ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేషన్స్ కప్ మహిళల హాకీ విజేతగా నిలిచిన హాకీ మహిళల జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 21 JUN 2026 5:13PM by PIB Hyderabad
నేషన్స్ కప్ మహిళల హాకీ విజేతగా నిలిచిన భారతీయ మహిళా హాకీ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

టోర్నమెంటు అంతటా జట్టు అసాధారణ ఆటతీరును కనబరిచిందని ప్రధానమంత్రి ప్రశంసించారు.
జట్టుకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ, హాకీ ఆట ఆడటానికి అనేక మంది ముందుకు వచ్చేటట్లు ఈ గెలుపు స్ఫూర్తిని అందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘భారతీయ హాకీ క్రీడాకారిణులు మనమంతా సంతోషించే, గర్వపడే పనిని చేశారు.

నేషన్స్ కప్ మహిళల హాకీ విజేతగా నిలిచిన మహిళా జట్టుకు అభినందనలు. పూర్తి టోర్నమెంటులో జట్టు చాలా అసాధారణ ఆటతీరును కనబరిచింది. జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ గెలుపు.. మరింత మంది హాకీ ఆడడానికి స్ఫూర్తిని అందించాలని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 
***

(రిలీజ్ ఐడి: 2276412) సందర్శకుల సూచీ సంఖ్య : : 58