సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
టెలివిజన్, రేడియో సేవల నియంత్రణలను సరళీకరించేందుకు టెలికమ్యూనికేషన్లు (టెలివిజన్, రేడియో, అసోసియేటెడ్ సర్వీసెస్) నియమాల ముసాయిదా – 2026
బ్రాడ్‌కాస్టర్లు పాటించాల్సిన నిబంధనలను క్రమబద్ధీకరించడానికి, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడానికి ఏకీకృత నియమావళి ప్రతిపాదన
ఇప్పటికే లైసెన్సు ఉన్నవారు తమ లైసెన్సులు/అనుమతులను స్వచ్ఛందంగా కొత్త విధానంలోకి మార్చుకొనే లేదా ఆ మార్పు జరిగేంత వరకు వాటినే కొనసాగించే వెసులుబాటును అందిస్తున్న ముసాయిదా నియమాలు
प्रविष्टि तिथि:
22 JUL 2026 3:53PM by PIB Hyderabad
కొత్తగా అమల్లోకి వచ్చిన టెలికమ్యూనికేషన్ల చట్టం – 2023 పరిధిలో టెలివిజన్, రేడియో సేవల కోసం జారీ చేసిన వివిధ మార్గదర్శకాలను ఏకీకృతం చేయడానికి టెలికమ్యూనికేషన్లు (టెలివిజన్, రేడియో, అనుబంధ సేవలు) నియమాల ముసాయిదా – 2026ను ప్రభుత్వం విడుదల చేసింది. వాటిలో దిగువ పేర్కొన్న మార్గదర్శకాలున్నాయి.
-
భారత్‌లోని శాటిలైట్ టెలివిజన్ ఛానళ్లను అప్‌లింకింగ్, డౌన్‌లింకింగ్ చేయడం కోసం విధానపరమైన మార్గదర్శకాలు.
-
భారత్‌లో డైరెక్ట్–టు–హోం (డీటీహెచ్) బ్రాడ్‌కాస్టింగ్ సేవలను అందించడానికి లైసెన్సు పొందడానికి మార్గదర్శకాలు.
-
భారత్‌లో హెడెండ్–ఇన్–ది–స్కై (హెచ్ఐటీఎస్) ప్రసార సేవలను అందించడానికి మార్గదర్శకాలు.
-
ప్రైవేటు సంస్థల ద్వారా ఎఫ్ఎం రేడియో ప్రసార సేవల విస్తరణకు (మూడో దశ) విధాన మార్గదర్శకాలు.
-
భారత్‌లో కమ్యూనిటీ రేడియో స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సవరించిన విధానపరమైన మార్గదర్శకాలు.
-
ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సేవలను అందించడానికి మార్గదర్శకాలు.
వీటితో ఏకీకృతమైన, సరళీకరించిన నియమావళి పరిశ్రమకు లభిస్తుంది. టెలివిజన్, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తూ.. ప్రస్తుతం అమల్లో విధానాన్ని సమన్వయం చేసుకొనేలా ఈ నిబంధనలను రూపొందించారు. ఈ ముసాయిదా నిబంధనలు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (https://www.mib.gov.in/)లో ప్రచురితమయ్యాయి. 2026, జులై 27 లోగా ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలను తెలియజేయవచ్చు.
కొత్త నియంత్రణ విధానాన్ని స్వీకరించడంలో పరిశ్రమకు ముసాయిదా నియమాలు తోడ్పాటు అందిస్తాయి. వీటి ప్రకారం ఇప్పటికే ఉన్న లైసెన్సులు/అనుమతులను స్వచ్ఛందంగా కొత్త నియంత్రణ విధానంలోకి మార్చుకోవచ్చు. లేదా కొత్త వ్యవస్థలోకి మారేంత వరకు వాటిని కొనసాగించవచ్చు.
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలోని మారుమూల, గ్రామీణ ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా టెలివిజన్, రేడియో, కమ్యూనిటీ రేడియో సేవలను మెరుగుపరచడానికి అవసరమైన నిబంధనలు ఈ ముసాయిదా నియమాల్లో ఉన్నాయి.
లోక్‌సభలో శ్రీ ముఖేష్ కుమార్ చంద్రకాంత్ దలాల్, శ్రీ దినేశ్ భాయ్ మక్వానా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ అందించారు.
***
(रिलीज़ आईडी: 2287994)
आगंतुक पटल : 4