ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇరుదేశాల మధ్య నిధుల బదిలీ విధానాన్ని ప్రారంభించిన భారత్- నేపాల్

ద్వైపాక్షిక ఆర్థిక అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా కీలక చర్య

భారత యూపీఐ, నేపాల్ జాతీయ చెల్లింపుల వేదికలను నేరుగా అనుసంధానించడం ద్వారా.. అంతరాయం లేని, సురక్షిత, తక్షణ ప్రత్యక్ష (పీ2పీ) నగదు బదిలీ

ఆర్థిక సమ్మిళితత్వం బలోపేతం, డిజిటల్ - ఆర్థిక ఏకీకరణకు ఊతం, ఇరుదేశాల్లోని ప్రయాణికులు, వ్యాపారాలకు మెరుగైన సౌలభ్యం

प्रविष्टि तिथि: 11 JUN 2026 3:47PM by PIB Hyderabad

డిజిటల్ ఆర్థిక అనుసంధానంపొరుగు దేశాలతో పరస్పర సహకారానికి మరింత ఊతాన్నిస్తూ... ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష (పీ2పీనిధుల బదిలీ విధానాన్ని 2026 జూన్ 6న భారత్నేపాల్ అధికారికంగా ప్రారంభించాయి.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ వ్యవస్థ.. భారత ఏకీకృత చెల్లింపుల వేదిక (యూపీఐ), నేపాల్‌ జాతీయ చెల్లింపుల వేదిక (ఎన్‌పీఐ)ల మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని ఏర్పరుస్తుందిఈ అనుసంధానం ద్వారా ఇరు దేశాల ప్రజలు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లుడిజిటల్ వాలెట్ల ద్వారా.. అంతరాయం లేకుండానేరుగాసురక్షితంగా తక్షణమే నిధులను బదిలీ చేసుకోవచ్చు.

ఆర్థిక సమ్మిళితత్వంభారత్ నేపాల్ మధ్య బలమైన ఆర్థికడిజిటల్ సంబంధాలను పెంపొందించుకోవడంలో ఈ యూపీఐ ఎన్‌పీఐ అనుసంధానం కీలకమైన ముందడుగుసులభంగా అందుబాటులో ఉండేసురక్షితమైనతక్కువ వ్యయంతో ఇరు దేశాల నడుమ చెల్లింపులకు సంబంధించిన ప్రాంతీయ లక్ష్యాలతో ఇది పూర్తిగా సరిపోతుందిదీర్ఘకాలంగా ఉన్న సామాజికఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.

ఆర్థికడిజిటల్ ఏకీకరణకు చోదకశక్తి:

భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐఅంతర్జాతీయ విభాగమైన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) - నేపాల్ క్లియరింగ్ హౌస్ లిమిటెడ్ (ఎన్‌సీహెచ్ఎల్మధ్య సంయుక్త భాగస్వామ్యంతో ఈ సాంకేతిక అనుసంధానం సాకారమైంది.

వ్యూహాత్మక ప్రభావంయూపీఐ ఎన్‌పీఐ చెల్లింపుల అనుసంధానంలో ముఖ్యమైన అశాలు:

రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగే విధానంలో కీలక మార్పును సూచిస్తూ.. ఈ డిజిటల్ చెల్లింపుల విధానం తక్షణ ప్రయోజనాలను అందిస్తుంది:

  • ప్రయాణికులకు మెరుగైన సౌలభ్యంభౌతికంగా నగదు వినియోగాన్నిభారీ మొత్తంలో నగదును వెంట ఉంచుకోవాల్సిన అవసరాన్నివిదేశీ మారకపు రుసుములకు సంబంధించిన అయోమయాన్ని దూరం చేస్తుంది.

  •  స్థానిక వర్తకులకు ఆర్థికంగా ఊతంసాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న పెద్ద సంఖ్యలోని భారతీయ పర్యాటకులు.. నేపాల్ వ్యాపార సంస్థలకు మరింత సులభంగా చేరువవుతారుదీంతో లావాదేవీల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది.

  • నిర్వహణ సామర్థ్యంస్థానిక వ్యాపారులకు నగదు నిర్వహణ సులువవుతుందిభౌతికంగా నగదును నిర్వహించడంభద్రపరచడానికి సంబంధించిన అదనపు ఖర్చులు తగ్గుతాయిలావాదేవీల సొమ్ము ఎప్పటికప్పుడు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుంది.

  • నేరుగాఅంతరాయం లేకుండా నగదు బదిలీ: సరిహద్దులు దాటి ప్రయాణించేటప్పుడు భౌతికంగా నగదును వెంట తీసుకెళ్లాల్సిన అవసరాన్ని దూరం చేస్తుందిఅలాగే కాలయాపనతో కూడిన పాతకాలపు బ్యాంకింగ్ విధానాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా యూపీఐ విస్తరణ:

తొమ్మిది దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి – సింగపూర్యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ఫ్రాన్స్మారిషస్నేపాల్భూటాన్ఖతార్శ్రీలంకకంబోడియాఇది భారతీయ పర్యాటకులు తమకు అలవాటైన డిజిటల్ వేదికల ద్వారానే ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా చెల్లింపులు చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది.  

 

***


(रिलीज़ आईडी: 2271851) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam