హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మోదీ హయాంలోని 12 ఏళ్ల పాలనలో పౌరులకు రక్షణ కల్పిస్తూ

శత్రువులను తుదముట్టించే రక్షణ కోటగా భారత్ పునర్నిర్మితమైందన్న కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా

సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్, ఆర్టికల్ 370 రద్దు, నక్సలిజం నిర్మూలన ద్వారా జాతీయ భద్రత పట్ల

దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత్

प्रविष्टि तिथि: 17 JUN 2026 2:13PM by PIB Hyderabad

జాతీయ భద్రత బలోపేతానికి 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఇవాళ కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రస్తావించారు. 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో పౌరులకు రక్షణ కల్పించేశత్రువులను తుదముట్టించే రక్షణ కోటగా భారత్ పునర్నిర్మితమైనందని శ్రీ అమిత్ షా అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. "మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో పౌరులకు రక్షణ కల్పిస్తూశత్రువులను తుదముట్టించే రక్షణ కోటగా భారత్ పునర్నిర్మితమైందిసరిహద్దు వెంబడి సర్జికల్ స్ట్రైక్వైమానిక దాడులుఆపరేషన్ సిందూర్ వంటి చర్యలుఆర్టికల్ 370 రద్దునక్సలిజం నిర్మూలన, 12కుపైగా ఒప్పందాల ద్వారా ఈశాన్య ప్రాంతంలో అంతర్గత భద్రతను బలోపేతం చేయటం ద్వారా ప్రపంచం ప్రశంసించేలా జాతీయ భద్రత పట్ల బలమైన నిబద్ధతను భారత్ చాటుకుంది"

 

***


(रिलीज़ आईडी: 2274009) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Bengali-TR , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam