మంత్రిమండలి

నేశనల్ కమిశన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ బిల్, 2019 లో ఆధికారిక సవరణల కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 29 JAN 2020 2:01PM by PIB Hyderabad

నేశనల్ కమిశన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ బిల్, 2019 (ఎన్ఐసిఎమ్)లో ఆధికారిక సవరణల ప్రతిపాదన కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగి న కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ప్ర‌స్తుతం ఈ బిల్లు రాజ్య స‌భ లో అనిర్ణీత స్థితి లో ఉంది.

 

ప్రతిపాదిత చట్టం భారతీయ వైద్య విద్య వ్యవస్థ రంగం లో నియంత్రణ సంబంధిత సంస్కరణల కు మార్గాన్ని సుగమం చేయనుంది.  ప్రతిపాదిత నియంత్రణ స్వరూపం సాధార‌ణ ప్ర‌జానీకం యొక్క హితాన్ని ప‌రిర‌క్షించ‌డం కోసం జ‌వాబుదారీ కి మ‌రియు పార‌ద‌ర్శ‌క‌త్వాని కి వీలు ను కల్పించగలదు.  ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ లు దేశం లోని అన్ని ప్రాంతాల లో త‌క్కువ ఖ‌ర్చు లో ల‌భ్యం కావ‌డాన్ని క‌మిశ‌న్ ప్రోత్స‌హించ‌నుంది. 

 

భారతీయ వైద్య వ్యవస్థ కు సంబంధించి విద్య ప్రమాణాలు, మూల్యాంకనం, విద్యాసంస్థల మదింపు మరియు గుర్తింపు తదితర విధులను ఒక క్రమ పద్ధతి లో పెట్టేందుకు కమిశన్ ను ఏర్పాటు చేయడమైంది. ఎన్ సిఐఎమ్ ను నెలకొల్పడం లోని ప్రధాన ధ్యేయం ప్రవీణులు అయిన వైద్య వృత్తినిపుణులను తగినంత సంఖ్య లో అందుబాటులో ఉంచేటట్టు చూడటమూ; తద్వారా ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ లో వైద్య సేవల పరం గా ఉన్నత నైతిక ప్రమాణాలు వేళ్లూనుకొనేటట్టు చేయటమూను.

 

***(Release ID: 1601062) Visitor Counter : 53