ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పహాడ్‌పూర్‌లో ఉన్న సంతాలీ జహేరా, హో జహేరాను పూజించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 JUN 2026 8:51PM by PIB Hyderabad

పహాడ్‌పూర్ గ్రామంలో ఉన్న సంతాలీ జహేరాహో జహేరాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూజలు నిర్వహించారు.

గిరిజన వర్గాలు పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాలనూప్రకృతితో వారికున్న అనుబంధాన్నీ ఈ పవిత్ర వనాలు ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.

ఇలాంటి ఆచారాలూసంప్రదాయాలూ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని శ్రీ మోదీ తెలియజేశారు.

కాలానికి అతీతంగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాలను పరిరక్షించడంలోనూభవిష్యత్తు తరాలకు అందించడంలో తమ చిత్తశుద్ధిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘పహాడ్‌పూర్ గ్రామంలోని సంతాలీ జహేరాహో జహేరాను రాష్ట్రపతితో పాటు దర్శించుకున్నాను.

మన గిరిజన వర్గాలు పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాలనూప్రకృతితో వారికున్న అనుబంధాన్నీ ప్రతిబింబించే ఈ పవిత్ర వనాలను పూజించాంఇలాంటి ఆచారాలు సుసంపన్నమైన భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం.

కాలానికి అతీతమైన ఈ సంప్రదాయాలను పరిరక్షించిభవిష్యత్తు తరాలకు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం.’’

 

****


(రిలీజ్ ఐడి: 2281451) సందర్శకుల సూచీ సంఖ్య : : 26