సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎఫ్ఐపీ అత్యుత్తమ పుస్తక ప్రచురణ పురస్కారాలు- 2026లో ఏడింటిని సొంతం చేసుకున్న ప్రచురణల విభాగం


‘భారత్- 2026’కు ద్వితీయ బహుమతి, మూడో స్థానంలో ‘ధర్తీ కీ సేహత్’

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 1:59PM by PIB Hyderabad

పుస్తక ప్రచురణలో అత్యుత్తమ సేవలకుగాను భారతీయ ప్రచురణకర్తల సమాఖ్య (ఎఫ్ఐపీ) అందించిన.. ‘పుస్తక ప్రచురణలో అత్యుత్తమ ప్రదర్శనా పురస్కారాలు - 2026’లో ఏడింటిని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రచురణల విభాగం ఈ ఏడాది సొంతం చేసుకుంది. ఈ విభాగం ప్రచురించిన హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లోని పత్రికలు, పుస్తకాలు, రిఫరెన్సు ప్రచురణలకు పలు విభాగాల్లో ఈ అవార్డులు లభించాయి.

పురస్కారాలను గెలుచుకున్న గ్రంథాలు, పత్రికల సంపాదకులను ప్రచురణల విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధీరజ్ కకాడియా సన్మానించారు. ఈ విజయంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

image.jpeg

ఈ సందర్భంగా డాక్టర్ ధీరజ్ కకాడియా మాట్లాడుతూ.. ‘‘ప్రచురణల విభాగం గెలుచుకున్న ఈ ఏడు పురస్కారాలు.. సంబంధిత అధికారులు, సిబ్బంది సమష్టి కృషిఅంకితభావం, అత్యుత్తమ పనితీరుకు నిదర్శనం. మరింత నాణ్యమైనవిశ్వసనీయమైన, ఉపయోగకరమైన కంటెంటును ప్రచురించేలా ఈ గుర్తింపు మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. విజ్ఞానంసాహిత్యంసంస్కృతి, దేశ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన భావనలూ, ఆలోచనా దృక్పథాలనూ ప్రతిబింబించేలా.. హిందీఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో అత్యుత్తమ పుస్తకాలు, పత్రికలను పాఠకులకు అందించడానికి ప్రచురణల విభాగం కట్టుబడి ఉంది’’ అన్నారు.

దేశ అభివృద్ధి, విజ్ఞానం, సాహిత్యం, సంస్కృతి, కళలు, సమకాలీన అంశాలకు సంబంధించి వైవిధ్యభరితమైన, విలువైన సమాచారాన్ని పాఠకులకు అందించడంలో.. ప్రచురణల విభాగం పుస్తకాలు, పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు.

మొత్తం ఏడు పురస్కారాలను గెలుచుకోగా.. అందులో నాలుగు ద్వితీయ బహుమతులు, మూడు తృతీయ బహుమతులు ఉన్నాయి. ప్రచురణ, సంపాదకీయ నాణ్యత, కంటెంటులో వైవిధ్యం... ఇలా అన్ని అంశాల్లో అత్యుత్తమ ప్రదర్శనకు ప్రచురణల విభాగం ఎల్లవేళలా కట్టుబడి ఉందని ఈ విజయం ద్వారా స్పష్టమవుతోంది.

ద్వితీయ బహుమతి పొందిన ప్రచురణలు

  • భారత్ 2026 (హిందీ) – హిందీ రిఫరెన్సు పుస్తకాల విభాగంలో ద్వితీయ బహుమతిని గెలుచుకుంది.
  • వింగ్స్ టు అవర్ హోప్స్ (రెండో సంపుటం) – సాధారణ, వాణిజ్యపరమైన ఇంగ్లిషు పుస్తకాల విభాగంలో ద్వితీయ బహుమతిని గెలుచుకుంది.
  • యోజన – 2026 జూలై (హిందీ) – వికసిత భారత్ @2047’ ఇతివృత్తంతో ప్రచురితమైన ఈ సంచిక.. హిందీ పత్రికలు - సంస్థాగత పత్రికల విభాగంలో ద్వితీయ బహుమతిని గెలుచుకుంది.
  • కురుక్షేత్ర – గ్రామీణాభివృద్ధి మాసపత్రిక (1952 నుంచి వెలువడుతోంది) – ఇంగ్లిషు పత్రికలు, సంస్థాగత పత్రికల విభాగంలో ద్వితీయ బహుమతిని గెలుచుంది.

