సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇఫి-2026 మీడియా అక్రిడేషన్ గడువును నవంబర్ 4, 2026 వరకు పొడిగించిన ఎంఐబీ


సినీ ప్రియులు నూతన సినీ ప్రపంచాన్ని అనుభూతి చెందేందుకు ప్రతినిధులుగా నమోదు చేసుకునే అవకాశం

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి)-2026 కోసం మీడియా అక్రిడేషన్ గడువును నవంబర్ 4, 2026 వరకు పొడిగించింది.

 

 

గోవాలోని పనాజీలో నవంబర్ 20 నుంచి 28, 2026 వరకు జరిగే ఈ చలన చిత్రోత్సవానికి మీడియా ప్రతినిధులు హాజరవుతారు. హాజరయ్యే మీడియా ప్రతినిధులు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) అక్రిడేషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

పొడిగించిన గడువులోపు కావాల్సిన డాక్యుమెంట్లను సమర్పించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా అర్హత గల మీడియా ప్రతినిధులకు ఎంఐబీ సూచించింది.

రిజిస్ట్రేషన్ లింక్: https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx

సందేహాలకు ఈ వెబ్‌సైట్ iffi.mediadesk@pib.gov.in. ను సందర్శించవచ్చు.

అక్రిడేషన్ ఉన్న మీడియా ప్రతినిధులకు చలన చిత్రోత్సవంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అవి:

·         చలనచిత్ర ప్రదర్శనలు

·         ప్యానెల్ చర్చలు

·         సినీ రూపకర్తలు, సినీరంగ నిపుణులతో చర్చలు

·         నెట్‌వర్కింగ్ అవకాశాలు

·         చలన చిత్రోత్సవానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు

 

గత ఎడిషన్ (56వ)లో ఇఫి కార్యక్రమానికి రిజిస్ట్రర్ చేసుకున్న మీడియా ప్రతినిధులు అదే వివరాలతో లాగిన్ అయి, డాక్యుమెంట్లను సమర్పించవచ్చు.

ఆసియాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చలన చిత్రోత్సవాల్లో మీ స్థానాన్ని ఖరారు చేసుకునేందుకు, సినిమా ప్రపంచాన్ని తీర్చిదిద్దుతున్న గొంతుకలతో అనుసంధానమయ్యేందుకు, తెరవెనుక కథలను తెలుసుకునేందుకు, ఇఫి చిత్రనిర్మాణం, సృజనాత్మకత, సంస్కృతుల ఉత్సాహభరిత వేడుకలో భాగం అయ్యేందుకు ముందుగానే దరఖాస్తు చేసుకోండి.

మీడియా ప్రతినిధులు కాకుండా సినీ ప్రియులు కూడా https://www.iffigoa.org/delegate-registration ద్వారా ప్రతినిధులుగా ఐఎఫ్‌ఎఫ్‌ఐ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 57వ ఇఫి-2026లో అందించే చిత్ర సంపదను, ఇతర కార్యకలాకాలను ఆస్వాదించవచ్చు.

ఇఫి గురించి

1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి) దక్షిణాసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుక. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ), భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, గోవా ప్రభుత్వ వినోద సొసైటీ (ఇఎస్‌జీ) సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఐఎఫ్‌ఎఫ్‌ఐ ప్రపంచం నలుమూలల నుంచి సినీ రూపకర్తలు, ప్రముఖులు, నూతన ప్రతిభావంతులను ఒకచోట చేర్చుతుంది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాసులు, నివాళులు, శక్తిమంతమైన గోవా నేపథ్యంలో విభిన్న కథలు, భాషలు, సినీ సంప్రదాయాలను ఈ చలన చిత్రోత్సవం వేడుకగా జరుపుకుంటుంది.

మరిన్ని వివరాలు, 57వ ఇఫి-2026కి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.iffigoa.org/ సంప్రదించండి.

 

***


(రిలీజ్ ఐడి: 2329468) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada