని ఆయన చెప్పారు.   మంచి ఆరోగ్యం ఒక గొప్ప అదృష్టమనీ,  ఆరోగ్యం ఒక్కటే ఆనందానికి సరైన మార్గమనీ పేర్కొంటూ - ఆయన మరొక సామెతను ఉదహరించారు.  

ఈ పోరులో, కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో చాలా మంది సైనికులు,  కేవలం వారి ఇళ్లకే పరిమితం కాకుండా, వారి ఇళ్ల నుండి బయటకు వచ్చి కూడా పోరాడుతున్న వారు ఉన్నారని, ప్రధానమంత్రి చెప్పారు. 

" వీరు ముందు వరుసలో ఉన్న సైనికులు ముఖ్యంగా - నర్సులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది గా సేవలందిస్తున్న మన సోదర సోదరీమణులు కరోనా వైరస్ ను ఓడించారు". అని ఆయన పేర్కొన్నారు. 

కోవిడ్-19 కు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటంలో పాల్గొంటున్న కొంత మంది తో ప్రధానమంత్రి ఫోన్ లో మాట్లాడారు. తద్వారా వారిలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు, తాను కూడా వారితో పాటు సంతోషపడుతూ, వారి నుండి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు.  

ఈ విపత్తు నుండి తొందరగా బయటపడాలనే ఉద్దేశ్యంతో వీరు సాధ్యమైనంత వరకు పట్టుదలతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

" వారు మనకు ఏది చెప్పిన అది కేవలం మనం వినాలని కాదు, మరింత నిజాయితీతో జీవితంలో సాధన చేయాలని " ఆయన చెప్పారు. 

నర్సులు ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న నిస్వార్ధ సేవలను కూడా ప్రధానమంత్రి అభినందించారు. 

" భారతదేశం ఇంత భారీ స్థాయిలో ఈ పోరాటం సాగిస్తోందీ అంటే, అది కేవలం యుద్ధంలో అగ్రభాగాన నిలిచి పోరాడే సైనికుల వంటి  వైద్యులు, నర్సులు, అనుబంధ వైద్య సిబ్బంది, ఆశా, ఏఎన్ఎమ్ కార్యకర్తలు, పారిశుధ్య పనివార్ల ఉత్సాహం, అంకిత భావమే ప్రధాన కారణం.   వారి ఆరోగ్య పట్ల ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.   అందువల్లే, ఈ రంగాలకు చెందిన సుమారు 20 లక్షల మంది సహోద్యోగులకు ప్రభుత్వం 50 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా ప్రకటించింది. దీంతో, వారు మరింత ఆత్మవిశ్వాసంతో దేశాన్ని ముందుకు నడిపించగలుగుతారు". అని ఆయన పేర్కొన్నారు. 

దేశంలో నిత్యావసర వస్తువుల సరఫరా దెబ్బతినకుండా, నిరంతరాయంగా పనిచేస్తున్న, మన పొరుగున ఉన్న చిన్న చిన్న చిల్లర దుకాణదారులు, డ్రైవర్లు, పనివారి సేవలను ఆయన ప్రశంసించారు.   ఈ పోరాటంలో బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారు ముందంజలో ఉన్నారని మోదీ అన్నారు.   చాలామంది ఈకామర్స్ కంపెనీలలో డెలివరీ సిబ్బందిగా పనిచేస్తున్నారనీ, వారు కిరాణా సామానులను నిర్ణీత సమయాల్లో వినియోగదారులకు అందజేస్తున్నారనీ, ఆయన చెప్పారు.  

ప్రజలు టెలివిజన్ కార్యక్రమాలు వీక్షించడానికీ, డిజిటల్ చెల్లింపులు చేయడానికీ అవాంతరాలు లేకుండా చూస్తున్న ఉద్యోగుల కృషిని  ప్రధానమంత్రి అభినందించారు.   అన్ని భద్రతా చర్యలూ పాటించాలనీ, తమ పట్ల, తమ కుటుంబ సభ్యుల పట్ల జాగత్త వహించాలనీ  ఆయన విజ్ఞప్తి చేశారు.  

ప్రస్తుత పరిస్థితుల్లో మనం సామాజిక దూరం పాటించవలసిన అవసరం ఉంది. అయితే, మనోభావాలకు, భావోద్వేగాలకు దూరం కాదు అన్న విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకోవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి వివరించారు. 

కరోనా వైరస్ అనుమానితులపట్లఇంటి దగ్గర క్వారంటైన్ లో ఉన్న వాళ్ల పట్లా కొంతమంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగాలేదుఇటువంటి సంఘటనలు నా దృష్టికి వచ్చాయిఇది ఎంతో దురదృష్టకరమైన విషయం.   క్వారంటైన్ లో ఉన్న వారి పట్ల కొంతమంది వ్యవహరిస్తున్న తీరు తనను బాధపెట్టినట్లు ఆయన చెప్పారు.  ఇతర ప్రజలు వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు, తమకు తాముగా క్వారంటైన్ లో ఉంటున్నవారిని ఆయన అభినందించారు.  

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సామాజిక దూరం పాటించడం అనేది అత్యంత సమర్ధవంతమైన విధానమని ప్రధానమంత్రి చెప్పారు.   ఈ పోరాటంలో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, క్షేమంగా ఉండాలనీ, దేశ ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలనీ ఆయన మళ్ళీ విజ్ఞప్తి చేశారు. 

****


(Release ID: 1609168) Visitor Counter : 221