ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 JUN 2026 8:32AM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.  

 

ధైర్యం, సరళత, వినయం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధతతో కూడిన ఆమె జీవిత ప్రయాణం దేశవ్యాప్తంగా ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

  

రాష్ట్రపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారని శ్రీ మోదీ గుర్తుచేశారు. ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన, అణగారిన వర్గాల సంక్షేమం పట్ల ఆమెకు ఉన్న ప్రత్యేక శ్రద్ధను ఆయన కొనియాడారు.  

 

దేశ అభివృద్ధి పట్ల ఆమెకున్న దృఢమైన అంకితభావం ఎంతో స్పూర్తిదాయకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  

 

దేశ సేవలో ఆమె సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. అలాగే ఒడిశాలో జరగనున్న ఒక కార్యక్రమంలో నేడు (శనివారం) ఆమెను కలవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.  

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు. 

 

‘‘భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి జన్మదిన శుభాకాంక్షలు. ధైర్యం, సరళత, వినయం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధతతో కూడిన ఆమె ప్రస్థానం దేశవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. 

 

తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఆమె దేశానికి అత్యుత్తమ రీతిలో సేవలు అందించారు. ముఖ్యంగా వెనుకబడిన, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఎంతగానో తపించారు. భారతదేశ అభివృద్ధి పట్ల ఆమెకున్న అంకితభావం ఎంతో స్పూర్తిదాయకం.

 

 దేశ సేవలో ఆమె దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను. నేడు ఒడిశాలో జరగబోయే కార్యక్రమంలో ఆమెను కలవడానికి నేను ఎదురుచూస్తున్నాను’’.

***


(रिलीज़ आईडी: 2275606) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam