ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

12 ఏళ్ల పరివర్తన: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 AUG 2026 1:18PM by PIB Hyderabad

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత 12 ఏళ్లలో భారత్ సాధించిన పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. తయారీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సదుపాయాలు, ఇంధన భద్రత, యువత సాధికారత, ఆవిష్కరణలు, సామాజిక భద్రత, ఇతర కీలక రంగాల్లో దేశం సాధించిన పురోగతిని వివరించారు.

ప్రధానమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

1. తయారీ: విస్తరణ, స్వయం సమృద్ధి

గత 12 సంవత్సరాల్లో:

రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగింది.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు పెరిగింది.

ఎలక్ట్రానిక్స్ తయారీ దాదాపు 7 రెట్లు పెరిగింది.

ఆధునిక రైల్వే కోచ్‌ల ఉత్పత్తి 21 రెట్లు పెరిగింది.

మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 35 రెట్లు పెరిగింది.

2. డిజిటల్ ఇండియా, ఆవిష్కరణ

భారత డిజిటల్, ఆవిష్కరణల వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

ఇంటర్నెట్ వినియోగదారులు దాదాపు 4 రెట్లు పెరిగారు.

పేటెంట్ మంజూరీలు 4 రెట్లు పెరిగాయి.

డిజిటల్ లావాదేవీలు సుమారు 100 రెట్లు పెరిగాయి.

భారత్ పెద్ద డిజిటల్, ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించింది.

3. ప్రాథమిక సదుపాయాల వేగవంతమైన పంపిణీ

ప్రాథమిక సదుపాయాలు సామాన్య పౌరులకు ఎంత వేగంగా అందుతున్నాయో ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

కుళాయి నీటి కనెక్షన్లు వార్షిక సగటు వేగం కంటే దాదాపు 15 రెట్లు వేగంగా అందించాం.

ఎల్‌పీజీ కనెక్షన్లు వార్షిక సగటు కంటే దాదాపు 6 రెట్లు వేగంగా అందించాం.

పేదల కోసం మరుగుదొడ్ల నిర్మాణం వార్షిక సగటు కంటే దాదాపు 4 రెట్లు వేగంగా జరుగుతోంది.

పేదల కోసం పక్కా ఇళ్లను వార్షిక సగటు కంటే దాదాపు 3 రెట్లు వేగంగా అందిస్తున్నాం.

వాడుకలో లేని వందలాది చట్టాలను రద్దు చేశాం.

మెట్రో వ్యవస్థలు సహా ఆధునిక ప్రజా రవాణా మరిన్ని నగరాలకు చేరింది.

4. సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడం

దేశీయ సెమీకండక్టర్ సామర్థ్యాలను పెంపొందించడంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

ఇంతకుముందు దేశంలో పెద్ద సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ ఏదీ లేదు.

దేశంలో ఇప్పుడు ఒక సంపూర్ణ సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మిస్తున్నాం.

మూడు సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి.

భారత్ చిప్స్ ఎగుమతినీ ప్రారంభించింది.

5. కీలక ఖనిజాలను పొందడం

అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల కోసం కీలక ఖనిజాల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ, ఈ రంగంలో భారత్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి ప్రస్తావించారు:

జాతీయ కీలక ఖనిజాల మిషన్‌ను ప్రారంభించాం.

బడ్జెట్‌లో కీలక ఖనిజాల కారిడార్‌నూ ప్రకటించాం.

కీలక ఖనిజాల సరఫరాల కోసం పలు దేశాలతో ఒప్పందాలు కుదిరాయి.

6. ఇంధన భద్రత బలోపేతం

ప్రత్యేకించి చిప్స్, ఏఐ, డేటా సెంటర్ల వంటి సాంకేతికతలకు భారీ పరిమాణంలో విద్యుత్ అవసరం అవుతున్నందున, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ఇంధన భద్రత అత్యంత ఆవశ్యకమైనదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు...

అణు ఇంధన పాత్రను స్పష్టం చేస్తూ, ప్రధానమంత్రి ఈ విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు:

‘శాంతి’ చట్టం అణు ఇంధన రంగంలో కీలక సంస్కరణగా నిలుస్తుంది.

ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమిస్తోంది.

అణు ఇంధనంలో దేశం స్వయం సమృద్ధి సాధించడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించగల సామర్థ్యం కలిగి ఉంది.

7. చమురు, గ్యాస్ అన్వేషణను విస్తరించడం

తీర ప్రాంతాల్లో అన్వేషణ పట్ల భారత్ వైఖరిలో వచ్చిన మార్పును ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

భారత సముద్రతీరంలో దాదాపు 99 శాతం ప్రాంతాన్ని గతంలో నిషేధిత (నో-గో) ప్రాంతంగా ప్రకటించారు.

