మంత్రిమండలి

తూనిక‌లు కొల‌త‌ల విభాగం చ‌ట్టాల‌కు సంబంధించి ఇండియా కిర్గిస్థాన్ మ‌ధ్య‌న కుదిరిన అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.

Posted On: 12 JUN 2019 8:08PM by PIB Hyderabad

తూనిక‌లు కొల‌త‌ల విభాగం చ‌ట్టాల‌కు సంబంధించి ఇండియా కిర్గిస్థాన్ దేశాల‌ మ‌ధ్య‌న కుదిరిన అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. జూన్ 13నుంచి 14 వ‌ర‌కు నిర్వ‌హించే ఎస్ సివో నేప‌థ్యంలో ఈ ఎంవోయు కుదిరింది. 

ప్ర‌యోజ‌నాలు

1. తూనిక‌లు కొల‌త‌ల శాఖ చ‌ట్టాలకు సంబంధించిన స‌మాచారం, ప‌త్రాల‌ను ఇచ్చిపుచ్చుకోవ‌డం

2. ఈ రంగానికి సంబంధించి అధికారులు, అధికారేత‌రుల‌కోసం ఒక శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని రూపొందించ‌డం

3. తూనిక‌లు కొల‌త‌ల రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సంబంధించి ఆ రంగానికి చెందిన‌ అధికారులు, నిపుణుల సాయాన్నిఇరుదేశాలు తీసుకోవ‌డం

4. ఈ రంగంలో ఇరు దేశాల‌కు ఆమోద‌యోగ్యంగా వుండేలా నిర్వ‌హించే సెమినార్లు, వ‌ర్క్ షాపులు, స‌మావేశాలు, అటాచ్ మెంట్ లెర్నింగ్ కార్య‌క్ర‌మాల్లో ఇరుదేశాలు పాల్గొన‌డం. 

5. ముంద‌స్తు ప్యాకేజీ వ‌స్తువుల‌కోసంగాను అవ‌స‌ర‌మ‌య్యేవాటిని ఏర్పాటు చేసుకోవ‌డం జ‌రుగుతుంది. ముంద‌స్తు ప్యాకేజీ వ‌స్తువుల‌ను రాష్ట్రాల తూనిక‌లు, కొల‌త‌ల శాఖ ప‌ర్య‌వేక్ష‌ణలో నిర్వ‌హించ‌డం.

6. ముంద‌స్తు ప్యాకేజీ వ‌స్తువులకు సంబంధించిన నియ‌మ నిబంధ‌న‌లు ఏ స్థాయిలోవున్నాయో స‌మీక్ష చేయ‌డం.

7. ఉత్ప‌త్తిదారులు, వినియోగ‌దారుల‌కు మ‌ధ్య‌న కుదిరిన ప‌ర‌స్ప‌ర ఒప్పందాల్లో తూనిక‌లు, కొల‌త‌ల శాఖ నిర్వ‌హించిన ప‌ర్య‌వేక్ష‌ణ‌ అనుభ‌వాల‌ను ఇచ్చిపుచ్చుకోవ‌డం. 

***


(Release ID: 1574514) Visitor Counter : 154