ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్రీడా రంగంలో సహకారానికి భారత్, ఆస్ట్రేలియా కార్యాచరణ ప్రణాళిక

प्रविष्टि तिथि: 10 JUL 2026 10:07AM by PIB Hyderabad

 భారత్, ఆస్ట్రేలియా మధ్య  క్రీడలు ఒక శక్తిమంతమైన వారధిగా ఉన్నాయి. ఇవి ప్రజలను కలుపుతూ, సహకారానికి కొత్త బాటలు వేస్తున్నాయి.
క్రీడారంగంలో సహకారానికి ఉద్దేశించిన 2023 అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ) ఆధారంగా, భారత్, ఆస్ట్రేలియా ‘క్రీడా సహకార ప్రణాళిక’ రూపుదిద్దుకుంది. ఇది మన ద్వైపాక్షిక సంబంధాలను సుదృఢంగా తీర్చిదిద్దడానికి ఆచరణీయమైన, భవిష్యత్తు ప్రాథమ్యాలను, అవకాశాలను నిర్దేశిస్తోంది.
భారత్ 2030లో కామన్‌వెల్త్ క్రీడలను అహ్మదాబాద్‌లో నిర్వహించనుంది. అలాగే ఆస్ట్రేలియా 2032లో ఒలింపిక్స్‌, పారాలింపిక్ క్రీడలను నిర్వహించనుంది. భవిష్యత్తులో ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్ క్రీడలకూ ఆతిథ్యాన్ని ఇవ్వాలని భారత్ కోరుకుంటోంది. అంటే.. రాబోయే దశాబ్దం అందించే అవకాశాలను ఈ క్రీడా ప్రణాళిక పరిగణిస్తుంది. ఉమ్మడి ప్రాథమ్యాలను, సామర్థ్యాలను, వనరులను దృష్టిలో పెట్టుకొని సహకారం అవసరమయ్యే రంగాలను గుర్తిస్తుంది. 
భారత్‌లోనూ, ఆస్ట్రేలియాలోనూ క్రీడల నిర్వహణ, క్రీడల కోసం అనుబంధ వ్యవస్థను అభివృద్ధిపరచడంలో ఎదురయ్యే అంతరాలను గమనించి, సాముదాయిక క్రీడలను ప్రోత్సహించడంలో క్రీడాసంస్థలు, వాణిజ్య సంస్థలు, రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, బృందాల మధ్య అనుబంధాన్ని సుగమం చేయడానికి మేం కట్టుబడ్డాం. ఇరు దేశాలకు మేలు చేయగల అన్ని స్థాయుల్లోనూ పటిష్ఠ క్రీడా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి సహకార ప్రధాన ప్రణాళికకు మద్దతివ్వడానికి కూడా మేం నిబద్ధతను చాటుకుంటున్నాం.
అమలు ప్రక్రియ ఆచరణ సాధ్యంగా, ఫలితాలను రాబట్టడంపై దృష్టిని కేంద్రీకరించేందిగా ఉండబోతోంది. దీనిలో భాగంగా అందుబాటులో ఉన్న వనరులతో పాటు ప్రధాన కార్యక్రమాల గడువులకు అనుగుణంగా ఏయే కార్యక్రమాలను చేపట్టాలో ఒక ప్రాధాన్య క్రమాన్ని నిర్దేశించుకుంటాం.
ఇప్పటికే ఏర్పరుచుకున్న భాగస్వామ్యాల ద్వారా సహకారాన్ని అందించుకుంటాం. ఈ సహకారానికి సరళతర వ్యవస్థల అండదండలను అందిస్తాం. అంతేకాకుండా, కార్యకలాపాల కోసం వనరులను అందుబాటులోకి తీసుకు వచ్చే బాధ్యతను ప్రతి ఒక్క సందర్భాన్ని లెక్కలోకి తీసుకుని ఖరారు చేస్తారు. ఈ దృష్టికోణం ఆచరణీయ, సుస్థిర, పరస్పరం లాభదాయక ఫలితాలను అందుకొనేందుకు దోహదం చేస్తుంది.
 ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ కింద ప్రస్తావించిన అంశాలను కీలకంగా గుర్తించారు...
1. సామర్థ్యాలను పెంపొందించడం:
     • భారత్‌లో ప్రాధాన్యత కలిగిన క్రీడలలో ఉన్నత స్థాయి ఆట తీరుకు అనువైన క్రీడా కేంద్రాలను నెలకొల్పడం. ఆ కేంద్రాలను నిర్వహించడంలో అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడానికి సహకారాన్ని అందించుకోవడం.
     • పారా స్పోర్ట్‌ను ఒక కీలక ప్రాథమ్యంగా గుర్తించాలి. సహకారానికి తగిన అవకాశంగా చూడాలి. వీటిలో పారా వర్గీకరణ, కోచింగ్, ఆటతీరుకు మద్దతివ్వడంలో ఆస్ట్రేలియా నైపుణ్యాన్ని పొందడం ఒక భాగంగా ఉంటుంది. అంతేకాక ఉపయోగించుకోదగిన అంశాల్లో భారత్, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల మధ్య సంభావిత సంబంధాలను నెలకొల్పుకోవాలి.
     • ఆస్ట్రేలియా కోచ్‌లను తీర్చిదిద్దే తీరుపై ఆధారపడిన, ఇరు పక్షాలూ ఇచ్చి పుచ్చుకొనే తీరును సరళతరంగా మార్చాలి. దీంతో భారత కోచ్‌లు, కోచ్ ఎడ్యుకేటర్లను ఆస్ట్రేలియాకీ, ఆస్ట్రేలియా కోచ్‌లు, కోచ్ ఎడ్యుకేటర్లను భారత్‌కీ తీసుకు రావాలి. ఉపయోగానికి వీలున్న చోట్ల ‘ట్రయినరును ట్రయిన్ చేయడం’ విధానాన్ని అనుసరించాలి.
     • భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫిజికల్ ఎడ్యుకేషన్ మార్పిడి కార్యక్రమాన్ని మొదలుపెట్టవచ్చు. ఫలితంగా ఉభయ పక్షాలూ నేర్చుకోవడం, అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడం మాత్రమే కాకుండా పాఠశాల క్రీడలు, క్రీడా విజ్ఞానం, ఫిజికల్ ఎడ్యుకేషన్ లో సామూహిక భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
     •   యోగాకు సంబంధించిన జ్ఞానాన్ని ఆస్ట్రేలియాకు పంచాలి. యోగా సంబంధిత సహకారాన్ని పెంపొందింప చేయాలి. యోగాలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలను గుర్తించాలి. యోగా అందించే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలకు, భారత్‌లో ప్రధాన కేంద్రాన్ని కలిగి ఉన్న యోగాసన స్పోర్ట్‌స్ ఫెడరేషన్ ‘వరల్డ్ యోగాసన’కు గుర్తింపును ఇవ్వాలి.
     • ఇండియా ఆస్ట్రేలియా హై పెర్ఫార్మెన్స్ కోచ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాములో భాగంగా ఎంపిక చేసిన భారతీయ కోచ్‌లకు సామర్థ్యాన్ని పెంచడానికి ఆస్ట్రేలియన్ స్పోర్ట్‌స్ కమిషన్‌తో కలిసి పనిచేయాలి.
     • భారత ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఉపకార వేతనాల ద్వారా ఆస్ట్రేలియాలో ఉన్నత  స్థాయి ఆటతీరును ప్రోత్సహించే కార్యక్రమాల్లో భాగంగా ప్రతిభావంతులైన యువ భారతీయ అథ్లెట్లకు సాయపడడానికి గాను క్రీడా సంస్థలు, విశ్వవిద్యాలయాల వంటి సందర్భోచిత ప్రభుత్వేతర భాగస్వాముల ద్వారా అవకాశాలను అన్వేషించాలి.
2. సహకార పూర్వక క్రీడా విజ్ఞానం, సాంకేతికత పరిశోధన:
     • క్రీడాకారుల ఆటతీరుకు సంబంధించిన విశ్లేషణ, గాయాల నివారణ, క్రీడా సంబంధ పోషణ, ధరించడానికి అనువైన (ప్రదర్శనతో ముడిపడి ఉండే) సాంకేతికత, రికవరీ టెక్నిక్కులు, పారా స్పోర్ట్‌స్ రంగాల్లో భారత్, ఆస్ట్రేలియా లకు చెందిన విశ్వవిద్యాలయాల మధ్య సంయుక్త పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రోత్సహించాలి.
     • భారత, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల మధ్య క్రీడా పాఠ్యక్రమాలకు సంయుక్త పద్ధతిలో రూపకల్పన చేయడానికి గాను భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి.
     • నేషనల్ యాంటి-డోపింగ్ ఏజెన్సీ, స్పోర్ట్ ఇంటెగ్రిటీ ఆస్ట్రేలియా.. ఈ రెండు సంస్థలూ డోపింగుకు వ్యతిరేకంగా చేపట్టే అంతర్జాతీయ కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలి.  దీని కోసం వరల్డ్ యాంటి-డోపింగ్ ఏజెన్సీ (డబ్ల్యూఏడీఏ)కు చెందిన ఆసియా, ఓషనియా కార్యాలయంతో అనుబంధాన్ని  ఏర్పరుచుకోవాలి.  క్రీడా సంబంధ డోపింగుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ‘యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగైనెస్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్ (కన్వెన్షన్) గ్రూప్స్’లో ప్రాతినిధ్యాన్ని స్వీకరించి, ‘వాడా’ నాయకత్వంలోని సామర్థ్య పెంపు కార్యక్రమాలకు మద్దతివ్వాలి.
3. ప్రధాన క్రీడా కార్యక్రమాల నిర్వహణ:
     • ఆస్ట్రేలియా లోని రాష్ట్రాలు, ప్రాంతాలతో పాటు జాతీయ క్రీడా సంస్థలకు సహకరించాలి. ఇది ప్రధాన కార్యక్రమాల నిర్వహణలో అత్యుత్తమ పద్ధతులను అనుసరించడానికి తోడ్పడుతుంది.
     • రెండు దేశాల్లోనూ పరస్పర ప్రయోజనాన్ని అందించే క్రీడలను (ఉదాహరణకు ఆస్ట్రేలియాలో కబడ్డీ, ఖో ఖో, భారత్‌లో ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ లీగ్, బాస్కెట్‌బాల్ వంటివి) ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్ మ్యాచులతో పాటు యువత పాలుపంచుకొనే కార్యక్రమాలను నిర్వహిస్తూ అవకాశాలను అందించాలి.
     • ఒలింపిక్స్, పారాలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడల వంటి ప్రధాన క్రీడా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలతో కలిగే లాభాలను అందుకుంటూ, ప్రధాన క్రీడల నిర్వహణ కాలంలోనూ వాటి కోసం సన్నాహాల్ని చేపట్టే కాలంలోనూ భారత్, ఆస్ట్రేలియా క్రీడా సంస్థల మధ్య ఉమ్మడి సదుపాయాలు, పోటీలు, సహాయక నెట్‌వర్కులపై దృష్టి పెట్టి లాంఛనప్రాయ ఏర్పాట్లతో పాటు, ఇరు పక్షాలూ ఇచ్చి పుచ్చుకొనే తరహా ఏర్పాట్లు చేసుకోవాలి.

     • ఈ ఏడాది డిసెంబరులో చెన్నయ్‌లో నిర్వహించబోయే మొదటి బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) మ్యాచును స్వాగతిస్తూ భారత్‌లో ఏటా బీబీఎల్ మ్యాచులకు ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు ఆసక్తిని చూపేటట్లు  క్రికెట్ ఆస్ట్రేలియాని, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని   ప్రోత్సహించాలి.
4. క్రీడా పరిశ్రమ, పెట్టుబడి వేదిక:
     • క్రీడా సామగ్రి తయారీ, స్పోర్ట్‌స్ మీడియా, ప్రసారం, ఈవెంట్ మేనేజ్‌మెంట్, క్రీడా రంగ అంకుర సంస్థల్లో భారత్, ఆస్ట్రేలియా వాణిజ్య సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఆస్ట్రేలియా ఆర్థిక సహాయంతో 2026 డిసెంబరులో ముంబయిలో నిర్వహించే క్రీడా పరిశ్రమ శిఖరాగ్ర సదస్సు తీర్మానాలకు కార్యరూపాన్ని ఇవ్వాలి.
సమాచారాన్ని అందజేసే కార్యక్రమాలను ఆదానప్రదానంగా నిర్వహించి భారత క్రీడా మార్కెట్లో ఆస్ట్రేలియా క్రీడా రంగ వాణిజ్య సంస్థలకు,అలాగే ఆస్ట్రేలియా క్రీడా మార్కెట్లో భారత్ క్రీడా రంగ వాణిజ్య సంస్థలకు వెసులుబాటును కల్పించాలి.
     • ఉన్నత నాణ్యత, పోటీపడే తత్వంతో కూడిన ధరలకు లభించే క్రీడా ఉపకరణాలను భారత్ నుంచి ఆస్ట్రేలియాకు ఇప్పటి కన్నా ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేయాలి.
     • ఉత్తమ శ్రేణి ఆట తీరు అవసరమయ్యే క్రీడలలో ఆస్ట్రేలియా ప్రావీణ్య ఎగుమతి ప్రక్రియను విస్తరించాలి. దీనిలో  శిక్షణ, కోచ్‌లను తీర్చిదిద్దడం, శక్తి, కండీషనింగ్, క్రీడాకారుల శ్రేయస్సు, పోషణ, మనోవి‌జ్ఞానం భాగంగా ఉంటాయి.
5. క్రీడలలో మహిళల భాగస్వామ్యం:
    •  మహిళలకు ఆర్థిక సాధికారిత కల్పన, నాయకత్వం, ఆరోగ్యం, సామాజిక సమ్మిళితత్వ సాధనకు క్రీడలు ఒక శక్తిమంతమైన సాధనం అన్న విషయాన్ని గుర్తిస్తూ, ఆస్ట్రేలియా క్రీడా కమిషన్ ముఖ్య కార్యక్రమాల నుంచి స్ఫూర్తిని పొదుతూ సంయుక్త కార్యక్రమాలను మొదలుపెట్టాలి. ఆ కార్యక్రమాలు
మహిళల్లో నేతృత్వం, ఆరోగ్యం, ఉన్నత స్థాయి ప్రదర్శన, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేవిగా ఉండాలి. దీనిలో మహిళా అథ్లెట్లకు ద్వైపాక్షిక ఆటల పోటీల నిర్వహణ కూడా ఒక భాగంగా ఉంటుంది.

 

***


(रिलीज़ आईडी: 2283336) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam