ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక విజయంగా ఇండియా- యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసించిన ప్రధాని

प्रविष्टि तिथि: 17 JUN 2026 10:03PM by PIB Hyderabad

2026 జులై 15 నుంచి ఇండియా-యూకే సమగ్ర ఆర్థికవాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుండటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్నీపెట్టుబడులనూ ప్రోత్సహిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

భారతీయ రైతులూశ్రామికులూఎంఎస్ఎంఈలూఅంకురసంస్థలూఆవిష్కర్తలకు అనేక అవకాశాలను ఈ ఒప్పందం అందిస్తుందని శ్రీ మోదీ చెప్పారుఅలాగే వికసిత్ భారత్ - 2047 సాకారం కావడానికి అర్థవంతమైన సహకారం అందిస్తుందన్నారు.

ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొంటున్న తానుయూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇద్దరూ భారత్-యూకే ఆర్థిక సంబంధాలకు అర్థవంతమైన వేగం తోడవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘భారత్యూకే సంబంధాల్లో ఇదో చరిత్రాత్మక విజయం.

ఇండియా-యూకే సమగ్ర ఆర్థికవాణిజ్య ఒప్పందం 2026 జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

ఈ ఒప్పందం మన ద్వైపాక్షిక వాణిజ్యాన్నీపెట్టుబడులనూ గణనీయంగా పెంపొందిస్తుంది.

భారతీయ రైతులూశ్రామికులూఎంఎస్ఎంఈలూఅంకుర సంస్థలూఆవిష్కర్తలకూ ఇది అనేక అవకాశాలను అందిస్తుందిఅలాగే వికసిత్ భారత్-2047 లక్ష్యం సాకారమయ్యేందుకు అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుంది.

మన ఆర్థిక సంబంధాలకు కొత్త వేగం తోడవడం పట్ల జీ-7 సదస్సు కోసం ఏవియన్‌లో ఉన్న నేనూపీఎం స్టార్మర్ ఇద్దరూ సహజంగానే సంతోషిస్తున్నాం.’’

 

***


(रिलीज़ आईडी: 2274506) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam