ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ప్రధానమంత్రికి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్‌ ది రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండోనేషియా’... స్వయంగా ప్రదానం చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు

प्रविष्टि तिथि: 07 JUL 2026 3:27PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రికి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ గౌరవ పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంటో నేడు ప్రదానం చేశారు. ఈ అవార్డు ఇండోనేషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నతమైన పౌర పురస్కారం కావడం విశేషం. భారత్-ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చూపిన అద్భుతమైన నాయకత్వానికి, ఆయన అందించిన విశేషమైన సహకారానికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేశారు. ఈ అవార్డును భారత్, ఇండోనేషియా దేశాల ప్రజలకు, ఉభయ దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలకు అంకితం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.


(रिलीज़ आईडी: 2282213) आगंतुक पटल : 39
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam