కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 పై పోరాటానికి ఒక నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్న కేంద్ర మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్
Posted On:
27 MAR 2020 1:22PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి( ఇంచార్జ్) శ్రీ సంతోష్ గంగ్వార్, కోవిడ్ -19 పై పోరాటానికి గాను ప్రధానమంత్రి సహాయ నిధికి తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ శ్రీ గంగ్వార్, కోవిడ్ -19 మహమ్మారి పై పోరాటానికి మనం ఏదో రకంగా సహాయపడుతున్నాం . ఇందుకు నా ఒక నెల జీతం ప్రధానమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించుకున్నాను - అని అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవడంలో, ప్రత్యేకించి సామాన్యప్రజలు, పేదలు, కార్మికులకు సహాయక చర్యలు తీసుకోవడంలో ముందుందని గంగ్వార్ అన్నారు.
(Release ID: 1608538)
Visitor Counter : 119
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam