సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇఫి 2026 మీడియా అక్రిడిటేషన్ గడువును అక్టోబర్ 17 వరకు పొడిగించిన సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 2:50PM by PIB Hyderabad

57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫి)-2026కు మీడియా అక్రిడిటేషన్‌ దరఖాస్తుల చివరి గడువును సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో అక్టోబర్‌ 17, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలోని పనాజీలో జరగనున్న ఈ చలనచిత్రోత్సవాన్ని కవర్‌ చేయాలనుకునే మీడియా ప్రతినిధులు పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) అధికారిక అక్రిడిటేషన్‌ వేదిక ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 

అర్హత కలిగిన మీడియా ప్రతినిధులు సవరించిన గడువులోగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.  

రిజిస్ట్రేషన్ లింక్: https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx 

మరిన్ని వివరాల కోసం దరఖాస్తుదారులు ఈమెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు: iffi.mediadesk@pib.gov.in 

 

ఇఫి గురించి 

1952లో ప్రారంభమైన అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫి) దక్షిణాసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద చలనచిత్ర వేడుకల్లో ఒకటి. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎణ్ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ సొసైటీ ఆఫ్‌ గోవా (ఈఎస్‌జీ) సంయుక్తంగా ఇఫిని నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దర్శకులు, సినీ దిగ్గజాలు, కొత్తగా ఎదుగుతున్న ప్రతిభావంతులను ఈ వేడుక ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మాస్టర్‌క్లాసులు, ప్రముఖులకు నివాళులతోపాటు విభిన్న కథలు, భాషలు, సినిమా సంప్రదాయాలను గోవా ప్రాంగణంలో ఈ చలనచిత్రోత్సవం  ఘనంగా నిర్వహించుకోనుంది. 57వ ఇఫి 2026కి సంబంధించిన మరింత సమాచారం, తాజా వివరాల కోసం https://www.iffigoa.org/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

 

***


(రిలీజ్ ఐడి: 2323865) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Punjabi , Gujarati , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil , Kannada