నూతన విధానం ద్వారా తీరప్రాంతం ఇప్పుడు ప్రవేశ నిషిద్ధ (నో-గో) ప్రాంతం నుంచి అన్వేషణ కొనసాగించే (గో-అహెడ్) ప్రాంతంగా మారింది.

గతంలో నిషేధిత ప్రాంతాలుగా ఉన్న తీర ప్రాంతాలను అన్వేషణ కోసం అందుబాటులోకి తెచ్చారు.

దీనివల్ల కొత్త చమురు, గ్యాస్ నిల్వలను కనుగొనేందుకు అవకాశాలు లభించాయి.

8. వివిధ రకాల ఇంధనాల వినియోగం

వివిధ ఇంధన వనరుల్లో వేగవంతమైన విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.

నగర గ్యాస్ పంపిణీ

2014: 70 కంటే తక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది.

ఈ రోజు: సుమారు 700 నగరాల్లో అందుబాటులో ఉంది.

పైపుల ద్వారా వంట గ్యాస్

2014: సుమారు 20–22 లక్షల కుటుంబాలు.

ఈ రోజు: సుమారు 1.75 కోట్ల కుటుంబాలు.

సౌర శక్తి

2014: సుమారు 2 గిగావాట్లు.

ఈ రోజు: సుమారు 160 గిగావాట్లు.

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన

ఈ పథకం 50 లక్షలకు పైగా కుటుంబాలకు చేరింది.

తక్కువ లేదా సున్నా విద్యుత్ బిల్లుల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.

ఈ కుటుంబాలు అదనపు విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాయి.

ప్రతి కుటుంబానికి సుమారు రూ. 80,000 వరకు ఆర్థిక సహాయం అందుబాటులో ఉంది.

9. రైల్వేలు: విద్యుదీకరణ, భవిష్యత్ ఇంధనాలు

భారతీయ రైల్వేల పరివర్తనను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

2014 నాటికి, దాదాపు 90 సంవత్సరాల కాలంలో, రైల్వే నెట్‌వర్క్‌లో కేవలం 30 శాతం మాత్రమే విద్యుదీకరణ పూర్తయింది.

నేడు, భారతీయ రైల్వే దాదాపు సంపూర్ణ విద్యుదీకరణను సాధించింది.

భారత్ తన తొలి 'మేడ్-ఇన్-ఇండియా' హైడ్రోజన్ రైలును ప్రారంభించింది.

ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, శక్తిమంతమైన హైడ్రోజన్ రైలుగా నిలిచింది.

10. ప్రపంచ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్న భారత్

గత 10-12 సంవత్సరాలుగా నిర్మించిన సామర్థ్యాలను ఈ సమయంలో పరీక్షించామని ప్రధానమంత్రి అన్నారు:

కోవిడ్-19 మహమ్మారి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.

పశ్చిమాసియా ఘర్షణలు.

11. రైతులకు అందుబాటు ధరలో ఎరువులు

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అధిక ఎరువుల ధరల నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

యూరియా: అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక బస్తా యూరియా ధర సుమారు రూ. 3,000గా ఉంది. భారత రైతులకు ఇది రూ. 300 కన్నా తక్కువ ధరకే లభిస్తోంది.

డీఏపీ: అంతర్జాతీయంగా దీని ధర రూ.5,000కు పైగా ఉంది. భారత రైతులకు ఇది రూ. 1,350కే లభిస్తోంది.

12. వాణిజ్య, ఎగుమతి అవకాశాలు

భారతీయ ఉత్పత్తిదారులకు, ఎగుమతిదారులకు అందుబాటులోకి వస్తున్న కొత్త అవకాశాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

2014 నుంచి భారత్ సుమారు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది.

వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఎంఎస్ఎంఈలు, వస్త్ర పరిశ్రమ, ఇతర ఎగుమతి రంగాలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

13. యువత కేంద్రంగా వికసిత్ భారత్

వికసిత భారత్ నిర్మాణంలో భారత యువత పాత్ర కీలకమన్న ప్రధానమంత్రి, వారి కోసం అందుబాటులోకి తెచ్చిన కొత్త మార్గాలనూ ప్రముఖంగా ప్రస్తావించారు:

స్టార్టప్ ఇండియా: ఆవిష్కరణలు, వ్యవస్థాపనకు కొత్త మార్గాలు.

రూ.1 లక్ష కోట్లతో పరిశోధన నిధి: యువ పరిశోధకులకు కొత్త అవకాశాలు.

డిజిటల్ ఇండియా: అందుబాటు ధరలో డేటా ద్వారా సాధికారత.

స్కిల్ ఇండియా: జాతీయ నైపుణ్యాల వ్యవస్థ.

అంతరిక్ష రంగం: ప్రైవేట్ భాగస్వామ్యానికి అనుమతి.

జాతీయ డ్రోన్ విధానం: యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు కొత్త అవకాశాలు.

ఖేలో ఇండియా: బలోపేతమైన క్రీడా రంగం.

