ప్రధాన మంత్రి కార్యాలయం
పౌరులకు స్పష్టమైన ఫలితాలనిచ్చే పాలన ప్రాధాన్యతను వివరిస్తూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 JUN 2026 10:01PM by PIB Hyderabad
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీశ్ కుమార్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పంచుకున్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా వరుసగా అత్యధిక కాలం భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నికైన పీఎం నరేంద్ర మోదీని ఈ కథనం ప్రశంసించింది. అత్యయిక స్థితి నాటి పోరాటాలను గుర్తు చేస్తూ... ప్రభుత్వం సాధించిన ఎన్నో విజయాలను వివరించింది. పౌరులకు స్పష్టమైన ఫలితాలను అందించేలా చూడటమే పీఎం మోదీ నాయకత్వంలోని పాలన లక్షణమని పేర్కొంది.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ శ్రీ నితీశ్ కుమార్ రాసిన ఈ కథనం.. ప్రజాస్వామ్యయుతంగా వరుసగా అత్యధిక కాలం భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నికైన పీఎం నరేంద్ర మోదీని అభినందించింది. ఎమర్జెన్సీ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను ఈ కథనం ద్వారా గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ఎన్నో విజయాలను ప్రస్తావించటంతో పాటు పౌరులకు స్పష్టమైన ఫలితాలను అందించేలా చూడటమే పీఎం మోదీ నాయకత్వంలోని పాలన లక్షణమని శ్రీ నితీశ్ కుమార్ పేర్కొన్నారు".
***
(रिलीज़ आईडी: 2271543)
आगंतुक पटल : 37
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam