ప్రధాన మంత్రి కార్యాలయం
2026 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ బింద్యారాణీ దేవీ సొరొఖైబామ్‌కు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
28 JUL 2026 7:50AM by PIB Hyderabad
కామన్వెల్త్ క్రీడలు- 2026లో మహిళల 58 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణీ దేవి సొరొఖైబామ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
కఠోర శ్రమ, అంకితభావంతో ఆమె ఈ విజయం సాధించారని ప్రధానమంత్రి అన్నారు.
భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలంటూ శ్రీ మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం! గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 58 కిలోల విభాగంలో బింద్యారాణీ దేవీ సొరొఖైబామ్ కాంస్య పతకాన్ని సాధించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. కఠోర శ్రమ, అంకితభావంతో ఆమె ఈ విజయాన్ని సాధించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ... ఆమెకు శుభాకాంక్షలు!”
*************
MJPS/SS/ST
(रिलीज़ आईडी: 2290241)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati