హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జమ్మూ కాశ్మీర్ లో నిఘా సమాచారం ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్‌లో లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ మూసా అలియాస్ ఆసిఫ్ ఫౌజీని హతమార్చిన భారత భద్రతా దళాలు

చాలా కాలంగా మూసా కోసం గాలిస్తున్న భద్రతా దళాలు

అన్ని భద్రతా విభాగాల సమన్వయంతో ప్రత్యేక ప్రణాళికతో మూసా హతం

భారత భద్రతా దళాలు మూసాను మట్టుబెట్టడంతో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఎల్ఓటి వ్యవస్థకు గట్టి ఎదురుదెబ్బ

మూసా హతంతో 2022 నుంచి జమ్మూ కాశ్మీర్‌లో చురుగ్గా ఉంటూ పలు సంచలనాత్మక దాడులకు పాల్పడిన నలుగురు సీనియర్ ఎల్ఓటి కమాండర్ల బృందం అంతం

బృందంలోని మిగిలిన ముగ్గురు సభ్యులు - జునైద్ భట్, సులేమాన్, యాసిర్‌లను వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమార్చిన భద్రతాదళాలు

మూసాను మట్టుబెట్టేందుకు జరిపిన ప్రస్తుత ఎదురుకాల్పులు మే 2026లోనే ‘ఆపరేషన్ షెరువాలీ‘ పేరుతో ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 4:09PM by PIB Hyderabad

నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం ఆధారంగా  సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ మూసా అలియాస్ ఆసిఫ్ ఫౌజీని జమ్మూ-కశ్మీర్‌లోని బద్గామ్ జిల్లాలో  ఖాన్‌సాహిబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్వత్కలాన్ వద్ద భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  మూసా కోసం భద్రతా దళాలు చాలాకాలంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇటీవల అతని కదలికలు, ఉనికికి సంబంధించి సాంకేతిక,  మానవ నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో, అతడిని మట్టుబెట్టేందుకు సంబంధిత అన్ని భద్రతా విభాగాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

భద్రతా దళాల చేతిలో మూసా హతం కావడంతో జమ్మూ-కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. మూసా హతంతో, 2022 నుంచి జమ్మూ-కశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, పలు సంచలనాత్మక దాడులకు బాధ్యులైన లష్కరే తోయిబాకు చెందిన నలుగురు సీనియర్ కమాండర్ల మొత్తం బృందం పూర్తిగా అంతమైంది. ఈ కమాండర్లు వీరు హాలన్ దాడి (ఆగస్టు 2023), డికెజి దాడి (డిసెంబర్ 2023), కండి దాడి (మే 2023), షాసితార్ దాడి (మే 2024), శివ ఖోరీ దాడి (జూన్ 2024), గగన్‌గిర్ దాడి (అక్టోబర్ 2024), బూటాపాథ్రీ దాడి (అక్టోబర్ 2024), బైసారన్ దాడి (ఏప్రిల్ 2025) వంటి సంచలనాత్మక దాడులకు బాధ్యులు. ఈ బృందంలోని మిగిలిన ముగ్గురు సభ్యులను భద్రతా దళాలు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టాయి. జునైద్ భట్‌ను 2024 డిసెంబరు 3న దాచిగామ్‌లో, సులేమాన్‌ను 2025 జూలై 28న ‘ఆపరేషన్ మహాదేవ్’లో, యాసిర్‌ను 2026 సెప్టెంబరు 4న ‘ఆపరేషన్ అస్ధర్’లో మట్టుబెట్టారు. మూసాను మట్టుబెట్టేందుకు ప్రస్తుతం నిర్వహించిన ఎన్‌కౌంటర్‌ కూడా దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆపరేషన్‌లో భాగమే.

గత కొన్ని సంవత్సరాలుగా జమ్మూ-కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, కేంద్ర సాయుధ పోలీసు దళాలు  వంటి అన్ని భద్రతా సంస్థలు పరస్పర సమన్వయంతో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ సమన్వయంతో చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలను అందిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2317101) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam