ప్రధాన మంత్రి కార్యాలయం

"మన్ కీ బాత్ 2.0" లో 10వ సంచిక నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

లాక్ డౌన్ కు కట్టుబడి ఉండాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు.

Posted On: 29 MAR 2020 2:07PM by PIB Hyderabad

"మన్ కీ బాత్ 2.0" లో 10వ సంచిక నుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, కఠిన నిర్ణయాలను తీసుకున్నందుకు క్షమించవలసిందిగాకోరారు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరులో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. 

 

భారత దేశ ప్రజలను క్షేమంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యమని పేర్కొంటూ, భారతదేశం కలిసికట్టుగా పోరాడి, కోవిడ్-19 ను ఓడించగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

 

"  ఈ లాక్ డౌన్ ప్రజలను,  వారి కుటుంబాలను క్షేమంగా ఉంచుతుంది. ఐసోలేషన్ సూత్రాన్ని పాటించనివారు ఇబ్బందుల్లో పడతారు." అని ప్రధానమంత్రి హెచ్చరించారు. 

 

ప్రధానమంత్రి ఈ రోజు మన్ కీ బాత్ ద్వారా  తన మనో భావాలను పంచుకుంటూ, లాక్ డౌన్ కారణంగాప్రజలందరూ, ముఖ్యంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు విచారం వ్యక్తం చేశారు.   130 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న భారతదేశం వంటి దేశంలో కరోనా పై యుద్ధం చేయడానికి ఇంతకంటే వేరే అవకాశం లేదు.  జీవన్మరణ సమస్య వంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలనీ, ప్రపంచంలో ఏమి జరుగుతోందో గమనించాలనీ ఆయన తెలియజెప్పారు. 

 

ప్రధానమంత్రి ఒక సామెతను గుర్తుచేస్తూ - ఏవం ఏవం వికార: అపి తరుణా సాధ్యతే సుఖం అంటే వ్యాధులురోగాలను అవి ప్రబలకముందేవాటిని ప్రారంభంలోనే ఎదుర్కొవాలి.   దాన్ని తీర్చలేనప్పుడు, ఆ తర్వాత చికిత్స చాలా కష్టసాధ్యమౌతుంది." అని అన్నారు.   కరోనా వైరస్ ప్రపంచాన్ని ఖైదు చేసిందని ఆయన అన్నారు.   " జ్ఞానులను, శాస్త్రవేత్తలు, ధనవంతులు, పేద ప్రజలు, శక్తి వాంతులు, బలహీనులు అనే తేడా లేకుండా అందరికీ ఇది ఒక ఒక సవాలుగా ఉంది". అని ప్రధానమంత్రి అన్నారు.  " ఇది ఏ దేశాల సరిహద్దులకు గానీ, ఒక ప్రాంతం లేదా ఒక సీజన్ కు గానీ కట్టుబడి లేదు." అని చెప్పారు. 

 

ఈ వైరస్ మానవజాతిని సర్వ నాశనం చేయాలని ముందుకు సాగుతోందనీ, అందువల్ల, దానిని జయించాలనే సంకల్పంతో మానవ జాతి ఐక్యంగా పోరాడాలనీ,  ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. లాక్ డౌన్ ను పాటించడం ఇతరుల కోసం కాదనీ, ఇది ఎవరిని వారు కాపాడుకోవడం కోసమేననీ, ఆయన స్పష్టం చేశారు.  ప్రజలు తమనీ, తమ కుటుంబాన్నీ కాపాడుకోవడం కోసం, ముందు ముందు చాలా రోజులు లక్షణ రేఖకు కట్టుబడి ఉండాలని ఆయన ప్రజలను కోరారు. 

 

కొంతమంది ప్రజలు ప్రస్తుత పరిస్థి తీవ్రతను అర్ధం చేసుకోడానికి ప్రయత్నించకుండా, లాక్ డౌన్ ను అతిక్రమిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు.  లాక్ డౌన్ నియమాలకు కట్టుబడి ఉండాలనీ లేని పక్షంలో కరోనా వైరస్ కోరల నుండి మనలను మనం రక్షించుకోవడం కష్టమని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   మంచి ఆరోగ్యం, గొప్ప అదృష్టం అని చెబుతూ - " ఆరోగ్యం పరం భాగ్యం, స్వాస్థ్యం సర్వార్థ్ సాధనం"  అనే సామెతను ఆయన ఉటకించారు. ప్రపంచంలో ఆనందానికి ఏకైక మార్గం ఆరోగ్యం మాత్రమే నని ఆయన - నొక్కి చెప్పారు. 

 

***



(Release ID: 1609027) Visitor Counter : 180