నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2026 11:41PM by PIB Hyderabad
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు శ్రీ ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ ఆహ్వానంపై, 2026 నవంబర్ 16, 17వ తేదీలలో ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
ఈ పర్యటన కాలంలో, ఆసియాన్-భారత్ 23వ శిఖరాగ్ర సదస్సులోను, తూర్పు ఆసియా 21వ శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్) లోను ప్రధానమంత్రి పాలుపంచుకొంటారు. ఈ రెండు శిఖరాగ్ర సదస్సులను 2026వ సంవత్సరానికి ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఫిలిప్పీన్స్ ఈ నెల 17న నిర్వహించనుంది.
భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’లో, భారత్-పసిఫిక్ దార్శనికతలో భారత్-ఆసియాన్ సంబంధాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. భారతదేశం, ఆసియాన్ 2026వ సంవత్సరాన్ని ‘ఆసియాన్-భారత్ నౌకావాణిజ్య సహకార సంవత్సరం’గా పాటిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన చోటుచేసుకోనుంది. అంతేకాకుండా, 2027లో ఉభయ దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి అయిదు సంవత్సరాలు, రెండు దేశాల మధ్య చర్చలు మొదలైన ప్రక్రియకు 35 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి.
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అమలులో నమోదైన ప్రగతిని ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో సమీక్షించనున్నారు. దీనిలో భాగంగా, 202620-30 మధ్య కాలంలో ఆసియాన్-భారత్ కార్యాచరణ ప్రణాళికను కూడా సమీక్షిస్తారు. అంతేకాక, రాబోయే కాలంలో పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకుపోవలసిన తీరును నిర్ధారిస్తారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కల అంశాలపై అభిప్రాయాలను ఆసియాన్, తదితర భాగస్వామ్య దేశాలతో ప్రస్తావించేందుకు తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు ఒక అవకాశాన్ని ఇవ్వనుంది.
***