14. విద్య, ఆవిష్కరణలు

విద్య, ఆవిష్కరణ అవకాశాల విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

జాతీయ విద్యా విధానం 2020: 35 సంవత్సరాల విరామం తర్వాత ప్రవేశపెట్టారు.

విశ్వవిద్యాలయాలు: 2004–2014 మధ్య 350 కంటే తక్కువ. తర్వాతి దశాబ్దంలో కొత్తగా చేరిన సుమారు 650 విశ్వవిద్యాలయాలు.

వైద్య కళాశాలలు: 2014కు ముందు 400 కంటే తక్కువ. నేడు సుమారు 850.

పాఠశాలల్లో 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి.

చిన్న వయస్సు నుంచే సాంకేతిక, ఆవిష్కరణ దృక్పథాన్ని పెంపొందించడంపై దృష్టి.

15. అంకురసంస్థలు, అంతరిక్షం, ఏఐ

దేశంలో అభివృద్ధి చెందుతున్న అంకురసంస్థలు, ఆవిష్కరణల వ్యవస్థను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

ఒక భారతీయ అంతరిక్ష రంగ అంకురసంస్థ 'మేడ్-ఇన్-ఇండియా' రాకెట్‌ను ప్రయోగించింది.

దేశంలో ఇప్పుడు సుమారు 2.5 లక్షల నమోదిత అంకురసంస్థలు ఉన్నాయి.

భారత యువతకు ఏఐ కొత్త అవకాశాలను కల్పిస్తోంది.

ఈ ఏడాది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది.

16. కొత్త రంగాలు, కొత్త అవకాశాలు

బయోఎకానమీ

2014: సుమారు రూ. 60,000 కోట్లు.

నేడు: సుమారు రూ. 20 లక్షల కోట్లు.

ఈ విస్తరణ కొత్త ఉద్యోగాలను, వ్యవస్థాపన అవకాశాలను కల్పిస్తోంది.

విద్యుత్ వాహనాలు

గత దశాబ్దం చివరి నాటికి: ఏటా సుమారు 1.5 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయి.

గత సంవత్సరం: సుమారు 25 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయి.

విమానయానం

కొత్త విమానాశ్రయాలు, విమాన మార్గాలు ఉపాధిని కల్పిస్తున్నాయి.

ఎంఆర్‌వో కొత్త అవకాశాలను కల్పిస్తోంది.

భారత్ 'మేడ్-ఇన్-ఇండియా' విమానాల తయారీ దిశగా పయనిస్తోంది.

భారత్‌లో తయారైన సి-295 రక్షణ రవాణా విమానం తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

17. స్వామిత్వ ద్వారా గ్రామీణ సాధికారత

స్వామిత్వ పథకం ప్రభావాన్నీ ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.:

దాదాపు 3.25 కోట్ల కుటుంబాలు ఆస్తి యాజమాన్య కార్డులను అందుకున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో సుమారు రూ. 140 లక్షల కోట్ల ఆర్థిక సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది.

ఆస్తి రికార్డులు గ్రామస్తులకు వారి ఆస్తిపై బ్యాంకు రుణాలు పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి.

గ్రామీణ ఉపాధి, స్వయం ఉపాధి, వ్యవస్థాపనకు కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.

18. రక్షణ ఎగుమతుల్లో వృద్ధి

భారత రక్షణ ఎగుమతుల విస్తరణనూ ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లకు పైగా పెరిగాయి.

భారత రక్షణ పరికరాలు ఇప్పుడు సుమారు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

19. మహిళల నేతృత్వంలోని అభివృద్ధి: లఖ్‌పతి దీదీ

భారత అభివృద్ధిలో పెరుగుతున్న మహిళల పాత్రను ప్రముఖంగా చూపడం:

3 కోట్ల మంది లఖ్‌పతి దీదీల లక్ష్యం సాధించాం.

సాధారణ, దళిత, వెనకబడిన, గిరిజన కుటుంబాలకు చెందిన మహిళలు లఖ్‌పతి దీదీలుగా మారారు.

20. సామాజిక భద్రతను విస్తరించడం

సామాజిక భద్రతా కవరేజీ విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

2014కు ముందు, సుమారు 25 కోట్ల మంది ప్రజలు సామాజిక భద్రత పరిధిలోకి వచ్చేవారు.

నేడు, సుమారు 100 కోట్ల మంది భారతీయులు ఏదో ఒక సామాజిక భద్రతా పథకం పరిధిలో ఉన్నారు.

21. ఆయుష్మాన్ భారత్

ఆయుష్మాన్ భారత్ ద్వారా కుటుంబాలకు అందించిన ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు:

లబ్ధిదారుల కుటుంబాలకు సుమారు రూ.2 లక్షల కోట్ల వైద్య ఖర్చులు ఆదా అయ్యాయి.


(रिलीज़ आईडी: 2299989) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Kannada , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil