మంత్రిమండలి
షిప్పింగ్ రంగంలో ఇండియా, మాల్దీవుల మద్య అవగాహనా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
సముద్ర మార్గం ద్వారా కేరళలోని కోచిని మాలే, మాల్దీవుల లోని కుల్‌హుధుఫుషిని కలుపుతూ కేరళ , మాల్దీవుల మధ్య ఫెర్రీ సర్వీసు నడిపేందుకు వీలుకల్పించే అవగాహనా ఒప్పందానికి ఆమోదం
Posted On:
03 JUL 2019 4:42PM by PIB Hyderabad
ఇండియా, మాల్దీవుల మధ్య సముద్ర మార్గంలో పాసింజర్, కార్గోసేవలు అందించేందుకు వీలుగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 జూన్ 8న మాల్దీవుల పర్యటన సందర్భంగా సంతకం చేసిన ఇండియా- మాల్దీవుల మధ్య అవగాహనా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా ఆమోదం తెలిపింది.
మాల్దీవుల అభివృద్ధిలో ఇండియా కీలక పాత్ర పోషిస్తున్నది. మాల్దీవులలో ఎన్నో ప్రముఖ సంస్థలను ఇండియా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇండియా 100 మిలియన్ అమెరికన్ డాలర్ల స్టాండ్ బై క్రెడిట్ (ఎస్.సి.ఎఫ్)ను మాల్దీవులకు అందించింది. వీటితోపాటు దీర్ఘకాలిక రుణాలు, వాణిజ్యరంగానికి రివాల్వింగ్ క్రెడిట్ వంటివి ఉన్నాయి.
మాల్దీవుల రాజధాని అయిన మాలే ఆ దేశంలో అత్యధిక జనాభాగల పట్టణం.అలాగే మాల్దీవులలో మూడో అతిపెద్ద పట్టణం కుల్‌హుధుఫుషి . వీటికి కోచి నుంచి పర్యాటకులు, సరకు రవాణాకోసం ఫెర్రి సర్వీసు నడపడానికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. కోచి నుంచి మాలే 708 కిలోమీటర్ల దూరంలో ఉండగా, కుల్‌హుధుఫుషి పట్టణం 509 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుల్‌హుధుఫుషి దీవులు, దాని చుట్టూ ఉన్నపలు దీవులు మాల్దీవులలోని ఉత్తర ప్రాంత ప్రధాన జనావాస కేంద్రాలుగా ఉన్నాయి. వీటిలో ఎన్నో రిసార్టులు ఉన్నాయి. ఇవి భారతీయ పర్యాటకులకు వెళ్లడానికి అవకాశం ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి.
ప్రస్తుతం మాలేకు విమాన సర్వీసులు, రిసార్టులకు సీ ప్లేన్‌లు ఉన్నా ఇవి అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. మరోవైపు సముద్రమార్గంలో కోచితో అనుసంధానం వల్ల భారత్‌కు పర్యాటకులు ప్రత్యేకించి ఆరోగ్య , వెల్‌నెస్ సంబంధిత పర్యాటకులు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. మాల్దీవులకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో, కేరళకు, ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విద్యావసరాల కోసం వచ్చే అవకాశం ఉంది.
ఇరుదేశాల మధ్య సముద్ర మార్గంలో సరకు రవాణాకు , ప్రయాణీకుల చేరవేతకు అద్భుత అవకాశాలను కల్పించే దిశగా మాల్దీవులతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంపై ఇప్పటికే సంతకం చేయడం జరిగింది. ప్రతిపాదిత ఫెర్రీ సర్వీసు ఇండియా, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించేందుకు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు పెంచేందుకు పెద్ద ఎత్తున ఉపకరించనుంది.
.
*****
(Release ID: 1577002)
Visitor Counter : 155
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada