పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ప్రతిపాదిత మధ్య ప్రాచ్య-భారత్ డీప్‌వాటర్ పైప్‌లైన్ (ఎమ్ఈఐడీపీ)పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై ప్రభుత్వ స్పష్టీకరణ
నాడు పోస్టు చేయడమైనది:
16 JUN 2026 11:44AM by PIB Hyderabad
సముద్ర అంతర్భాగంలో ఇంధన సరఫరాకు సంబంధించి ఒక గొట్టపుమార్గాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న అనేక కథనాలు….. పెట్రోలియమ్, సహజవాయు శాఖ దృష్టికి వచ్చాయి. గుజరాత్‌ను ఒమన్, తదితర గల్ఫ్ దేశాలతో అనుసంధానిస్తున్నారంటూ దీనిని- మిడిల్ ఈస్ట్-ఇండియా డీప్‌వాటర్ పైప్‌లైన్ (ఎమ్ఈఐడీపీ)-గా చెబుతున్నారు.
అయితే ఇలాంటి ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి మంత్రిత్వశాఖ పరిశీలనలో లేదని స్పష్టం చేయదలచుకున్నట్లు పెట్రోలియమ్, సహజవాయుశాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టు విషయంలో మంత్రిత్వ శాఖ ఏ స్థాయిలోనూ ఒమన్ తోగాని, లేదా మరే ఇతర గల్ఫ్ దేశాలతోగానీ సంప్రదింపులను నిర్వహించలేదని పేర్కొంది.
దీనితో ముడిపడిన ఊహాకల్పనలన్నింటికీ స్వస్తి పలకడానికే ఈ స్పష్టీకరణను ఇస్తున్నట్లు తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2273468)
సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam