ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యూజడ్‌క్యూఆర్ ద్వారా ఉజ్బెకిస్థాన్‌ వ్యాప్తంగా యూపీఐ చెల్లింపులను ప్రారంభించడానికి ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్, ఉజ్బెకిస్థాన్ ఎన్ఐ‌పీసీ మధ్య భాగస్వామ్యం


ఉజ్బెకిస్థాన్ జాతీయ ఇంటరాపరబుల్ క్యూఆర్ ‌కోడ్‌ యూజడ్‌క్యూఆర్‌ను స్కాన్ చేయడం ద్వారా భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులకు తక్షణం చెల్లింపులు

అంతర్జాతీయంగా విస్తరిస్తున్న యూపీఐలో ముందడుగును సూచిస్తున్న ఎన్ఐపీఎల్, ఉజ్బెకిస్థాన్ చెల్లింపుల వ్యవస్థ మధ్య భాగస్వామ్యం

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 4:14PM by PIB Hyderabad

ఉజ్బెకిస్థాన్ జాతీయ చెల్లింపుల వ్యవస్థ అయిన హెచ్‌యూఎంవో ఆపరేటర్ అయిన నేషనల్ ఇంటర్‌బ్యాంక్ ప్రాసెసింగ్ సెంటర్ జేఎస్‌సీ (ఎన్ఐ‌పీసీ)తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఅంతర్జాతీయ విభాగమైన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) 2026 ఆగస్టు 30న ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందిఈ భాగస్వామ్యం ద్వారా భారతీయ ప్రయాణికులు యూపీఐ ఆధారిత అప్లికేషన్లను ఉపయోగించి ఉజ్బెకిస్థాన్ జాతీయ ఇంటర్‌ఆపరేబుల్ క్యూఆర్ కోడ్ యూజడ్‌క్యూఆర్‌ను స్కాన్ చేసి ఆ దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులకు తక్షణమే చెల్లింపులు చేయవచ్చు.

ఉజ్బెకిస్థాన్‌లో భారత ప్రధానమంత్రి ద్వైపాక్షిక పర్యటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడిందిభారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ), ఉజ్బెకిస్థాన్ సెంట్రల్ బ్యాంకు (సీబీయూ)తో సహా ఆర్థిక నియంత్రణ సంస్థల నుంచి అధికారిక అనుమతులు పొందిన అనంతరం ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిందిఈ సంస్థలు సరిహద్దులకు అతీతంగా వ్యాపార ఆమోదానికి ఎన్‌ఐపీఎల్ అధీకృత భాగస్వామిగా హెచ్‌యూఎంవోను నియమించాయి.

ఒప్పందంలోని ముఖ్యాంశాలు

  1. సార్వత్రిక వర్తక ఆమోదం: సీబీయూ నిర్దేశించిన ఏకీకృత జాతీయ క్యూఆర్ మౌలిక సదుపాయాలతో (యూజడ్‌క్యూఆర్అనుసంధానించడం ద్వారా ఉజ్బెకిస్థాన్‌లోని రీటైల్ఆతిథ్యసేవా వర్తకుల సార్వత్రిక ఆమోదాన్ని యూపీఐ వినియోగదారులు పొందుతారు.

  2. ఆటంకాలు లేని ప్రయాణ అనుభవం: భారతీయ పర్యాటకులువ్యాపారవేత్తలువిద్యార్థులు తమ భారతీయ బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా పర్సన్–టు–మర్చంట్ (పీ2ఎంచెల్లింపులను చేయవచ్చుతద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని మార్చుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తుందిఅలాగే అంతర్జాతీయ కార్డులుద్రవ్యంపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.

  3. బలోపేతమైన ద్వైపాక్షిక సంబంధాలు: డిజిటల్ మౌలిక వసతుల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళుతుందిరెండు దేశాల విస్తృతమైన వ్యూహాత్మకఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ సహకారం ఉంటుంది.

పది దేశాల్లో యూపీఐకి ఆమోదం

సింగపూర్యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ఫ్రాన్స్మారిషస్నేపాల్భూటాన్ఖతార్శ్రీలంకకాంబోడియాగ్రీస్ దేశాల్లో భారతీయ పర్యాటకులు యూపీఐ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు చేస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2305132) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Tamil