హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లోయలో లష్కర్‌ చివరి స్థానిక ఉగ్రవాది లతీఫ్ భట్‌ను మట్టుబెట్టిన జేకేపీ, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, నిఘా సంస్థల వీర జవాన్లను అభినందించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా

ముందురోజే కుల్గామ్‌లో హతుడైన భట్ ఉగ్రవాద సహచరుడు ఉమర్ నిసార్

అత్యున్నత స్థాయి సమన్వయంతో ఆపరేషన్

జేకేపీ, సైన్యం, సీఆర్పీఎఫ్, నిఘా సంస్థల వీర జవాన్లకు దేశం సెల్యూట్

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2026 6:38PM by PIB Hyderabad

కుల్గాంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఒక ఆపరేషన్‌లో లష్కర్‌కు చెందిన, లోయలో క్రియాశీలంగా ఉన్న చివరి స్థానిక ఉగ్రవాది లతీఫ్ భట్‌ను హతమార్చిన జమ్మూ కాశ్మీర్ పోలీసు, సైన్యం, సీఆర్‌పీఎఫ్, నిఘా సంస్థల వీర జవాన్లను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు: “ఈ రోజు తెల్లవారుజామున కుల్గాంలో జమ్మూ కాశ్మీర్ పోలీసు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్, నిఘా సంస్థలు సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్‌లో.. కాశ్మీర్ లోయలో క్రియాశీలంగా ఉన్న, లష్కర్‌కు చెందిన చివరి స్థానిక ఉగ్రవాది లతీఫ్ భట్‌ హతుడయ్యాడు. అతని ఉగ్రవాద సహచరుల్లో ఒకడైన ఉమర్ నిసార్ కూడా అంతకు ముందు రోజే కుల్గామ్‌లో హతమయ్యాడు. అత్యున్నత స్థాయి సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. జేకేపీ, సైన్యం, సీఆర్పీఎఫ్, నిఘా సంస్థల వీర జవాన్లకు దేశం సెల్యూట్ చేస్తోంది.”

ఈ రోజు తెల్లవారుజామున కుల్గాంలో జమ్మూ కాశ్మీర్ పోలీసు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్, నిఘా సంస్థలు సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్‌లో.. కాశ్మీర్ లోయలో క్రియాశీలంగా ఉన్న, లష్కర్‌కు చెందిన చివరి స్థానిక ఉగ్రవాది లతీఫ్ భట్‌ హతుడయ్యాడు. అతని ఉగ్రవాద సహచరుల్లో ఒకడైన ఉమర్ నిసార్ కూడా అంతకు ముందు రోజే కుల్గామ్‌లో హతమయ్యాడు. అత్యున్నత స్థాయి సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. జేకేపీ, సైన్యం, సీఆర్పీఎఫ్, నిఘా సంస్థల వీర జవాన్లకు దేశం సెల్యూట్ చేస్తోంది.

— Amit Shah (@AmitShah) 2026 నవంబరు 18.  


(రిలీజ్ ఐడి: 2338249) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam