ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆగస్టు 8న ఐఐటీ ఢిల్లీలో జరిగే 57వ స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగం ప్రతిభావంతులైన విద్యార్థులకు సంస్థ అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేయనున్న ప్రధాని


ఐఐటీ ఢిల్లీ సోనీపట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారితమైన, అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటింగ్ కేంద్రం ‘పరం ప్రజ్ఞ’ను ప్రారంభించనున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 07 AUG 2026 9:35AM by PIB Hyderabad

2026 ఆగస్టు 8న ఉదయం 11 గంటలకు జరిగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఢిల్లీ 57వ స్నాతకోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. 587 మంది పీహెచ్‌డీ పరిశోధకులతో సహా పట్టభద్రులైన 3000 మంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. 

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ స్వర్ణ పతకం, డైరెక్టర్స్ స్వర్ణ పతకం, శంకర్ దయాళ్ శర్మ స్వర్ణ పతకం, పర్ఫెక్ట్ టెన్ స్వర్ణ పతకాలతో సహా సంస్థ అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ప్రదానం చేస్తారు.

ఐఐటీ సోనీపట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారితమైన, అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటింగ్ కేంద్రం ‘పరం ప్రజ్ఞ’ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది అత్యాధునిక పరిశోధన, కృత్రిమ మేధను అభివృద్ధి చేయడంలో భారత్ అంకితభావాన్ని తెలియజేస్తుంది. ఏఐ, డేటా సైన్స్, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, అంతర విభాగ పరిశోధనల్లో సంస్థ సామర్థ్యాలను ఈ అత్యాధునిక కేంద్రం మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2295974) సందర్శకుల సూచీ సంఖ్య : : 54