మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉన్నత విద్య సంస్థలు, పాలిటెక్నిక్ సంస్థలకు చెందిన 21 మంది టీచర్లు/బోధన సిబ్బందికి జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

प्रविष्टि तिथि: 24 AUG 2026 3:49PM by PIB Hyderabad

ఉన్నత విద్య సంస్థలు (హెచ్ఈఐ), పాలిటెక్నిక్‌లకు చెందిన ఉపాధ్యాయులు/బోధన సిబ్బంది కలిపి మొత్తం 21 మంది మందికి జాతీయ ఉపాధ్యాయ అవార్డు (ఎన్ఏటీ)లను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2026 సెప్టెంబరు 5న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రదానం చేస్తారు.
ఈ సంవత్సరం పురస్కారాలకు ఎంపిక చేసిన వారిలో.. కేంద్రీయ ఉన్నత విద్య సంస్థ (హెచ్ఈఐ)లకు చెందిన 12 మంది టీచర్లు/బోధన సిబ్బంది, రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు చెందిన వారు అయిదుగురు (వీరిలో 3 ప్రభుత్వ కళాశాలలకు చెందిన వారు, 2 ప్రయివేటు కళాశాలలకు చెందిన వారు )ఉన్నారు. అలాగే, పాలిటెక్నిక్ సంస్థలకు చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో 2 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, 2 ప్రయివేటు పాలిటెక్నిక్‌లకు చెందిన వారు ఉన్నారు.
2026 సంవత్సర జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు నామినేషన్లను రాష్ట్రీయ పురస్కార్ వెబ్‌సైట్  @www.awards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఆహ్వానించారు. వీరిలో ‘ప్రజా భాగస్వామ్యం’లో భాగంగా స్వీయ నామినేషన్, సంస్థాగత నామినేషన్‌, తోటి ఉద్యోగి నామినేషన్‌లకు వెసులుబాటును కల్పించారు. నామినేషన్లను 2026 మే 26 మొదలు జులై 20 వరకు దాఖలు చేయాల్సిందిగా సూచించారు.
ఈ పురస్కారాల్ని మార్గదర్శక ఉపాధ్యాయులు/ఫ్యాకల్టీ సభ్యులకు ప్రదానం చేస్తారు. వారు కనబరిచే ప్రభావవంతమైన పనితీరు ఆధారంగా ఎంపిక ఉంటుంది. వారి పనితీరులో.. బోధన, విషయాలను ఎంత చక్కగా నేర్పించారు, నిర్వహించిన అవుట్‌రీచ్ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, వీటితో పాటు ప్రాయోజిత రిసర్చ్/ఫ్యాకల్టీ పురోగతికి సంబంధిత కార్యక్రమాలు/కన్సల్టెన్సీ టీచింగ్ సహా వివిధ ప్రమాణాలను పరిగణన లోకి తీసుకున్నారు.  
ఎంపిక ప్రక్రియలో రెండు దశలను అనుసరించారు:
 (i) నామినేట్ అయిన వ్యక్తుల ప్రాథమిక పట్టికను తయారు చేసేందుకు ప్రాథమిక అన్వేషణ, స్క్రీనింగ్ కమిటీ ద్వారా మూల్యాంకనం ఒకటో దశ. 
(ii) జ్యూరీ కమిటీ తొలుత తాత్కాలికంగా ఎంపిక చేసిన వారిలో నుంచి పురస్కార విజేతలను ఎంపిక చేయడం రెండో దశ.
జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలలో భాగంగా ఉన్నత విద్య సంస్థలు, పాలిటెక్నిక్ సంస్థలకు రెండు కేటగిరీలలో పురస్కారాలను ఇవ్వడం మొదలుపెట్టాలని 2023లో నిర్ణయించారు. అప్పటి వరకు, ఈ అవార్డులను పాఠశాల ఉపాధ్యాయులకు మాత్రమే ఇస్తూ ఉండే వారు. ‘2020 జాతీయ విద్య విధానం’ దృష్టికోణానికి అనుగుణంగా పురస్కారాల పరిధిని విస్తరించారు. దీనిలో విద్య విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)లో ప్రావీణ్య సాధన సంస్కృతిని ప్రోత్సహించేవారికి పురస్కారాలు, గౌరవ పూర్వక గుర్తింపు వంటి ప్రోత్సాహకాలను తప్పనిసరిగా ఇవ్వాలని ప్రతిపాదించారు.

పురస్కారాల విజేతల జాబితాను ఈ కింద చూడవచ్చు. 

‘2026 జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు’ - ఉన్నత విద్య విభాగం

 

Sl. No

Name

Institution

Discipline

Gender

1.

Prof. Avlokita Agrawal

IIT Roorkee, Uttarakhand

Sustainable Architecture and Built Environment

Female

2.

Prof. Kirti Chandra Sahu

IIT Hyderabad, Telangana

Chemical Engineering

Male

3.

Prof. Vinay Chamola,

 

BITS Pilani, Rajasthan

Electricals & Electronics Engineering

Male

4.

Dr. Srikant Gollapudi

IIT Bhubaneswar, Odisha

Metallurgy & Materials Science

Male

5.

Dr. Mithun Radhakrishna

IIT Gandhinagar, Gujarat

 

Chemical Engineering

Male

6.

Prof. Sourav Datta

 

IISER Bhopal, Madhya Pradesh

Plant Sciences

Male

7.

Prof. Vikram Vishal

IIT Bombay, Maharashtra 

Earth Sciences

Male

8.

Prof. Sarvaiya Jayrajsinh Indrajitsinh,

 

National Forensic Sciences University, Gandhinagar, Gujarat

 

Forensic Pharmacy and Food Forensics

Male

9.

Prof. Sankar Prasad Rath

IIT Kanpur, Uttar Pradesh

Chemical Sciences

Male

10.

Dr Manis

ha Nigam

 

Hemvati Nandan Bahuguna Garhwal University

Srinagar, Uttarakhand

Biochemistry

Female

11.

Dr Amar Mohanrao Taksande

Jawaharlal Nehru Medical College (JNMC),

Wardha, Maharashtra

Medicines- Paediatrics

Male

12.

Dr Arun Babu

 

All India Institute of Medical Sciences (AIIMS), Mangalagiri, Andhra Pradesh

Medicines- Paediatrics

Male

13.

Dr Pukhrambam Lilabati Devi

 

 

Department of Dance and Music,

Manipur University, Imphal, Manipur

Manipuri Dance

Female

14.

Prof. Dr Ashutosh Mohan

Institute of Management Studies,

Banaras Hindu University (BHU), Varanasi

Management

Male

15.

Prof. Ankuran Dutta

 

Gauhati University,

Guwahati, Assam

Mass Communication

Male

16.

Ms Shivani V.

 

Karnataka Sanskrit University, Bangalore

Sanskrit

Female

17.

Prof. Rajeev Choudhary

Pt. Ravishankar Shukla University, Raipur, Chhattisgarh

Physical Education, Yoga Education

Male

18.

Dr. Vishwanatha H. S.

 

M.E.I. Polytechnic,

Bangalore, Karnataka

Civil Engineering

Male

19.

Dr Sasikala S.

 

PSG Polytechnic College,

Coimbatore, Tamil Nadu

Electrical & Electronics Engineering

Female

20.

Dr  Kannan Rathinam

Sakthi Polytechnic College (Govt Aided),

Erode, Tamil Nadu

Physics

Male

21.

Dr Sandipann Pralhad Narote

 

Government Polytechnic,

Solapur, Maharashtra

Electronics Engineering& Telecommunication

Male

 

***


(रिलीज़ आईडी: 2302835) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Bengali-TR , English , Urdu , Marathi , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam