సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యోగాభ్యాసం ‘‘నవ భారత’’ తారక మంత్రం: ప్రకాశ్ జావడేకర్
‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవ మీడియా సమ్మాన్’’ (AYDMS)ను
ఏర్పాటు చేసిన సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ; దీనిని అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రదానం చేయనున్నారు
Posted On:
08 JUN 2019 2:42PM by PIB Hyderabad
యోగాభ్యాసం తో, యోగా విస్తృతి తో ‘‘ఆరోగ్యకర జీవితం, స్వస్థ్య జీవనం, శ్రేయస్సు- వ్యాధుల నియంత్రణ’’ సాధ్యమైందని సమాచార- ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ అన్నారు. యోగా అన్నది ప్రపంచాని కి భారతదేశం అందించిన బహుమతి కాగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో నవ భారతాన అది తారకమంత్రం గా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఐక్య రాజ్య సమితి చొరవ తో యోగా నేడు విశ్వవ్యాప్తం అయిందని, ప్రపంచం లోని దాదాపు 200 దేశాలు ప్రతి సంవత్సరం లో జూన్ 21వ తేదీ నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని శ్రీ జావడేకర్ గుర్తు చేశారు.
దేశ విదేశాల లో యోగా కు విస్తృత ప్రాచుర్యాన్ని కల్పించడం లో ప్రసార మాధ్యమాలు సానుకూల పాత్ర ను పోషించడమే కాక ఎంతో బాధ్యత తో కృషి చేసినట్లు మంత్రి వివరించారు. ఈ నేపథ్యం లో యోగా సందేశాన్ని ప్రపంచం నలుమూలల కు చేరవేయడం లో ప్రసార మాధ్యమాలు పోషించిన భూమిక కు గుర్తింపు గా తొలి ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవ మీడియా సమ్మాన్’’ (AYDMS)ను ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ పురస్కారాన్ని దిగువ వివరించిన విభాగాలలో మీడియా సంస్థల కు ప్రదానం చేయనున్నారు:
• ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవ మీడియా సమ్మాన్’’ (AYDMS)ను ప్రచురణ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లోని (టెలివిజన్, రేడియో) మీడియా సంస్థల కు ప్రకటిస్తారు.
• మూడు విభాగాల కింద 33 సమ్మాన్ (పురస్కారం)లను ప్రదానం చేస్తారు.
• ‘‘వార్తా పత్రికల లో అత్యుత్తమ ప్రాచుర్యం’’ విభాగం కింద 22 భారతీయ భాషలతో పాటు ఆంగ్ల భాష కు సంబంధించి 11 పురస్కారాలు ఉంటాయి.
• ‘‘టెలివిజన్ లో అత్యుత్తమ ప్రాచుర్యం’’ విభాగం కింద 22 భారతీయ భాషలతో పాటు ఆంగ్ల భాష కు సంబంధించి 11 పురస్కారాలు ఉంటాయి. అలాగే..
• ‘‘రేడియో లో అత్యుత్తమ ప్రాచుర్యం’’ విభాగం కింద 22 భారతీయ భాషలతో పాటు ఆంగ్ల భాష కు సంబంధించి 11 పురస్కారాలు ఉంటాయి.
• ఈ పురస్కారం కింద ప్రత్యేక పతకం/ఫలకం/ట్రోఫీ తో పాటు ప్రశంస పత్రాన్ని అందజేస్తారు.
• ఈ పురస్కారం ప్రకటించేందుకు 2019 జూన్ 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆయా మాధ్యమాల లో ప్రచురితమైన/ప్రసారం చేసిన యోగా ప్రాచుర్య కార్యక్రమాలను పరిగణన లోకి తీసుకోనున్నారు.
• యోగా కు ఆయా సంస్థలు కల్పించే ప్రాచుర్యాన్ని 6 ప్రత్యేక కమిటీ లు మదింపు చేస్తాయి.
• ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవ మీడియా పురస్కారాని’’ (AYDMS)కి ఎంపికైన సంస్థల పేర్లను ప్రకటించడంతో పాటు ప్రదానానికి అనువైన తేదీ ని తరువాత నిర్ణయిస్తారు. (పురస్కార ప్రదానోత్సవాన్ని 2019 జులై లో నిర్వహించాలని తాత్కాలికం గా నిర్ణయించారు).
దీనికి సంబంధించి మంత్రి నిర్వహించిన విలేకరుల సమావేశం లో సమాచార- ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే తో పాటు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
**
(Release ID: 1573944)
Visitor Counter : 102
Read this release in:
Assamese
,
Malayalam
,
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali
,
Gujarati
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada