ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని 3 జిల్లాల్లో మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం... ఈ ప్రాజెక్టుతో మరో 46 కి.మీ మేర విస్తరించనున్న భారతీయ రైల్వే వ్యవస్థ


రూ. 1,264 కోట్ల అంచనా వ్యయంతో 2028-29 నాటికి పూర్తికానున్న ప్రాజెక్టు

प्रविष्टि तिथि: 24 JUL 2026 4:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ.. కర్ణాటకఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బళ్లారి-గుంతకల్ విభాగం మధ్య రూ. 1,264 కోట్ల అంచనా వ్యయంతో 34వ రైల్వే లైన్ నిర్మాణానికి నేడు ఆమోదం తెలిపింది.

సమగ్ర ప్రణాళికభాగస్వాముల సంప్రదింపుల ద్వారా బహుళ రవాణా అనుసంధానాన్నిలాజిస్టిక్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో పీఎం-గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజల రాకపోకలతో పాటు సరుకులుసేవల రవాణాకు సులభతరమైనఆటంకాలు లేని అనుసంధానం అందుబాటులోకి రానుంది.

కర్ణాటకఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని 3 జిల్లాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టు ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత వ్యవస్త దాదాపు 46 కిలోమీటర్ల మేర పెరగనుంది.

ఈ ప్రతిపాదిత మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టు వల్ల సుమారు ఏడు లక్షల జనాభా ఉన్న దాదాపు 99 గ్రామాలకు రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయి.

రైల్వే సామర్థ్యం పెరగడం ద్వారా బళ్లారి కోటశ్రీ కుమార స్వామి దేవాలయం వంటి దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ఇనుప ఖనిజండోలమైట్సున్నపురాయిఇనుముఉక్కుబొగ్గుఎరువులుఆహార ధాన్యాలు వంటి ప్రధాన సరుకుల రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. రైల్వే సామర్థ్యం పెరగడం వల్ల ఏటా అదనంగా 16.22 మిలియన్ టన్నుల సరుకుల రవాణా సాధ్యమవుతుంది. రైల్వే రవాణా పర్యావరణహితమైనదే కాకుండా ఇంధన సామర్థ్యం కలిగినది కాబట్టిఇది దేశ వాతావరణ లక్ష్యాలను సాధించడంలోరవాణా వ్యయాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. దీనివల్ల 1.32 కోట్ల లీటర్ల మేరకు చమురు దిగుమతులు తగ్గడంతో పాటు 6.67 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 27 లక్షల మొక్కలను నాటడంతో సమానం.

లైన్ సామర్థ్యం పెరగడం వల్ల రైళ్ల రాకపోకల వేగం పెరిగిభారతీయ రైల్వే పనితీరు మెరుగవడమే కాకుండా సేవల విశ్వసనీయత కూడా పెరుగుతుంది. ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదన రైల్వే కార్యకలాపాలను సులభతరం చేసిట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి ద్వారా ప్రజలకు ఉద్యోగఉపాధి అవకాశాలు పెరిగివారిని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2288927) आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam