ప్రధాన మంత్రి కార్యాలయం
‘గ్లాస్గో కామన్వెల్త్-2026’ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
24 JUL 2026 12:00PM by PIB Hyderabad
‘గ్లాస్గో కామన్వెల్త్-2026’ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
పట్టుదల, సంకల్పం, ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనే స్ఫూర్తి తో క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారనే విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు.
క్రీడాకారుల నైపుణ్యాలు, వారి అంకితభావం ఎల్లప్పుడూ అనేక మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘గ్లాస్గో కామన్వెల్త్ 2026 పోటీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారత బృందానికి నా శుభాకాంక్షలు.
పట్టుదల, సంకల్పం, ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనే స్ఫూర్తితో మన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని విశ్వసిస్తున్నాను.
మన క్రీడాకారుల నైపుణ్యం, అంకితభావం అనేక మంది భారతీయులకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.’’
***
(रिलीज़ आईडी: 2289324)
आगंतुक पटल : 17