సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ముగిసిన నిరీక్షణ: సెప్టెంబర్ 22న భారత సినీ రంగ అత్యుత్తమ అవార్డుల వేడుక 72వ జాతీయ చలన చిత్రోత్సవం
ఢిల్లీ నుంచి ఏక్తానగర్ వరకు: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక రాష్ట్రాలవ్యాప్తంగా నూతన ప్రయాణానికి శ్రీకారం
భారత చలనచిత్ర రంగానికి విశేష కృషి చేసినందుకు 2024 సంవత్సరానికిగానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్న అనంత్ నాగ్
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి వరకు… ప్రత్యేక ఆకర్షణగా అత్యుత్తమ చలనచిత్ర విజయాలు
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 3:10PM by PIB Hyderabad
వేదిక సిద్ధమైంది. లైట్లు ఏర్పాటయ్యాయి. ఇక భారత సినీ రంగ ప్రతిభావంతులపై స్పాట్‌లైట్ ప్రసరించనుంది. సెప్టెంబర్ 22, 2026న గుజరాత్‌లోని కేవడియా, ఏక్తానగర్‌లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 2024 సంవత్సరానికిగానూ భారత సినీ రంగంలో సాధించిన విశేష విజయాలను గుర్తిస్తూ భారత రాష్ట్రపతి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రదానం చేస్తారు.
భారత సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఒకటి. 1954లో ప్రారంభించిన ఈ అవార్డులు… వివిధ భాషలు, ప్రాంతాలు, సినీ నిర్మాణ శైలిని కవర్ చేస్తూ ఫీచర్ ఫిల్మ్స్, నాన్ ఫీచర్ ఫిల్మ్స్, సినీ రచనలు వంటి విభాగాల్లో ప్రతిభను గుర్తిస్తాయి.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
భారత సినీ రంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా 2024 సంవత్సరానికిగానూ ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు. సెప్టెంబర్ 22, 2026న జరిగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని ఆయనకు భారత రాష్ట్రపతి అందజేస్తారు.
ఐదు దశాబ్దాలకుపైగా సాగిన అనంత్ నాగ్ సినీ ప్రస్థానంలో వైవిధ్యభరితమైన చిత్రాల ద్వారా కన్నడ, భారత సినీ రంగంపై చెరగని ముద్ర వేశారు.
విశేషమైన కళా ప్రయాణాన్ని, భారత చలనచిత్ర సుసంపన్నమైన వారసత్వానికి ఆయన అందించిన శాశ్వత సేవలను ఈ పురస్కారం గుర్తిస్తుంది.
భారత సినీ పరిశ్రమలోని ఉత్తమ చిత్రాల వేడుక
దేశవ్యాప్తంగా అత్యుత్తమ చిత్రాలు, నటన, సృజనాత్మక ప్రతిభను 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఒకే వేదికపైకి చేర్చుతాయి.
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా 'ఆర్టికల్ 370’ ఎంపిక కాగా, ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్‌గా 'భంగార్', 'రామ్-నామి' ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికయ్యాయి.
నటనా విభాగాల్లో భ్రమయుగం చిత్రానికి గానూ మమ్ముట్టి, చందూ ఛాంపియన్ చిత్రానికి గానూ కార్తిక్ ఆర్యన్ ఉత్తమ ప్రధాన నటుడిగా ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 చిత్రానికిగానూ యామీ గౌతమ్ ఉత్తమ ప్రధాన నటి అవార్డును అందుకుంటారు.
స్వాతంత్ర్య వీర్ సావార్కర్ చిత్రానికిగానూ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా రణ్‌దీప్ హుడా అవార్డును గెలుచుకున్నారు.
భారత సినీ పరిశ్రమ వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని ప్రతిబింబించేలా వివిధ విభాగాల్లో మరిన్ని చిత్రాలు, కళాకారులను ఈ కార్యక్రమంలో సత్కరిస్తారు.
కల్కీ 2898 ఏడీ, అమరన్, పుష్ప: ది రూల్ పార్ట్-02, భూల్ భులయ్యా 3, స్త్రీ-2 వంటి చిత్రాలు వివిధ విభాగాల్లో పురస్కారాలను అందుకోనున్నాయి.
అవార్డు విజేతలు, జ్యూరీ జాబితాను ఇక్కడ చూడవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2313039)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam