ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
బీహార్‌లోని ఎన్‌హెచ్–22లో ముజఫర్‌పూర్–సీతామర్హి–సోన్‌బర్సా విభాగాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) విధానంలో 4 లేన్లకు మెరుగుపరిచేందుకు ఆమోదం తెలిపిన క్యాబినెట్: మొత్తం వ్యయ అంచనా రూ.3590.73 కోట్లు
నాడు పోస్టు చేయడమైనది:
19 AUG 2026 3:22PM by PIB Hyderabad
బీహార్‌లోని ఎన్‌హెచ్–22పై ఉన్న ముజఫర్‌పూర్–సీతామర్హి–సోన్‌బర్సా విభాగాన్ని నాలుగు లేన్లకు అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహరాల క్యాబినెట్ కమిటీ ఈ రోజు ఆమోదం తెలిపింది. మొత్తం 82.578 కి.మీ. పొడవున్న ఈ ప్రాజెక్టును రూ.3590.73 కోట్ల మూలధన వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) పద్ధతిలో అభివృద్ధి చేస్తారు.
బీహార్‌లో విస్తరిస్తున్న జాతీయ రహదారి వ్యవస్థతో అనుసంధానించే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు గణనీయమైన వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యం ఉంది. ఇది సోన్‌బర్సా వద్ద ఉన్న భారత్-నేపాల్ సరిహద్దును ఎన్‌హెచ్-27 (తూర్పు-పశ్చిమ కారిడార్) వద్ద ఉన్న ముజఫర్‌పూర్ లాంటి ఆర్థిక కేంద్రాలతో కలిపే ప్రధాన ఫీడర్ కారిడార్‌గా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు ముజఫర్‌పూర్, ముక్సుద్‌పూర్, రున్ని సైద్‌పూర్, తుమ్మా, డుమ్రా, భూతాహి, సోన్‌బర్సా లాంటి జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది.
ప్రయాణికులను, సరకులను వేగంగా, సురక్షితంగా రవాణా చేయడానికి, ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని భావిస్తున్నారు. వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేలా రోడ్డు మీడియన్‌లో ఎలాంటి ఖాళీలు లేకుండా దీన్ని రూపొందించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా రూపొందించిన ఈ మార్గంలో సగటున గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్రణాళిక సూత్రాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. పారిశ్రామిక ప్రాంతాలు, ప్రధాన రైల్వే స్టేషన్లతో సహా ముఖ్యమైన ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా మల్టీమోడల్ అనుసంధానాన్ని ఈ ప్రాజెక్టు పెంపొందిస్తుంది. మెరుగైన అనుసంధానం... వస్తు, వ్యవసాయ సరఫరా వ్యవస్థల్లో సమర్థవంతమైన రవాణాను సులభతరం చేస్తుంది. ప్రాంతీయాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే బుద్ధ సర్క్యూట్, సీతామర్హిలోని చరిత్రాత్మక జానకి పునౌరా ధామ్ ఆలయం లాంటి సాంస్కృతిక, మతపరమైన గమ్యస్థానాలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.
ఎన్‌హెచ్–22లోని ముజఫర్‌పూర్–సీతామర్హి–సోన్‌బర్సా విభాగానికి వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యం ఉంది. ఇది జాతీయ సరకు రవాణా గ్రిడ్‌తో నిరంతరాయమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ఉన్న ఎన్‌హెచ్–31, ఎన్‌హెచ్–122లతో కలసి బరౌనీ లాంటి పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. గంగానది తీరం వెంబడి ఉన్న సరకు రవాణా కేంద్రాలకు మెరుగైన అనుసంధానాన్ని అందిస్తుంది. అలాగే సమీపంలోని భిథామోర్ ల్యాండ్ పోర్ట్ ద్వారా సరిహద్దుల గుండా ప్రయాణికులు, సరకు రవాణాను కూడా మరింత సులభతరం చేస్తుంది.
వీటికి అదనంగా ట్రాఫిక్ రాకపోకలను నిర్వహించడానికి, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి గాను ఈ ప్రాజెక్టులో ఏడు ప్రధాన వంతెనలు (భాగమతి నదిపై 340 మీ. పొడవైన ప్రధాన బ్రిడ్జితో సహా), మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్‌వోబీలు), రెండు ఫ్లైఓవర్లు (1170మీ, 270 మీ) నిర్మాణానికి కేటాయింపులున్నాయి.
ఈ ప్రాజెక్ట్ సగటు ప్రయాణ వేగాన్ని పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. రహదారి భద్రత, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాహన నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. తద్వారా ప్రాంతీయంగా రవాణాను, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని పెంపొందిస్తుంది.
బీహార్ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలకు ఎలాంటి ఆటంకాలు లేని అనుసంధానాన్ని ఈ ప్రాజెక్టు అందిస్తుంది. అదనంగా, అయిదు పీఎం గతి శక్తి ఆర్థిక కేంద్రాలకు (నాలుగు పారిశ్రామిక ఎస్టేట్లు, ఒక మెగా ఫుడ్ పార్కు), నాలుగు సామాజిక కేంద్రాలకు (బాబా గర్బినాథ్ ఆలయం, మాతా జానకి ఆలయం, పనౌరా ధామ్‌తో పాటు ముజఫర్‌పూర్, సీతామర్హి ఆకాంక్షాత్మక జిల్లాలు), రెండు రవాణా కేంద్రాలకు (ముజఫర్‌పూర్, సీతామర్హి రైల్వే స్టేషన్లు) రవాణా సదుపాయాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా ఈ ప్రాంతం అంతటా సరకు, ప్రయాణికుల వేగవంతమైన రవాణాకు వీలు కల్పిస్తుంది.


***
(రిలీజ్ ఐడి: 2316860)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam