ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రఖ్యాత బౌద్ధ పండితుడు రాబర్ట్ ఎ.ఎఫ్. థర్మన్ కన్నుమూత సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 JUN 2026 5:30AM by PIB Hyderabad

రాబర్ట్ ఎ.ఎఫ్థర్మన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

బౌద్ధ ధర్మ ప్రఖ్యాత పండితుల్లో థర్మన్ ఒకరనీఆయన ఓ విశిష్ట గురువనీజీవితాంతం భారత్‌కు స్నేహితుడుగా నడుచుకున్నారంటూ ప్రధానమంత్రి ప్రశంసించారుథర్మన్ తన రచనలతో ప్రపంచమంతటా బౌద్ధానికి జనాదరణ లభించేటట్లు చేశారనీవివిధ సంస్కృతుల మధ్య అవగాహనా సేతువులను నిర్మించారనీ శ్రీ మోదీ అన్నారు.
కొన్ని సంవత్సరాల కిందట న్యూయార్క్ సిటీలో థర్మన్‌తో భేటీని ప్రధానమంత్రి గుర్తు చేసుకుంటూతమ మధ్య అత్యంత ఫలప్రద మాటామంతీ చోటుచేసుకొందన్నారు.
ఈ విషాద సమయంలో థర్మన్ కుటుంబానికీస్నేహితులకీఅభిమానులకీ ప్రధాని సంతాపాన్ని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ
:
‘‘
రాబర్ట్ ఎ.ఎఫ్థర్మన్ మృతి వార్త విచారకరంబౌద్ధ ధర్మ ప్రఖ్యాత పండితుల్లో ఒకరాయనఓ విశిష్ట గురువుజీవితాంతం భారత్‌కు మిత్రునిగా మెలిగారుతన రచనలతో బౌద్ధానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణను సంపాదించి పెట్టారువేర్వేరు సంస్కృతుల మధ్య కలకాలం నిలిచి ఉండే అవగాహనా సేతువులను నిర్మించారుకొన్ని సంవత్సరాల కిందట న్యూయార్క్ సిటీలో మా భేటీని ఆప్యాయంగా గుర్తుచేసుకుంటున్నానుమా మధ్య గొప్ప సంభాషణ చోటుచేసుకుందిఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికీస్నేహితులకీఅభిమానులకీ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2274503) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam