నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 6:38PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల హైజంప్ ఎఫ్53 విభాగంలో అసాధారణ ప్రతిభతో స్వర్ణ పతకం సాధించిన ప్రవీణ్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఈ క్రీడలలో మునుపటి తన రికార్డును బద్దలు కొట్టి, స్వర్ణ పతకం ఘనతను నిలబెట్టుకోవడం అద్భుతమని ఆయన అభివర్ణించారు.
ఈ క్రీడలలో అతడు తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించడం ముదావహమన్నారు. విశేష ప్రతిభతో తాజా పతకం సాధించడం అతని నిలకడ, నైపుణ్యం, మెరుగుదల కసం నిరంతర తపనను ప్రతిబింబించిందని పేర్కొన్నారు. దేశానికి మరోసారి గర్వకారణంగా నిలిచిన ప్రవీణ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్‌లో ప్రవీణ్ కుమార్ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు! పురుషుల హైజంప్ టీ64 విభాగంలో అద్భుత జంప్‌తో, మునుపటి ఈ క్రీడల్లో తన రికార్డును తానే బద్దలు కొట్టి, స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడం హర్షణీయం. అతని నిలకడ, క్రీడా ప్రతిభ, మెరుగుదల దిశగా అలుపెరుగని తపనకు ఈ విజయం ఒక ప్రతీక. మరోసారి దేశం గర్వించేలా చేసిన ప్రవీణ్‌కు హృదయపూర్వక అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.
***