తృతీయ బహుమతి పొందిన ప్రచురణలు

  • ధర్తీ కీ సేహత్ – బాలల హిందీ పుస్తకాల (సాధారణ) (0- 10 సం.) విభాగంలో తృతీయ బహుమతిని గెలుచుకుంది.
  • రంగోళీ రూప్ సుర్ లే కి – కళలు - కాఫీ టేబుల్ హిందీ పుస్తక విభాగంలో మూడో బహుమతిని గెలుచుకుంది.
  • ఆజ్‌కల్ ఉర్దూ– 2026 జూలై సంచిక.. భారతీయ భాషల్లోని (ఉర్దూ) పత్రికలు - సంస్థాగత పత్రికల విభాగంలో తృతీయ బహుమతిని గెలుచుకుంది.

విశ్వసనీయ, విజ్ఞానదాయక, సాంస్కృతిక సుసంపన్నమైన కంటెంటును ప్రచురించి, ప్రజలకు చేరవేయడంలో ప్రచురణల విభాగం పాత్రను.. ఈ అవార్డులు మరింత బలోపేతం చేస్తున్నాయి. ప్రామాణికమైన, ప్రజోపయోగకరమైన సమాచారంతో అత్యుత్తమ పుస్తకాలు, పత్రికలు, రిఫరెన్సు ప్రచురణలను ఎప్పటికప్పుడు పాఠకులకు అందించేలా.. ప్రచురణల విభాగానికి ఈ పురస్కారాలు ప్రోత్సాహాన్నిస్తాయి.

image.jpeg

హిందీ రిఫరెన్సు పుస్తకాల విభాగంలో ద్వితీయ బహుమతి గెలచుకుకున్న భారత్ - 2026 (హిందీ)

image.jpeg

ఇంగ్లిషు సాధారణ, వాణిజ్య పుస్తకాల విభాగంలో ద్వితీయ బహుమతిని గెలుచుకున్న వింగ్స్ టు అవర్ హోప్స్ (రెండో సంపుటం)

image.jpeg

‘వికసిత భారత్@2047’ ప్రధాన కథనంగా వెలువడి.. హిందీ పత్రికలు - సంస్థాగత పత్రికల విభాగంలో ద్వితీయ బహుమతిని గెలుచుకున్న యోజన (హిందీ) – 2026 జూలై సంచిక

image.jpeg

ఇంగ్లిషు పత్రికలు – సంస్థాగత పత్రికల విభాగంలో ద్వితీయ బహుమతిని గెలుచుకున్న కురుక్షేత్ర – గ్రామీణాభివృద్ధి మాసపత్రిక (1952 నుంచి)

image.jpeg

బాలల హిందీ పుస్తకాల (సాధారణ) (0-10 సం.) విభాగంలో తృతీయ బహుమతిని గెలుచుకున్న ధర్తీ కీ సేహత్

image.jpeg

కళలు, కాఫీటేబుల్ పుస్తకాల (హిందీ) విభాగంలో మూడో బహుమతిని గెలుచుకున్న రంగోళీ రూప్ సుర్ లే కీ

image.jpeg

పత్రికలు - సంస్థాగత పత్రికల (భారతీయ భాషలు - ఉర్దూ) విభాగంలో తృతీయ బహుమతిని గెలుచుకున్న ఆజ్‌కల్ (ఉర్దూ)– 2026 జూలై సంచిక

 

భారతీయ ప్రచురణకర్తల సమాఖ్య (ఎఫ్ఐపీ) గురించి

ఇంగ్లిష్, హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లోని ప్రచురణకర్తల ప్రాతినిధ్య సంస్థ భారతీయ ప్రచురణకర్తల సమాఖ్య. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన ప్రచురణ సంస్థలకు ఇందులో సభ్యత్వముంది. ప్రచురణ రంగంలో 80 శాతానికి పైగా ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలన్నింటికీ ఇందులో సభ్యత్వముంది. ఇతర ప్రచురణ సంస్థలకు.. వివిధ స్థానిక సంఘాల ద్వారా ఈ సమాఖ్యలో ప్రాతినిధ్యముంది. 

 

(రిలీజ్ ఐడి: 2303111) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam