ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

వందేమాతరం 150వ వార్షికోత్సవాల సందర్భంగా ఎంపీల హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి


ప్రజా ఉద్యమంగా హర్ ఘర్ తిరంగా... వందేమాతరం స్ఫూర్తికి దృశ్య రూపం: ఉపరాష్ట్రపతి

మాతృభూమి పట్ల ప్రేమను జాతీయ బాధ్యతగా మార్చే వందేమాతరం: ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 12 AUG 2026 11:03AM by PIB Hyderabad

జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపం వద్ద పార్లమెంట్ సభ్యులుఇతర ప్రజాప్రతినిధులు చేపట్టిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు

జాతీయాభిమానంఐక్యతపౌర భాగస్వామ్య సందేశాన్ని అందిస్తూ.. భారత్ మండపం నుంచి మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

మాతృభూమిపై ఉన్న ప్రేమను జాతీయ బాధ్యతగా వందేమాతరం మార్చిందనీభారత స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తిమంతమైన వ్యక్తీకరణగా నిలిచిందనీ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అన్నారుఅనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల్లో ధైర్యంత్యాగంఆశాభావం నిండేలా జాతీయ గేయంలోని చిరస్మరణీయ వాక్యాలు స్ఫూర్తినిచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు

ఇటీవలే అండమాన్నికోబార్ దీవుల్లో తాను చేపట్టిన పర్యటనను గుర్తు చేసుకుంటూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంచారిత్రక సెల్యులార్ జైల్ తనను ఎంతగానో కదిలించాయని ఉపరాష్ట్రపతి చెప్పారు. 1943లో నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సందర్భాన్నీసెల్యులార్ జైల్లో బందీలుగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలనూ గుర్తు చేసుకున్నారువారిలో చాలామంది వందేమాతరం అని నినదిస్తూ ఉరికంభం ఎక్కారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దేశవ్యాప్తంగా జాతీయ గేయం వందేమాతరం చూపిన ప్రభావం గురించి శ్రీ సీపీ రాధాకృష్ణన్ వివరించారువందేమాతరం స్ఫూర్తినీసందేశాన్నీ ప్రజలకు చేరవేసేలా స్వాతంత్ర్య సమరయోధులూతమిళనాడుకు చెందిన నాయకులూ చేసిన కృషినీత్యాగాలనూ స్మరించుకున్నారువారిలో వీవో చిదంబరం పిళ్లైసుబ్రమణ్య శివతిరుప్పూర్ కుమరన్వంచినాథన్జాతీయ కవి సుబ్రమణ్య భారతి ఉన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022లో ప్రారంభించిన ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ప్రజాఉద్యమంగా మారిందనీదీనిలో తిరంగా యాత్రలుబైక్సైకిల్ ర్యాలీలుసాంస్కృతిక కార్యక్రమాలుఇతర కార్యకలాపాల్లో ప్రజలు పాల్గొంటున్నారనీ ఉపరాష్ట్రపతి చెప్పారుఒకటే మాతృభూమి అనే భావనకు తిరంగా దృశ్యరూపం ఇస్తుందనీఎంపీలుప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిజాతీయ పతాకాన్ని గర్వంగా ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించాలనీ ఆయన కోరారు.

కేంద్ర మంత్రులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్శ్రీ రాజీవ్ రంజన్ సింగ్శ్రీ వీరేంద్ర కుమార్శ్రీ జీ కిషన్ రెడ్డిశ్రీ కిరణ్ రిజిజుశ్రీ జితేంద్ర సింగ్పార్లమెంట్ సభ్యులుఇతర ప్రజా ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2298170) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam