పార్లమెంటరీ వ్యవహారాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా
మొత్తం 12 బిల్లులకు ఉభయ సభల ఆమోద ముద్ర
प्रविष्टि तिथि:
13 AUG 2026 3:58PM by PIB Hyderabad
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల (జూలై) 20న ప్రారంభమై, నేటి (ఆగస్టు 13) వరకూ 25 రోజుల పాటు సాగిన ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉభయ సభలు 19 సార్లు సమావేశమయ్యాయి. ఇక లోక్‌సభలో 11, రాజ్యసభలో 2 వంతున ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ ఆమోదం పొందాయి.
ఇందులో భాగంగా ప్రస్తుత సమావేశాలకు ముందు రాష్ట్రపతి జారీ చేసిన సుప్రీం కోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్-2026, ఆదాయపు పన్ను (సవరణ) ఆర్డినెన్స్-2026ల స్థానంలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులను ఉభయ సభలు పరిశీలించి, ఆమోదించాయి.
అలాగే, 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను అదనపు నిధుల డిమాండ్ సంబంధిత వినియోగ బిల్లును ప్రభుత్వం 04.08.2026న లోక్‌సభలో ప్రవేశపెట్టగా, దాన్ని ఆమోదించి రాజ్యసభకు పంపడంతో అక్కడ 06.08.2026న దాని పరిశీలన పూర్తయింది.
అయితే, విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు-2026 (ఎఫ్‌సీఆర్‌ఏ)ను అధ్యయనం, నివేదిక కోసం సంయుక్త సభా సంఘాని (జేపీసీ)కి నివేదించారు.
పబ్లిక్ పరీక్షల నిర్వహణలో అవతవకలపై విద్యార్థుల ఆందోళనను తక్షణం పరిష్కారం దిశగా ఆ వ్యవస్థ సమగ్రత-విశ్వసనీయతలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024 నాటి వాస్తవ చట్టాన్ని సవరిస్తూ పబ్లిక్ పరీక్షల (అక్రమ విధానాల నిరోధం) సవరణ బిల్లు-2026ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నేరాల సత్వర దర్యాప్తు, నిర్దేశిత వ్యవధిలో విచారణకు భరోసా, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు స్వేచ్ఛ వంటి ప్రధానాంశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. అలాగే, రెండు నెలల్లో దర్యాప్తు సహా మూడు నెలల్లో విచారణ కచ్చితంగా ముగించేలా వ్యవధి నిర్దేశం, అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు, నేరాలకు జరిమానా-శిక్షల పెంపు, హైకోర్టు ధర్మాసనానికి వ్యవధి నిర్దేశిత అప్పీలేట్ యంత్రాంగం సమకూర్చడం వంటివి ఈ బిల్లులోని మరికొన్ని కీలకాంశాలు. ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలుపగా, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది.
వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదించిన మరికొన్ని ప్రధాన బిల్లులు:
- జాతీయ ప్రతిష్టకు అమర్యాద నివారణ (సవరణ) బిల్లు-2026 ద్వారా జాతీయ గేయమైన వందేమాతరాన్ని 1971 నాటి ఈ జాతీయ చట్టంలోని సెక్షన్ 3 పరిధిలోకి తెస్తూ సవరణను ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే, ఉద్దేశపూర్వకంగా వందేమాతరం ఆలాపనను నిరోధించడం, అది సాగుతుండగా ఏదైనా కార్యక్రమం లేదా సభకు ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించాలని కూడా ఇది సూచిస్తోంది. తద్వారా ఈ గేయానికి చట్టబద్ధ రక్షణ కల్పిస్తూ, అటువంటి చర్యలను ఈ చట్టం కింద శిక్షార్హమైనవిగా ఇది ప్రకటిస్తుంది.
- జనన-మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026... సరళ ధ్రువీకరణ యంత్రాంగం ఏర్పాటు ద్వారా జనన-మరణాల నమోదులో ఆలస్యం సంబంధిత నిబంధనలను మరింత కఠినం చేయడం కోసం 1969 నాటి వాస్తవ చట్టం సవరణను ఇది ప్రతిపాదిస్తుంది. దీని ప్రకారం, ఏడాది, రెండేళ్ల జాప్యమైతే అధికార పరిధిగల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆమోదంతో... రెండేళ్లు దాటితే ఫస్ట్‌క్లాస్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆమోదంతో మాత్రమే నమోదుకు వీలుంటుంది.
Ø సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు-2026... ఇది 2006 నాటి వాస్తవ చట్ట సవరణకు ఉద్దేశించిన బిల్లు. ‘ఎంఎస్‌ఎంఈ’ల ఉచిత-స్వచ్ఛంద నమోదుకు జాతీయ డిజిటల్ వేదిక ఏర్పాటు, ఆర్థిక సహాయం లభ్యత మెరుగుదల, సూక్ష్మ-చిన్న సంస్థల చెల్లింపు జాప్యంపై వివాదాల సతర్వ పరిష్కారానికి భరోసా, వ్యాపార సౌలభ్య కల్పన, కొన్ని నిబంధనల ఉల్లంఘన సంబంధ తప్పిదాలను నేరరహితంగా ప్రకటించడం వగైరా చర్యల ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఇందులో భాగంగా నేర నిర్ధారణ ఆధారిత జరిమానాల స్థానంలో, తొలి సందర్భంలోనే హెచ్చరికను చేర్చడం ద్వారా నేరశ్రేణి ఆధారిత శిక్షలను ప్రవేశడతారు.
Ø బ్యాంకర్ల రికార్డు సాక్ష్యం బిల్లు-2026... “బ్యాంకర్ల రికార్డులు” నిర్వచనం పరిధిని విస్తరించడం దీని ప్రధానోద్దేశం. దీని ప్రకారం... బ్యాంకులు నిర్వహించే భౌతిక, ఎలక్ట్రానిక్, డిజిటల్, వర్చువల్, క్లౌడ్-ఆధారిత లేదా ఇతరత్రా రికార్డులన్నీ ఈ నిర్వచనం కిందకు వస్తాయి. తద్వారా ఇదొక సమగ్ర, సాంకేతిక-తటస్థ, భవిష్యత్ సంసిద్ధ చట్టబద్ధ చట్రంగా రూపొందుతుంది. ధ్రువీకరణ పత్రాలతో పాటు మాన్యువల్-డిజిటల్-ఎలక్ట్రానిక్ ప్రామాణీకరణను కూడా ఇది అనుమతిస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ రికార్డులను భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా సమర్పించే వీలు కల్పిస్తుంది. ఆర్థిక రంగం అంతటా దీని పరిధి విస్తరణ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ఇది మరింత అధికారాన్నిస్తుంది. న్యాయపరమైన విచారణకు “ప్రత్యేక ప్రాతిపదికను”ను కూడా నిర్వచిస్తుంది.
Ø కేరళ (పేరు మార్పు) బిల్లు-2026... రాజ్యాంగంలోని ఆర్టికల్-3కు అనుగుణంగా కేరళ రాష్ట్రం పేరును “కేరళం”గా మార్చడం కోసం రాజ్యాంగంలోని తొలి షెడ్యూల్ సవరణకు ఇది ప్రతిపాదిస్తుంది.
Ø జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (సవరణ) బిల్లు-2026... జాతీయ సహకార అభివృద్ధి సంస్థ చట్టం-1962 సవరణను ఇది ప్రతిపాదిస్తుంది. తద్వారా “ఆహార పదార్థాలు” నిర్వచనాన్ని మరింత విస్తరించి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఇతర ఆహార వస్తువులను చేర్చడం, పారిశ్రామిక వస్తువులకు వర్తించే భౌగోళిక పరిమితి తొలగింపు, చట్టబద్ధ సూచనల నవీకరణ, వాడుకలో లేని నిబంధనల రద్దు, కార్పొరేషన్‌కు అవసరమైన అనుబంధ అధికారాల కల్పన తదితరాలతో సహకార రంగాన్ని బలోపేతం చేస్తారు. అధీకృత సంస్థలతో రుణం-సంబంధిత ఇతర సమాచార సేకరణ, పంచుకోవడాన్ని ఇవన్నీ సులభతరం చేస్తాయి. అదే సమయంలో మరింత సౌలభ్యం, చట్టబద్ధ స్పష్టత, కార్యాచరణ సామర్థ్యాన్ని కల్పిస్తాయి. సహకారాభివృద్ధికి సకాలంలో, ప్రత్యక్షంగా, ప్రతిస్పందనాత్మకంగా ఆర్థిక సహాయం దిశగా వెసులుబాటు లభిస్తుంది.
Ø ట్రైబ్యునళ్లలో సంస్కరణల బిల్లు-2026... వివిధ ట్రైబ్యునళ్లు, చైర్‌పర్సన్లు, సభ్యుల అర్హతలు, నియామకం, సేవా నిబంధనలు-షరతులలో, ట్రైబ్యునళ్ల పరిపాలన-పనితీరు సామర్థ్యం మెరుగుదల, స్వేచ్ఛ-పారదర్శకత-ఏకరూపతకు భరోసా, జాతీయ ట్రైబ్యునళ్ల కమిషన్ ఏర్పాటు, సంబంధిత చట్టాలలో పర్యవసానాల పరంగా సవరణ లేదా అనుబంధ అంశాలను ఇది ప్రతిపాదిస్తుంది.
Ø గనులు-ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు-2026... ఖనిజ రంగం ఆర్థిక విధానాల్లో కచ్చితత్వం, నిలకడ, అంచనాల దిశగా గనులు-ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957 సవరణను ఇది ప్రతిపాదిస్తుంది. తద్వారా జాతీయ ఆర్థిక వృద్ధికి ఉత్తేజమిస్తూ స్వయంసమృద్ధ భారత్ సంకల్ప సాకారాన్ని సుగమం చేస్తుంది. అంతిమంగా వికసిత భారత్-2047 లక్ష్య సాధనకు దోహదపడుతుంది.
లోక్‌సభలో ప్రవేశపెట్టిన, సంయుక్త సభా సంఘానికి నివేదించిన, లోక్‌సభ ఆమోదించిన, రాజ్యసభలో ప్రవేశపెట్టిన-ఆమోదించిన, ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లుల జాబితాను కింది అనుబంధంలో చూడవచ్చు. ఇక లోక్‌సభలో దాదాపు 19 శాతం, రాజ్యసభలో సుమారు 39 శాతం వంతున ఉత్పాదకత నమోదైంది.
అనుబంధం
18వ లోక్సభ 8వ సమావేశం, రాజ్యసభ 271వ సమావేశాల్లో శాసనబద్ధ కార్యకలాపాలివే:-
I. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులు:
1. సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026
2. పబ్లిక్ పరీక్షలు (అక్రమ విధానాల నిరోధం) సవరణ బిల్లు-2026
3. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026
4. భారతీయ గణాంక సంస్థ బిల్లు-2026
5. బ్యాంకర్ల రికార్డుల సాక్ష్యం బిల్లు-2026
6. పన్నులు-ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026
7. వినియోగ బిల్లు-2026 (నం.3)
8. ట్రిబ్యునళ్లలో సంస్కరణల బిల్లు-2026
9. గనులు-ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు-2026
10.కేరళ (రాష్ట్రం పేరు మార్పు) బిల్లు-2026
11. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (సవరణ) బిల్లు-2026
II. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులు:
1. జాతీయ ప్రతిష్టకు అగౌరవ నివారణ (సవరణ) బిల్లు-2026
2. సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు-2026
III. సంయుక్త సభా సంఘానికి నివేదించిన బిల్లు:
1. విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు-2026
IV. లోక్‌సభలో ఆమోదించిన బిల్లులు:
1. పబ్లిక్ పరీక్షలు (అక్రమ విధానాల నిరోధం) సవరణ బిల్లు-2026
2. జాతీయ ప్రతిష్టకు అగౌరవ నివారణ (సవరణ) బిల్లు-2026
3. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026
4. సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026
5. వినియోగ బిల్లు-2026 (నం.3)
6. బ్యాంకర్ల రికార్డుల సాక్ష్యం బిల్లు-2026
7. పన్నులు-ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026
8. సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు-2026
9. ట్రిబ్యునళ్లలో సంస్కరణల బిల్లు-2026
10. కేరళ (రాష్ట్రం పేరు మార్పు) బిల్లు-2026
11. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (సవరణ) బిల్లు-2026
12. గనులు-ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు-2026
V. రాజ్యసభలో ఆమోదించిన బిల్లులు:
1. జాతీయ ప్రతిష్టకు అగౌరవ నివారణ (సవరణ) బిల్లు-2026
2. పబ్లిక్ పరీక్షలు (అక్రమ విధానాల నిరోధం) సవరణ బిల్లు-2026
3. సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు-2026
4. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026
5. సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026
6. వినియోగ బిల్లు-2026 (నం.3)
7. బ్యాంకర్ల రికార్డుల సాక్ష్యం బిల్లు-2026
8. పన్నులు-ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026
9. కేరళ (రాష్ట్రం పేరు మార్పు) బిల్లు-2026
10. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (సవరణ) బిల్లు-2026
11. ట్రిబ్యునళ్లలో సంస్కరణల బిల్లు-2026
12. గనులు-ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు-2026
VI. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులు:
1. జాతీయ ప్రతిష్టకు అగౌరవ నివారణ (సవరణ) బిల్లు-2026
2. పబ్లిక్ పరీక్షలు (అక్రమ విధానాల నిరోధం) సవరణ బిల్లు-2026
3. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026
4. సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026
5. వినియోగ బిల్లు-2026 (నం.3)
6. సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు-2026
7. బ్యాంకర్ల రికార్డుల సాక్ష్యం బిల్లు-2026
8. పన్నులు-ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026
9. కేరళ (రాష్ట్రం పేరు మార్పు) బిల్లు-2026
10. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (సవరణ) బిల్లు-2026
11. ట్రిబ్యునళ్లలో సంస్కరణల బిల్లు-2026
12. గనులు-ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు-2026
***
(रिलीज़ आईडी: 2299126)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam