ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జీఎస్టీ అప్పెల్లెట్ ట్రిబ్యునల్ ఎదుట అప్పీళ్ల దాఖలుకు చివరి తేదీని జూలై 31, 2026 వరకు పొడగించిన ప్రభుత్వం

प्रविष्टि तिथि: 30 JUN 2026 11:55AM by PIB Hyderabad

సెక్షన్ 112(1), సెక్షన్ 112(3) ప్రకారం వస్తుసేవల పన్ను అప్పెల్లెట్ ట్రిబ్యునల్ (జీఎస్‌టీఏటీఎదుట అప్పీళ్ల దాఖలుకు నిర్దేశించిన గడువును జూలై 31, 2026 వరకు ప్రభుత్వం పొడిగించింది.

ప్రభుత్వం 17.09.2025న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జీఎస్‌టీఏటీ ఎదుట అప్పీళ్లను దాఖలు చేసేందుకు 30.06.2025 చివరి తేదీగా ప్రకటించింది.

జీఎస్‌టీఏటీ పోర్టల్‌లో అప్పీళ్లు దాఖలు చేసేందుకు ఆఖరి నిమిషంలో ఏర్పడుతున్న రద్దీ కారణంగా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి కారణంగాప్రభుత్వం అప్పీలు దాఖలుకు చివరి తేదీని పొడిగించిందిఈ గడువును ముందస్తుగా 2025 సెప్టెంబర్‌లోనే ప్రకటించినప్పటికీ.. గత 15 రోజుల్లో ఏకంగా 30,000 అప్పీళ్లు దాఖలయ్యాయిరోజువారీగా గరిష్ఠంగా 5,500 అప్పీళ్లు దాఖలయ్యాయి.

అప్పీలు దాఖలుకు పన్ను చెల్లింపుదారులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలనిగడువు తేదీ వరకు వేచి ఉండవద్దని ప్రభుత్వం సూచించింది.

 

***


(रिलीज़ आईडी: 2279294) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam