పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
‘2026 ప్రపంచ ఏనుగుల దినోత్సవం’ సందర్భంగా ఏనుగుల సంరక్షణ పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిన భారత్
ఏనుగుల భవితను సంరక్షించడమంటే మన అడవులు, జీవవైవిధ్యం, పర్యావరణ వారసత్వాన్ని కాపాడడమే: శ్రీ భూపేందర్ యాదవ్
प्रविष्टि तिथि:
12 AUG 2026 11:19AM by PIB Hyderabad
మానవులు, ఏనుగులు కలిసి మనుగడను సాగించే భవిష్యత్ కాలాన్ని సంరక్షించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ‘2026 ప్రపంచ ఏనుగుల దినోత్సవం’ సందర్భంగా పునరుద్ఘాటించారు.
భారత్‌లో 14 రాష్ట్రాల్లో ఏనుగులకు సంబంధించిన 33 అభయారణ్యాలు, శాస్త్రీయంగా సక్రమమని ప్రకటించిన 150 కారిడార్లు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచిన ఒక సందేశంలో మంత్రి తెలిపారు. సంతతి పర్యవేక్షణకు ఆధునిక పద్ధతుల్ని అనుసరించడం, పటిష్టమైన చర్యలు తీసుకోవడం..మనుషుల, ఏనుగుల మధ్య సంఘర్షణల్ని తగ్గించి, ఏనుగుల సంరక్షణను బలోపేతం చేస్తాయని శ్రీ యాదవ్ పేర్కొన్నారు.
‘‘ఏనుగులను కాపాడడమంటే అది మన అడవుల్నీ, జీవవైవిధ్యాన్నీ, పర్యావరణ వారసత్వాన్నీ కాపాడుతున్నట్లే’’ అని మంత్రి అన్నారు. రాబోయే కాలంలో దేశంలోని అడవుల్లోనూ, కీలక ఆవాసాల్లోనూ ఏనుగులు స్వేచ్ఛగా సంచరించే దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఒక సందేశాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ (ఈఎఫ్‌సీసీ) సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ పొందుపరుస్తూ, భూమి మీద గల అత్యంత సుసంపన్న, అత్యంత వైవిధ్యపూరిత కీలక ఆవాసాలు భారత్‌లోనే నెలకొన్నాయన్నారు. ప్రపంచంలో అటవీప్రాంతాల్లో తిరుగాడే ఆసియా ఏనుగుల్లో దాదాపు 60 శాతం భారత్‌లోనే ఉన్నాయనీ, అవి భారత పర్యావరణ వారసత్వానికి ఒక సజీవ ప్రతీకలుగా నిలుస్తున్నాయనీ ఆయన వర్ణించారు. సంరక్షణ విషయంలో దేశం ఎంత నిబద్ధతతో ఉందో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ఏనుగు అభయారణ్యాలు తెలియజేస్తున్నాయని కూడా మంత్రి అన్నారు.
ఏనుగులు విస్తారిత అనుబంధ వ్యవస్థకు ఇంజినీర్ల మాదిరి పనిచేస్తున్నాయని కూడా శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ అన్నారు. ఏనుగులు సుదూర ప్రాంతాలలో సంచరిస్తూ విత్తనాలను చాలా దూరం విస్తరింపచేస్తుంటాయనీ, దీంతో కొత్త మొక్కలు మొలకెత్తుతుంటాయనీ, ఏనుగులు వేసే ప్రతి అడుగూ ప్రకృతి సమతూకాన్ని కాపాడడంలో తోడ్పడేదేననీ శ్రీ సింగ్ అన్నారు. భారీ కాయంతో కూడిన ఈ వన్య జీవులను సంరక్షించడానికీ, ఆశ్రయం కల్పించడానికీ అందరూ ఏకతాటి మీదకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
***
(रिलीज़ आईडी: 2298183)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam