గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేటి నుంచి దేశవ్యాప్తంగా వీబీ - జీ రామ్ జీ చట్టం అమల్లోకి వస్తుంది; “గ్రామీణ భారతదేశానికి చారిత్రాత్మక రోజు”: శివరాజ్ సింగ్ చౌహాన్


వీబీ - జీ రామ్ జీ జాతీయ ఆవిష్కరణ కార్యక్రమం జూలై 2న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరగనుంది; కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు

వీబీ - జీ రామ్ జీ కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేశారు; రూ.300 కంటే తక్కువ దినసరి వేతనం నోటిఫై చేయబడలేదు, జాతీయ సగటు వేతనం 10 శాతానికి పైగా పెరిగింది

प्रविष्टि तिथि: 01 JUL 2026 6:22PM by PIB Vijayawada

గ్రామీణ జీవనోపాధులను బలోపేతం చేయడంలో, అభివృద్ధి చెందిన గ్రామీణ భారతదేశ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తూ, వికసిత్ భారత్రోజ్గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) [వీబీ - జీ రామ్ జీ] చట్టం, 2025 రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. చట్టం ప్రారంభంతో, అర్హులైన గ్రామీణ కుటుంబాలు ఇప్పుడు 125 రోజుల హామీతో కూడిన వేతన ఉపాధికి చట్టబద్ధమైన హక్కును పొందుతాయి. చట్టం గ్రామీణ ఉపాధిని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ఫలితాధారితంగా చేయడంతో పాటు, శాశ్వత గ్రామీణ ఆస్తుల సృష్టి, సహజ వనరుల పరిరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, జీవనోపాధి ప్రోత్సాహం, మహిళా నేతృత్వంలోని అభివృద్ధిని వేగవంతం చేయడానికి కృషి చేస్తుంది.

చట్టం అమలులోకి రావడంతో, భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు నోటిఫైడ్ వేతన ప్రాంతాల కోసం వీబీ జీ-రామ్ జీ చట్టం, 2025 కింద సవరించిన వేతన రేట్లను కూడా నోటిఫై చేసింది. దీంతో దేశంలో ఎక్కడా సరే నోటిఫైడ్ రోజువారీ వేతనం రూ.300 కంటే తక్కువగా ఉండదు. జాతీయ సగటు నోటిఫైడ్ వేతనం రోజుకు రూ.298.8 నుంచి రూ.327.4 కు పెరిగింది, ఇది సగటున 10 శాతానికి పైగా పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వేతనాలు 15 నుండి 25 శాతం వరకు పెరిగాయి. మొదటి రోజు నుండే చట్టం సజావుగా, సమర్థవంతంగా అమలయ్యేలా చూసేందుకు, నిరంతర ఉపాధి కల్పన, సకాలంలో వేతన చెల్లింపులు, అభివృద్ధి పనుల అమలును సులభతరం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.95,692.31 కోట్ల మధ్యంతర కేటాయింపును విడుదల చేసింది.

 

కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. రోజు గ్రామీణ భారతదేశానికి చారిత్రాత్మక, అపూర్వమైన రోజు అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, వీబీ జీ-రామ్ జీ చట్టం కేవలం కొత్త చట్టం మాత్రమే కాదని, ఇది లక్షలాది గ్రామీణ కార్మికులకు గౌరవం, ఆత్మగౌరవం, జీవనోపాధి భద్రతతో కూడిన ఒక కొత్త శకాన్ని తీసుకువచ్చే పరివర్తనాత్మకమైన చొరవ అని అన్నారు. అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు 100 రోజులకు బదులుగా 125 రోజుల ఉపాధికి చట్టబద్ధమైన హక్కు ఉంటుందని తెలిపారు.

 

అర్హులైన గ్రామీణ కార్మికుడు ఒక్క రోజు కూడా ఉపాధి కోల్పోకుండా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని చౌహాన్ తెలియజేశారు. చట్టం సజావుగా అమలు కావడానికి అవసరమైన అన్ని పరిపాలనా, ఆర్థిక, సాంకేతిక సన్నాహాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేశాయని వెల్లడించారు. ఇది గ్రామాలలో కొత్త జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తుందని, శాశ్వత ఆస్తుల సృష్టిని వేగవంతం చేస్తుందని, మహిళా సాధికారతను బలోపేతం చేస్తుందని, ఆత్మనిర్భర్, వికసిత గ్రామీణ భారతదేశం అనే దార్శనికతకు కొత్త శక్తినిస్తుందని అన్నారు. సుసంపన్నమైన, సాధికారత కలిగిన, స్వయం సమృద్ధి గల గ్రామాలను నిర్మించడంలో పౌరులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

వీబీ - జీ రామ్ జీ చట్టం, 2025 జాతీయ అమలును పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా, ఓబులవారిపల్లె మండలం, ముక్కవారిపల్లె గ్రామంలో 2 జూలై 2026 జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, సహాయ మంత్రి డా. చంద్రశేఖర్ పెమ్మసాని, సహాయ మంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.

జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా వీబీ జీ-రామ్ జీ ని లాంఛనంగా ప్రారంభించడం, లబ్ధిదారులకు గ్రామీణ ఉపాధి హామీ కార్డులను పంపిణీ చేయనున్నారు. అలాగే, వీబీ - జీ రామ్ జీ సాఫ్ట్వేర్ వేదికను ప్రారంభించి, కీలక ప్రచురణలను విడుదల చేస్తారు. లబ్ధిదారులతో సంభాషించడం, చట్టం సమర్థవంత అమలకు అవసరమైన అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.


(रिलीज़ आईडी: 2280020) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Odia , Tamil , Telugu , Malayalam