ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
31 మిలియన్లకు పైబడిన ఆధార్ యాప్ డౌన్‌లోడ్‌లు... ఈ యాప్‌ను వినియోగిస్తున్న వారు పెరుగుతున్నారనడానికి ఇదే సూచిక
కొత్త ఆధార్ యాప్‌ను ఉపయోగించుకుంటూ మొబైల్ నంబరును అప్‌డేట్ చేసుకున్న వారు సుమారు 40 లక్షల మంది
ఆధార్ యాప్‌ను ఉపయోగించి అడ్రసును అప్‌డేట్ చేసుకున్న వారు దాదాపు 8.5 లక్షల మంది
प्रविष्टि तिथि:
22 JUN 2026 3:29PM by PIB Hyderabad
ఆధార్ యాప్‌నకు భారత్ అంతటా ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీనిని ప్రారంభించిన 5 నెలల కన్నా తక్కువ సమయంలో 3.1 కోట్ల కన్నా ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇది ఈ యాప్ పట్ల ప్రజల్లో భరోసా పెరుగుతుండటాన్ని సూచిస్తోంది. వివిధ సేవలను వారికి చాలా సులభంగా ఈ యాప్ అందిస్తుండడం ఈ ఆదరణకు కారణం అవుతోంది.
జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచే దృష్టితో రూపొందించిన కొత్త ఆధార్ యాప్ ప్రజలకు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే మొబైల్ నంబరును అప్‌డేట్ చేసుకోవడం, చిరునామాను అప్‌డేట్ చేసుకోవడం సహా వివిధ సేవలను సులభంగా పొందేందుకు వీలు కల్పిస్తోంది.
ఇంతవరకు, సుమారు 40 లక్షల మంది నూతన ఆధార్ యాప్‌ను ఉపయోగించి తమ మొబైల్ నంబరును అప్‌డేట్ చేసుకున్నారు. అలాగే, 8,50,000 మంది ఈ యాప్‌ను ఉపయోగించి తమ చిరునామాను అప్‌డేట్ చేసుకున్నారు.
ఆధార్ సంఖ్యను కలిగి ఉన్న వారికి (ఆధార్ నంబర్ హోల్డర్స్.. ఏఎన్‌హెచ్) తమ గుర్తింపును ప్రదర్శించే, పంచుకొనే, ప్రమాణీకరించేందుకు సౌకర్యకర పద్ధతిని, గోపనీయతకు ప్రాధాన్యాన్నిచ్చే పద్ధతిని అందించేలా ఈ యాప్‌ను రూపొందించారు.
అనేక ప్రజాహితకర సౌకర్యాలు ఈ యాప్‌లో జతపరిచారు. వాటిలో.. ఒక్క క్లిక్‌లో బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్, ఉనికిని ప్రమాణీకరించడానికి ముఖాన్ని సరిచూడటం, ప్రమాణీకరణ చరిత్ర, విజిటింగ్ కార్డులకు బదులు సమాచారాన్ని పంచుకోవడానికి క్యూఆర్ కోడ్ ఆధారిత, మార్పుచేర్పులకు వీలు ఉండే కాంటాక్ట్ కార్డు వంటివి ఉన్నాయి. ఇది ఈ-ఆధార్ (e-Aadhaar)ను డౌన్‌లోడ్ చేైసుకొనే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఆధార్ సేవా కేంద్రాల వంటి చోట్లకు వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంటును బుక్ చేసుకోవడాన్ని సరళతరం చేస్తుంది.
నిజ జీవితంలో అనేక రకాల ఉపయోగాలకు ఆధార్ యాప్ సహాయపడుతుంది. ఈ ఉపయోగాలలో.. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీ (ఓవీఎస్ఈ)కి చెందిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హోటల్ చెక్-ఇన్‌లను పూర్తి చేసుకోగలగడం వంటివి కలిసి ఉన్నాయి. ఇది ఆసుపత్రిలో చేరికలకు, సందర్శకుల నిర్వహణకు, కార్యక్రమాలలో ప్రవేశించడానికి, గిగ్ వర్కర్లతో పాటు సర్వీస్ పార్ట్‌నర్ల గుర్తింపును సరిచూడటం వంటి ఇతర పనులకు కూడా తోడ్పడుతుంది.
ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ వేదికల్లో కొత్త ఆధార్ యాప్ అందుబాటులో ఉంది. దీనిని ప్రజలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ:
ఆండ్రాయిడ్ లో అయితే - https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.pehchaan&hl=en_IN
ఐఓఎస్ లో అయితే - https://apps.apple.com/in/app/aadhaar/id6744029871
***
(रिलीज़ आईडी: 2276684)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Gujarati
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Kannada