నౌకారవాణా మంత్రిత్వ శాఖ

పోర్టులలో రవాణా సరుకు దిగుమతి, ఎగుమతులపై కంటైనర్ నిర్బంధ ఛార్జీలు విధించవద్దని షిప్పింగ్ లైన్స్ కి సూచన

Posted On: 29 MAR 2020 2:09PM by PIB Hyderabad

ఓడరేవులలో సరకు రవాణాకు సంబంధించి ఎగుమతులుదిగుమతులకు ఈ మర్చి 22వ తేదీ నుండి ఏప్రిల్ 11వ తేదీ వరకు (రెండు తేదీలు కూడా పరిగణలోకి తీసుకొని) షిప్పింగ్ లైన్స్ వారు  కంటైనర్ నిర్బంధ చార్జీలను వసూలు చేయవద్దని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సూచించింది.  ఉచిత సమయాలకు మించి చార్జీల వసూళ్లపై  ప్రస్తుతమున్న పరస్పర అంగీకార కాంట్రాక్టు నిబంధనలు సడలించాలని తెలిపింది. దేశంలోని సముద్ర తీర ప్రాంతాల ఓడరేవులలో సరకు రవాణాపంపిణీ ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా జారడానికి వీలుగా ఈ సూచనలు జారీ చేశారు.  ఈ కాలంలో షిప్పింగ్ లైన్లు కొత్తగా అదనంగా ఎటువంటి ఛార్జీలను విధించ వద్దని సూచించారు. కోవిడ్-19 వ్యాప్తి వల్ల ఎదురయ్యే సంకట పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్క కాలంలో మాత్రమే అమలు అయ్యేలా ఈ ఆదేశాలు జారీ చేశారు.   

మర్చి 25వ తేదీన లాక్ డౌన్ ప్రకటించాక ఓడరేవుల్లో సరకు ఎప్పటికప్పుడు ఖాళి చేయడానికి అవసరమైన సర్వీసులలో కొన్నిఇబ్బందులు తలెత్తాయి. దీని వల్ల కొందరు కార్గో యజమానులు పూర్తిగా తమ ఆపరేషన్లను ఆపివేయడం జరిగింది. మరికొందరు సరకువస్తువులను రవాణా చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. ఫలితంగా వారి తప్పు లేకుండానే కంటైనర్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.  ఇపుడు ఇచ్చిన ఈ సూచనాదేశాల వల్ల దేశ వ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు మెరుగుపడిసరఫరా పని విధి మరింత సులభతరం అవుతుందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వివరించింది.  

                                               ****



(Release ID: 1608996) Visitor Counter : 113