మంత్రిమండలి

ఫేనీ న‌ది లో నుండి 1.82 క్యూసెక్ జ‌లాల ను భార‌త‌దేశం తీసుకొనే అంశం పై బాంగ్లాదేశ్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య సంత‌కాలు అయినటువంటి ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 06 NOV 2019 8:39PM by PIB Hyderabad

భార‌త‌దేశం లోని త్రిపుర లో గ‌ల సబ్‌ రూమ్ ప‌ట్ట‌ణాని కి త్రాగునీటి ని స‌ర‌ఫ‌రా చేసే ప‌థ‌కం కోసం ఫేనీ న‌ది నుండి 1.82 క్యూసెక్  జ‌లాల ను భారతదేశం తీసుకొనే అంశం పై బాంగ్లాదేశ్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య కుదిరిన‌టువంటి అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద ప‌త్రాని కి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఎక్స్‌-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.

లాభాలు:

ఫేనీ న‌ది తాలూకు జ‌లాల ను పంచుకోవ‌డం పై ప్రస్తుతం బాంగ్లాదేశ్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య ఎటువంటి ఒప్పందం లేదు.  ప్ర‌స్తుతం సబ్‌ రూమ్ ప‌ట్ట‌ణాని కి సరఫరా అవుతున్న త్రాగునీరు అవ‌స‌రాల‌ కు స‌రిపడినంత గా ఉండ‌టం లేదు.  ఈ ప్రాంతం లోని భూగ‌ర్భ జ‌లం లో ఇనుము మోతాదు బాగా ఎక్కువ గా ఉంది.  ఈ ప‌థ‌కం అమ‌లు లోకి వస్తే  సబ్‌ రూమ్ ప‌ట్ట‌ణం లో నివ‌సిస్తున్నటువంటి 7000 మంది కి పైగా జ‌నాభా కు ప్రయోజనం చేకూరుతుంది.

***



(Release ID: 1590929) Visitor Counter : 85